Share News

ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి

ABN , Publish Date - May 12 , 2024 | 01:50 AM

సార్వత్రిక ఎన్నికల ప్రచారాంఖం ముగిసింది. రాజమహేంద్రవరంలో సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ శనివారం నగరంలో భారీ రోడ్‌ షో నిర్వహించారు.

ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి

ఆఖరిరోజు భారీ రోడ్‌ షోలో కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి

అడుగడుగునా ఘనస్వాగతం పట్టిన ప్రజలు

రాజమహేంద్రవరం సిటీ, మే 11: సార్వత్రిక ఎన్నికల ప్రచారాంఖం ముగిసింది. రాజమహేంద్రవరంలో సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ శనివారం నగరంలో భారీ రోడ్‌ షో నిర్వహించారు. స్థా నిక లాలాచెరువులోని 1వ డివిజన్‌ నుంచి రోడ్‌ షో ప్రారంభమైంది. ఈ రోడ్‌ షో నగరంలో అన్ని ప్రధాన కూడళ్లను కలుపుకుని 42 డివిజన్ల మీదుగా సాగింది. తొలుత లాలాచెరువు వద్ద ప్రారంభమైన ఈ రోడ్‌షోలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌కుమార్‌, జనసేన సిటీ ఇంచార్జీ అనుశ్రీ సత్యనారాయణ, ఉమామర్కండేయస్వామి దేవాస్థానం మాజీ చైర్మన్‌ యిన్నమూరి దీపు, నగర అధ్యక్షుడు వై.శ్రీనులతో కలిసి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. రోడ్‌షో అంతా ప్రజలను అప్యాయంగా పలుకరించుకుంటూ అభివాదాలుచేస్తూ, నమస్కరిస్తూ, విక్టరీ సింబల్‌ చూపిస్తూ ముందుకు సాగారు. గుమ్మడికాయలు దిష్టితీసి హారతుల ఇచ్చి ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా అన్ని కూడళ్లలో ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడారు. తన బ్యాలెట్‌ నెంబరు 1 తన గుర్తు సైకిల్‌ అని ఈనెల 13న జరిగే ఎన్నికల్లో తనకు సైకిల్‌ గుర్తుపైన, కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరికి కమలం గుర్తుపైన ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. రాజమహేంద్రవరం ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం తనకు కల్పించాలని కోరారు. అభివృద్ధికి సుందరీకరణకు తేడా తెలియని కనీస అవగాహనలేని మార్గాని భరత్‌రామ్‌చేతిలో రాజమహేంద్రవరం గత ఐదేళ్లుగా సర్వనాశనం అయ్యిందన్నారు. ఇళ్ల పట్టాల పేరుతో ఇళ్లు వస్తుందని ఆఽశగా ఎదురుచూసిన పేదప్రజలను మోసం చేశాడన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఓట్లు దండుకునేందుకు ఎందు కూ పనికిరాని పట్టాలు ఇచ్చి మోసం చేశాడన్నారు. లేని భూమికి పట్టాలు ఇచ్చి మోసం చేశాడన్నారు. ఎక్కడుందో తెలియని స్థలాన్ని కొనుగోలు చేసి దాని ద్వారా వచ్చిన కమిషన్‌తో ఇప్పుడు ఎన్నికల్లో ఖర్చుచేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను ఇన్ని రకాలుగా నష్టం చేకూర్చిన వ్యక్తులు మనకు ప్రజాప్రతినిధులుగా అవసరం లేదన్నారు. 13న సోమవారం జరిగే ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుపై ఓట్లువేసి తనను ఎమ్మెల్యేగాను, ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న దగ్గుబాటి పురందేశ్వరిని కమ లం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఒక నియంత జగన్‌తో ఐదేళ్లుగా మనమంతా యుద్ధం చేస్తున్నామని ఈ యుద్ధంలో న్యాయనిర్ణేతలు ఓటర్లే అని అన్నారు. జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే మన బతుకులు చిధ్రం కాకతప్పదన్నారు. మన భవిష్యత్‌ అంధకారం కాకుండా చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అందుకు చంద్రబాబు పాలనలో పేదరికమే కొలమాణంగా పఽథకాలన్నీ దరిచేరాలంటే కూటమిని అఽధికారంలోకి తీసుకురావాలన్నారు. ఓటర్లు కంకణబద్దులై కూటమికి అండగా నిలవాలన్నారు. కూటమి అధికారంలోకి రాగానే ప్రజా సంక్షేమ పాలన అందిస్తామన్నారు. ప్రతీవర్గానికి మేలు జరుగుతుందని, జగన్‌ మూసివేసిన అన్నాక్యాంటీ న్లను తెరచి పేదలకు అంకితం చేస్తామన్నారు. నాసికరం మ ద్యంతో అనేక కుటుంబాలను రోడ్డున పడేశారని అన్నారు. ఇసుక, మట్టి. వైన్‌ పేరుతో రాష్ట్రాన్ని దోచేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కూటమిని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కడలి రామకృష్ణ, బుడ్డిగ రాధా, కొయ్యల రమణ, మొకమాటి సత్యనారాయణ, మరుకుర్తి రవియాదవ్‌, కవులూరి వెంకట్రావు, చాపల చిన్నరాజు, కందికొండ అనంత్‌, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తాం

