Share News

దార్శనికుడు చంద్రబాబు

ABN , Publish Date - May 27 , 2024 | 12:44 AM

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రజలందరికి సంక్షేమ ఫలాలను అందించిన దార్శనికుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అని వక్తలు అన్నారు. సీనియర్‌ పాత్రికేయుడు శాఖమూరు శ్రీనివాస్‌ ప్రసాద్‌ రచించిన చంద్రబాబు ఎక్స్‌.ఓ అనంత భావజాలికుడు పుస్తకావిష్కరణ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం రాజమహేంద్రవరం మోరంపూడి గన్నిస్‌ శుభమస్తు ఫంక్షన్‌ హాలులో జరిగింది.

దార్శనికుడు చంద్రబాబు
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వీవీవీ చౌదరి, ఆదిరెడ్డి, గన్ని భాస్కరరావు

రాజమహేంద్రవరం సిటీ, మే 26: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రజలందరికి సంక్షేమ ఫలాలను అందించిన దార్శనికుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అని వక్తలు అన్నారు. సీనియర్‌ పాత్రికేయుడు శాఖమూరు శ్రీనివాస్‌ ప్రసాద్‌ రచించిన చంద్రబాబు ఎక్స్‌.ఓ అనంత భావజాలికుడు పుస్తకావిష్కరణ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం రాజమహేంద్రవరం మోరంపూడి గన్నిస్‌ శుభమస్తు ఫంక్షన్‌ హాలులో జరిగింది. పుస్తకాన్ని మాజీ ఎమ్మెల్సీలు వీవీవీ.చౌదరి, ఆదిరెడ్డి అప్పారావు, జీఎస్‌ఎల్‌ చైర్మన్‌ డాక్టర్‌ గన్నిభాస్కరరావు ఆవిష్కరించారు. తొలుత ఎన్‌టిఆర్‌ విగ్రహానికి గన్ని కృష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ డాక్టర్‌ వేపాడ చిరంజీవిరావు పుస్తక పరిచయాన్ని చేసి మాట్లాడారు. 1995-99లో చంద్రబాబు పాలన 1.0గా చూస్తే, 1999-2014 వరకు పాలన 2.0 అని, 201 4-19 వరకు 3.0 అని ఇలా ఎప్పటికప్పుడు ఆప్‌ డేట్‌ చేసుకుంటూ వెళ్తున్న చంద్రబాబు నిజంగా అనంత భావజాలికుడన్నారు. వీవీవీ.చౌదరి మాట్లా డుతూ మారుమూల గ్రామంలో ఒక పేద కుటుంబం నుంచి కూడా ఒక ఇం జనీర్‌ వచ్చాడంటే దానికి చంద్రబాబు ఐటీ రంగాన్ని బలోపేతం చేయడమే కారణమన్నారు. రేరా మాజీ చైర్మన్‌ డాక్టర్‌ రామనాథ్‌ వెలమాటి మాట్లాడుతూ అనునిత్యం ప్రజల కోసం తపించే వ్యక్తి చంద్రబాబు అన్నారు. మాజీ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ మాట్లాడుతూ చంద్రబాబుపై పుస్తకం తీసుకురావడం అభినందనీయమన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ చంద్రబాబు విజనరీ అంటే ఎలా ఉంటుందో చూపించార న్నారు. రచయిత శ్రీనివాస్‌ ప్రసాద్‌ ఈ పుస్తకం ఎందుకు రాయాల్సి వచ్చిందో వివరించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ యర్రా వేణుగోపాలరాయుడు, సీనియర్‌ పాత్రికేయుడు గెద్దాడ నవీన్‌, వాసిరెడ్డి రాంబాబు, చల్లా శంకరరావు, వర్రే శ్రీనివాసరావు, కాశీ నవీన్‌కుమార్‌, గంగిన హనుమంతరావు, ఏఎస్‌ఆర్‌ ప్రభు, మార్ని వాసుదేవ్‌, రెడ్డి మణి, రాచపల్లి ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2024 | 12:44 AM