ఏలేరు, సుద్దగడ్డ ఆధునికీకరణ చేపట్టాలి
ABN , Publish Date - Jan 07 , 2024 | 12:14 AM
గొల్లప్రోలు, జనవరి 6: ఏలేరు, సుద్దగడ్డ ఆధు నికీకరణ పనులు తక్షణం చేపట్టాలంటూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్ వర్మ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేపట్టారు. ప్రధాన రహదారులపై ప్రదర్శన జరిపి గొల్లప్రోలు తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. పనులపై వైసీపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. వరద ముంపు నుంచి శాశ్వత రక్షణతో పాటు సాగునీటి సమస్య పరిష్కా
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ
గొల్లప్రోలు, జనవరి 6: ఏలేరు, సుద్దగడ్డ ఆధు నికీకరణ పనులు తక్షణం చేపట్టాలంటూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్ వర్మ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేపట్టారు. ప్రధాన రహదారులపై ప్రదర్శన జరిపి గొల్లప్రోలు తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. పనులపై వైసీపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. వరద ముంపు నుంచి శాశ్వత రక్షణతో పాటు సాగునీటి సమస్య పరిష్కారం కోసం ఏలేరు, సుద్దగడ్డ ఆధునీకరణకు తెలుగుదేశం పార్టీ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు రూ.156కోట్లు మంజూరు చేసి టెండర్లు ఖరారు చేసి పనులకు శంకుస్థాపన చేశారన్నారు. పనులు ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయామన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగా ఎం పీ, ఎమ్మెల్యేలు పనులు అవసరం లేదంటూ లేఖ ఇచ్చి రద్దు చేయించారన్నారు. టీడీపీ హయాంలో చేపట్టి 70శాతంపైగా పూర్తి చేసిన ఏలేరు ఫేజ్-1 పనులను అర్థాంతరంగా నిలిపివేశారని తెలిపా రు. గొల్లప్రోలులో జరిగిన కాపు నేస్తం సభలో ఏలేరు, సుద్దగడ్డ ఆధునీకరణకు కొత్తగా నిధులు ఇస్తున్నట్లు ఆర్భాటంగా సీఎం జగన్ ప్రకటించారని గుర్తుచేశారు. ఇది జరిగి ఏడాదిన్నర గడిచినా ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వలేదని, కనీసం టె ండర్లు పిలవలేదని ఎద్దేవా చేశారు. రెండు పంటలకు పుష్కలంగా సాగునీరందించే ఉద్దేశ్యంతో రూ.1650కోట్లుతో చేపట్టిన పురుషోత్తపట్టణ ఎత్తిపోతల పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి రా గానే ఏలేరు, సుద్దగడ్డ ఆధునీకరణ పనులు చేపట్టి పూర్తి చేస్తామని తెలిపారు. తహశీల్దారు వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.