వెంకటనగరం ప్రచారంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి

కడియం/రాజమహేంద్రవరంరూరల్‌, మే 11: రాజమహేంద్రవరంరూరల్‌ నియోజకవర్గం వెంకటనగరంలో టీడీ పీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆయన కుమార్తె కంఠమనేని శిరీషలు పాల్గొన్నారు. గంగిన హనుమంతరావు, నున్న కృష్ణ, గంగిన నాని సారధ్యాన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ రాబోయేది కూటమి ప్రభుత్వమే అన్నారు. చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్‌, మోదీ సారథ్యంలో ఎన్డీయే కూటమిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తామని తెలిపారు. చంద్రబాబునాయుడు ప్రజాగళంతో విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. అధికారంలోకి రాగానే ఉమ్మ డి మేనిఫెస్టోలో రూపొందించిన ప్రకారం 50 ఏళ్లకే రూ. 4 వేలు పెన్షన్‌ అందించనున్నట్లు గోరంట్ల తెలిపారు. కేంద్ర జలమిషన్‌ ద్వారా సురక్షితత్రాగునీరు పథకం, ఇంటింటికీ మంచినీటికుళాయి ఏర్పాటుచేస్తామని, యువతకు 20 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా ప్రణాళిక రూపొందించామని, నిరుద్యోగ యువతకు రూ.3వేలు ఇస్తామని తెలిపారు. గత ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ పథకాలను పునరుద్దరించి, ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేసి అర్హులైన ప్రతీఒక్కరికీ న్యాయం జరిగేలా చ ర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు పలికి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా బలపరిచిన తనకు సైకిల్‌ గుర్తుపైనా, ఎంపీ అఽభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ-కమలం గుర్తుపైనా ఓటేసి విజయం చేకూర్చాలని గోరంట్ల విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

కూటమితోనే అభివృద్ధి సాధ్యం

శ్రీరంగపట్నం రోడ్‌ షోలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి బత్తుల

రాజానగరం(కోరుకొండ) మే 11 : కూటమితోనే అభివృద్ధి సాధ్యపడుతుందని, 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అఖండమెజార్టీతో గెలిపించి, రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని రాజానగరం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ కోరారు. రాజమహేంద్రవరం పార్లమెంట్‌ కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి కుమార్తె నివేదిత రాష్ట్ర టీడీపీ కార్యదర్శి రాజానగరం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బొడ్డువెంకటరమణచౌదరి, బీజేపీ ఇన్‌చార్జ్‌ నీరుకొండ వీరన్నచౌదరిలతో కలిసి కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో శనివారం రోడ్‌ షో నిర్వహించారు. ఈసందర్భంగా బత్తుల మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తనను కూటమి తనను గెలిపిస్తే రాజానగరం నియోజకవర్గంలో బ్లేడ్‌ బ్యాచ్‌లు, గంజాయి బ్యాచ్‌లు సంస్కృతిని సమూలంగా నిర్మూలించి, ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. జనసేన. బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థులకు గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజాస్వామ్య బద్దంగా తనను ఎదుర్కొనలేక ప్రత్యర్థులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. విజ్ఞులైన ఓటర్లు దీనిని గమనించి ఈవిఎంలోని 5వ నెంబరులో గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి తమకు విజయం చేకూర్చాలని కోరారు. రాజమహేంద్రవరం పార్లమెంట్‌ అభ్యర్ధి దగ్గుబాటి పురందేశ్వరి కుమార్తె నివేదిన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తన తల్లి పురందేశ్వరికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న బత్తుల బలరామకృష్ణను ఆశీర్వదించాలని అభ్యర్ధించారు.

సేవకుడిగా పనిచేస్తా...

