Share News

ఫార్మా టెస్టింగ్‌కు పొలాల ఎంపిక

ABN , Publish Date - May 29 , 2024 | 12:53 AM

మండలంలోని వేగేశ్వరపురం, బల్లిపాడు గ్రామాల్లో ఖరీఫ్‌ 2024కు సంబంధించి బీపీటీ-3082, 2858 రకాల వరిపంట మినికిట్స్‌ వేసే ఆసక్తి ఉన్న రైతుల పొలాలను జిల్లా ఏరువాక కేంద్రం ప్రిన్సిపల్‌ సైంటిస్టులు అమ్మాజీ, హైమజ్యోతి సందర్శించారు.

ఫార్మా టెస్టింగ్‌కు పొలాల ఎంపిక

తాళ్లపూడి, మే 28: మండలంలోని వేగేశ్వరపురం, బల్లిపాడు గ్రామాల్లో ఖరీఫ్‌ 2024కు సంబంధించి బీపీటీ-3082, 2858 రకాల వరిపంట మినికిట్స్‌ వేసే ఆసక్తి ఉన్న రైతుల పొలాలను జిల్లా ఏరువాక కేంద్రం ప్రిన్సిపల్‌ సైంటిస్టులు అమ్మాజీ, హైమజ్యోతి సందర్శించారు. అమ్మాజీ మాట్లాడుతూ రెండు గ్రామాల్లో రైతుల పొలాలను గుర్తించామని, మొదటి పంట వరి, రెండో పంట స్వీట్‌కార్న్‌ మొక్క జొన్న పంటలు వేసే రైతుల పొలాలను ఫార్మా టెస్టింగ్‌ కోసం ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారిణి రుచిత, రైతులు బుద్దాల సురేష్‌, పెద్దిశెట్టి తాతారావు, వల్లిపల్లి సతీష్‌ వీఏవోలు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2024 | 12:53 AM