Share News

పవన్‌కు భారీ మెజార్టీ ఇవ్వండి

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:29 AM

కోనపాపపేట(కొత్తపల్లి), ఏప్రిల్‌ 18: పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకు డిపాజిట్‌ రాకుండా టీడీపీ-జనసేన- బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పవన్‌కళ్యాణ్‌కు భారీ మెజార్టీ ఇ వ్వాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌వర్మ పిలుపునిచ్చారు. కోనపాపపేట తీరప్రాం తంలో సినీనటుడు పృథ్వీరాజ్‌తో పా

పవన్‌కు భారీ మెజార్టీ ఇవ్వండి
కొత్తపల్లి: సమావేశంలో మాట్లాడుతున్న వర్మ

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ

కోనపాపపేట(కొత్తపల్లి), ఏప్రిల్‌ 18: పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకు డిపాజిట్‌ రాకుండా టీడీపీ-జనసేన- బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పవన్‌కళ్యాణ్‌కు భారీ మెజార్టీ ఇ వ్వాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌వర్మ పిలుపునిచ్చారు. కోనపాపపేట తీరప్రాం తంలో సినీనటుడు పృథ్వీరాజ్‌తో పాటు మత్స్యకారులకు ఏర్పాటుచేసిన సమావేశంలో వర్మ మాట్లాడారు. తీరప్రాం త గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయన్నారు. తీరప్రాం తంలో బల్క్‌డ్రగ్‌ రసాయనపరిశ్రమ నుంచి విడుదల య్యే వ్యర్థజాలలను సముద్రంలోకి ఏర్పాటు చేసిన పైప్‌ లైన్‌ ప్రొక్లెయిన్‌తో తీద్దాం దమ్ము, ధైర్యం ఉంటే వస్తారా అని గీతకు సవాల్‌ విసిరారు. పవన్‌కు ఓట్లేసి విజయం చేకూర్చాలని కోరారు. టీడీపీ నాయకులు అనిశెట్టి సత్యాన ందరెడ్డి, జనసేన నాయకులు డాక్టర్‌ జ్యోతుల శ్రీనివాస్‌, తెలగంశెట్టి వెంకటేశ్వరావు, కంబాల దాసు, పల్లేటి బాప న్నదొర, కంబాల రాంబాబు, మత్స్యకారులు పాల్గొన్నారు.

పిఠాపురం: పట్టణంలోని డ్రైవర్స్‌కాలనీలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఇంటింటా ప్రచారం నిర్వహించి ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లు రెండు జనసేనకు వేసి పవన్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. జనసేన తెలంగాణ ఇన్‌చార్జి శంకరగౌడ్‌, టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కొండేపూడి ప్రకాష్‌, నాయకులు కీర్తి దొరబాబు, నల్లా గోవిందు, కోన అర్జున్‌, తలారి శ్రీను, గౌతు సతీష్‌, గొడుగుల సూరిబాబు, పిల్లి చిన్నా, కొరుప్రోలు శ్రీను ఉన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:29 AM