రాజానగరం నియోకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చే స్తానని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ అన్నారు. పార్టీ కార్యాయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేంలో ఆయన సతీమణి వెంకటలక్ష్మితో కలిసి మాట్లాడారు. కరోనా కష్ట కాలంలో అందరి అందుబాటులో ఉంటూ అనేక సేవలందించామన్నారు. లోక కళ్యాణం కోసం దేవాలయాలు, చర్చిలు నిర్మించామని, రాజకీయాలు కోసం రాలేదని, ప్రజల కు సేవలందించాలనే ఉద్దేశంతోనే సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చానని, తనకు ఒక్క అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.నియోజకవర్గంలో జరుగుతున్న గంజాయి, బ్లేడు బ్యాచ్‌లను నిర్మూలనతో పాటుగా అక్రమ ఇసుక, మట్టి దోపిడీలను అరికడతామన్నారు. పరిశ్రమలు తీసుకొచ్చి విద్యార్ధులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తాను. ఒక్క చాన్స్‌ ఇస్తే రాబోయే ఐదేళ్లలో రాజానగరం నియోజకవర్గాన్ని మోడల్‌ నియోజకవర్గంలో అభివృద్ది చేస్తామన్నారు. నియోజకవర్గంలో డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసి విద్యాభివృద్దికి పాటు పడతామన్నారు. ఈవీఎంలో 5వ నెంబరులో ఉన్న గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలన్నారు. పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి దగ్గుపాటి పురందేశ్వరికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఫనరసాపురం గ్రామంలో వైసీపీకి చెందిన పలువులు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బీవీఆర్‌ సమక్షంలో శనివారం టీడీపీలో చేరారు. వీరందరికి బీవీఆర్‌ టీడీపీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఫ నియోజకవర్గంలోని కోరుకొండ మండలం కోటి గ్రా మంలో ఎన్డీయే అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి కుమార్తె నివేదిత టీడీపీ ఇన్‌చార్జ్‌ బొడ్డు వెంకటరమణతో కలిసి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తాం

ఫ రోడ్‌ షోలో కొత్తపల్లి గీత, మిరియాల శిరీషాదేవీ

వరరామచంద్రాపురం, మే 11: పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రెండేళ్లలో పూ ర్తిచేసి, నిర్వాసితులకు పూ ర్తిస్థాయిలో నష్టపరిహారం అందిస్తామని అరకు పార్ల మెంట్‌ అభ్యర్థిని కొత్తపల్లి గీత, రంపచోడవరం ఎమ్మె ల్యే అభ్యర్థిని మిర్యాల శిరీషా అన్నారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా వీఆర్‌పురం మండలా నికి వచ్చిన వారు రేఖపల్లి జంక్షన్‌లో మాట్లాడుతూ ఐదేళ్లలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రజలకు చేసింది ఏమీలేదని వారన్నారు. పోలవరం నిర్వా సితులను గాలికి వదిలేశారని వారన్నారు. రేఖపల్లి బీసీ కాలనీని 41 కాంటూ న్‌లో చేరుస్తామని హామీఇచ్చారు. టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు జంగాల మ ల్లిఖారునరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి శిరీషా సమక్షంలో పలు కుటుంబా లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఓటుతో వైసీపీని తరిమికొట్టాలి

ఎటపాక: వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే.... ఏజెన్సీలో వైసీపీని ప్రశ్నించినవా రు, ఎదురు తిరిగినవారు శవంతో డోర్‌డె లవరీ అవుతారని, అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఎన్టీఏ కూటమి అభ్యర్థులను గెలిపించి, చంద్రబాబును సీఎం చేయాలని ఎన్డీఏ కూటమి అరకు పార్లమెంట్‌ అభ్యర్థిని కొత్తపల్లి గీత, ఎ న్డీఏ కూటమి రంపచోడవరం అభ్యర్థిని మిరియాల శిరీషాదేవీ అన్నారు. శనివా రం తోటపల్లి గ్రామంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఎన్నికల రోడ్‌షోను నిర్వ హించారు. ఏజెన్సీలో వైసీపీ ఎమ్మెల్సీ అరాచకాలు పెరిగిపోయా యని, వారికి దోచుకోవడం తప్ప, ప్రజల కోసం పనిచేయడం తెలియదన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కిలారి వెంకన్న, నలజాల శ్రీకాంత్‌ చౌదరి, రావిమాధవ రావు, మోసం రాజులు, దొంతు మంగేశ్వరరావు, బాచినేని మల్లేశ్వర రావు, మం డలాధ్యక్షుడు పుట్టి రమేష్‌, బీజేసీ మండలాధ్యక్షుడు మోదుగు పెరమయ్య, బొల్లా ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

