Share News

సీఎం సభకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నం

ABN , Publish Date - Jan 03 , 2024 | 11:49 PM

పిఠాపురం, జనవరి 3: ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ మోటార్‌సైకిల్‌ ర్యాలీగా సీఎం సభకు వెళ్లాలన్న మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరుల ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. వాగ్వివాదంతో ఉద్రిక్తత ఏర్పడింది. హామీలు నెరవేర్చాలం టూ ధర్నాకు దిగారు. ఏలేరు ఆధునీకరణకు నిధులు ఇస్తామంటూ గొల్లప్రోలులో జరిగిన కాపునేస్తం సభలో సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని ప్రస్తావిస్తూ వినతిపత్రం అందించేందుకు కాకినాడలో సీఎం సభకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ ఆధ్వర్యంలో నాయకులు, రైతు

సీఎం సభకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నం

వర్మ, నాయకులను అడ్డుకున్న పోలీసులు

వారి మధ్య వాగ్వాదం

హామీలు నెరవేర్చాలంటూ ధర్నా

పిఠాపురం, జనవరి 3: ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ మోటార్‌సైకిల్‌ ర్యాలీగా సీఎం సభకు వెళ్లాలన్న మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరుల ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. వాగ్వివాదంతో ఉద్రిక్తత ఏర్పడింది. హామీలు నెరవేర్చాలం టూ ధర్నాకు దిగారు. ఏలేరు ఆధునీకరణకు నిధులు ఇస్తామంటూ గొల్లప్రోలులో జరిగిన కాపునేస్తం సభలో సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని ప్రస్తావిస్తూ వినతిపత్రం అందించేందుకు కాకినాడలో సీఎం సభకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ ఆధ్వర్యంలో నాయకులు, రైతులు మోటార్‌సైకిల్‌ ర్యా లీగా బయలుదేరారు. పిఠాపురం మున్సిపల్‌ కార్యాలయం వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ పురవీధుల్లో సాగి పట్టణ పోలీసుస్టేషన్‌ వద్దకు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వర్మ, టీడీపీ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. తాము శాంతియుతంగా వినతిపత్రం అందించడానికి వెళ్తుంటే అడ్డుకోవడం ఏంటని వర్మ ప్రశ్నించారు. పో లీసుల తీరుకు నిరసనగా పిఠాపురం-సామర్లకోట ర హదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. అనం తరం తహశీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అంద జేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ ఏలేరు, సుద్దగడ్డ ఆధునీకరణ రెండవ విడతకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రూ.160కోట్లు మంజూరు చేసి చంద్రబాబుతో శంఖుస్థాపనలు చేయించి పనులు ప్రారంభించామన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీ, ఎమ్మెల్యేలు ఆ పనులను రద్దు చేయించారని తెలిపారు. కాపునేస్తం సభలో ఈ పనులను ప్రారంభిస్తామని సీఎం జగన్‌ ఎంతో ఆర్భా టంగా ప్రకటించారని గుర్తుచేశారు. సీఎం హామీ ఇచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా పనులు ఒక్క అడుగు ముందుకు పడలేదని, కనీసం టెండర్లు కూడా పిలవలేదని తెలిపారు. తప్పుడు హామీలు ఇచ్చి జగన్‌ ప్రజలను మోసగించారని విమర్శించారు. హామీలను గుర్తు చేసేందుకు రైతులతో కలిసి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. అదేవిధంగా పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాల అభివృద్ధికి రూ.40కోట్లు నిధులు ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి ఇవ్వలేదని తెలిపారు. తప్పుడు హామీలతో మభ్య పెట్టిన జగన్‌కు ప్రజలే తగు రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించా రు. టీడీపీ పట్టణ,మండలాధ్యక్షులు రెడ్డెం భాస్కరరా వు, సకుమళ్ల గంగాధర్‌, ఉలవకాయల దేవేంద్రుడు, గుండ్ర సుబ్బారావు, అనిశెట్టి సత్యానందరెడ్డి, బర్ల అప్పారావు, మడికి ప్రసాద్‌, దేవరపల్లి రామారావు, ఎలుబండి రాజారావు, గాది రాజబాబు పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2024 | 11:49 PM