పిడుగుల అలజడి!
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:21 AM
సామర్లకోట, జూన్ 16: సామర్లకోట మండలం, పట్టణ పరిధిలో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములు, పిడుగులు అలజడి సృష్టిం చాయి. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవించి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. సుమారు 4 విద్యుత్ స్తంభాలు నేలకూ లగా పట్టణ పరిధిలో ప్రభుత్వ కళాశాల ఎదురుగా 4 భారీ చెట్లు నేలకూలాయి. కాకినాడ రోడ్డులో ము త్యాలమ్మ విగ్రహం సమీపాన రెండు చెట్ల కొమ్మలు విరిగిపడడంతో కాకి

ఈదురుగాలులతో భారీ వర్షం
నేలకొరిగిన చెట్లు
వాహనాల రాకపోలకు అంతరాయం
సామర్లకోట, జూన్ 16: సామర్లకోట మండలం, పట్టణ పరిధిలో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములు, పిడుగులు అలజడి సృష్టిం చాయి. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవించి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. సుమారు 4 విద్యుత్ స్తంభాలు నేలకూ లగా పట్టణ పరిధిలో ప్రభుత్వ కళాశాల ఎదురుగా 4 భారీ చెట్లు నేలకూలాయి. కాకినాడ రోడ్డులో ము త్యాలమ్మ విగ్రహం సమీపాన రెండు చెట్ల కొమ్మలు విరిగిపడడంతో కాకినాడ రోడ్డులో వాహనాల రాకపో కలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మండలంలోని గోలివారి కొత్తూరు, పెదబ్రహ్మదేవం గ్రామాల్లో 4 చెట్లు నేలకూలాయి. అప్పటివరకూ వర్షంలో తడవ కుండా చెట్టు నీడలో నిలచున్న పలువురు రైతులు కొద్ది నిమిషాల తర్వాత ఎవరిదారిన వారు వెళ్లి పో వడంతో పెనుప్రమాదం తప్పింది. వేట్లపాలెం గ్రా మం చంద్రశేఖరస్వామి ఆలయం వెనుక కొండపల్లి వారి గేదెల పాక వద్ద కొబ్బరిచెట్టుపై పిడుగు పడి మంటల్లో చిక్కుకుంది. సామర్లకోట తదితర ప్రాంతాలలో చెట్లు, కొమ్మలు విద్యుత్ స్తంభాలపై పడడంతో సుమారు 2 గంటలకు పైగా విద్యుత్ సర ఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టణంలో డ్రైన్లు పొంగి ప్రవహించి కొత్తూరు మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణకు చేరుకుని దుర్వాసన వ్యాపించిం ది. దీంతో ప్రయాణికులు ఇక్కట్లకు గురయ్యారు.
కొబ్బరిచెట్లపై పడిన పిడుగు
కొత్తపల్లి, జూన్ 16: కొత్తపల్లి ఊరచెరువు సెం టర్లో కొబ్బరి చెట్లపై పిడు గు పడి అగ్నికి ఆహు తయ్యాయి. ఆదివారం సాయంత్రం వాతావరణం లో సంభవించిన మార్పు తో అధిక గాలితో పాటూ ఉరువులు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. వర్షం కురిసే టప్పుడు ఆకాశంలో మెరుపులా వచ్చి పిడుగు కొత్తపల్లి ఊరచెరువు సెంటర్లో కొబ్బరి చెట్లపై పడింది. దీంతో చెట్లు నిలువెల్లా కాలిపోయాయి. పిడుగులు పడే సమయంలో ఆ చెట్ల కింద జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కొత్తపల్లి మ ండలంలో ఆదివారం సాయం త్రం ఈదురుగాలులు, పిడుగులతో వర్షం కురిసింది. దీంతో సుమారు గంట పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.