కూటమి విస్తృత ప్రచారం

మోతుగూడెం: ప్రచారంలో భాగంగా ఆఖరిరోజు కూటమి అభ్యర్థులు నాయకులు, కార్యకర్తలు మోతుగూడెం పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. మోతుగూడెం మార్కెట్‌ సెంటర్‌లో టీడీపీ ఎంపీటీసీ వేగి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాక్షసపాలనకు రోజులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు. మోతుగూడెం పంచాయతీ పరిధిలో ఎంపీటీసీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాబలం బాబు సూపర్‌ చందబ్రాబు సూపర్‌ సిక్స్‌ పథకాలను మేనిఫెస్టోను వివరించారు. ప్రజలందరూ సహకరించాలని కూటమి అభ్యర్థులు కొత్తపల్లిగీత, మిరియాల శిరీషని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మహిళా కార్యకర్తలు, టీడీపీ సీనియర్‌ నాయకులు పాసి రమణ, వార్డు మెంబర్‌ ఓలయ్య, యేసు, జనసేన నాయకులు భీమరాజు, రాంప్రసాద్‌, సాయి గౌతమ్‌, తదితరులు టీడీపీ, జనసేన,బీఈజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

నిర్వాసితులకు అండగా ఉంటా

కూనవరం: కూనవరం నిర్వాసితులకు తాను అండగా ఉంటానని అరకు పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. శనివారం రంపచోడవరం అసెంబ్లీ అభ్యర్థి మిరియాల శిరీషతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వంలో పోలవరం నిర్వాసితులకు అన్యా యం జరిగిందన్నారు. తూతూమంత్రంగా సర్వేలు జరిపించి ఎటువంటి పరిహారం ఇవ్వలేదన్నారు. జగన్‌ ప్రభుత్వంలో అన్ని అక్రమాలే జరిగాయన్నారు. సంక్షేమం పేరుతో జగన్‌ ప్రజలను మోసం చేశారన్నారు.

నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

రెండు మండలాలు పన్నెండు గ్రామాల్లో నల్లమిల్లి, పురందేశ్వరిల రోడ్‌షో

అడుగడుగునా సత్కారాలు, హారతులతో స్వాగతం పలికిన ప్రజలు

అనపర్తి, మే 11: ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు కావడం తో రాజమహేంద్రవరం ఎంపీ ఎన్డీయే కూటమి బీజేపీ అభ్య ర్థి దగ్గుబాటి పురందేశ్వరితో కలిసి అనపర్తి ఎన్డీయే కూటమి బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలు నియో జకవర్గంలోని బిక్కవోలు, పెదపూడి మండలాలలో సుడిగాలి పర్యటన చేశారు. బిక్కవోలు మండలం బలభద్రపురంో ప్రారంభించిన రోడ్‌షో రెండు మండలా లను కలుపుతూ తొస్సిపూడి, కొమరిపాలెం, పైన, రాజుపాలెం, గండ్రేడు, పుట్టకొండ, సంపర, కాండ్రేగుల, శహపురం, అచ్చుతాపురం, రామేశ్వరం గ్రామాల్లో సాగింది. బలభద్రపురంలో మొదలైన రోడ్‌షోకు దారి పొడ వునా ప్రజలు నీరాజనాలు పలికారు. విజయోత్సవాన్ని తలపిస్తూ రోడ్‌షో సాగింది. ఈ సందర్భంగా బిక్కవో లు మండలం కొమరిపాలెం గ్రామంలో పడాల రాము నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశం లో నల్లమిల్లి, పురందేశ్వరిలు మాట్లాడారు. ఈ సందర్బంగా పురందేశ్వరి మాట్లాడుతూ నియోజక వర్గంలో అపరిస్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యంగా కెనాల్‌ రోడ్డు నిర్మాణానికి, అనపర్తిలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల హాల్టులు సాధిస్తామన్నారు. పామాయిల్‌ రైతుల సమస్యల పరిష్కారంతో బాటు పొగాకు రైతుల ఇబ్బందులు కూడా పరిష్కరిస్తామని అన్నారు. నల్లమిల్లి మాట్లాడుతూ ప్రజల ఆదరణ చూ స్తుంటే చాలా సంతోషంగా ఉందని రాష్ట్రంలోను, కేంద్రంలోను కూటమి విజయం సాధించడం ఖాయమని అనపర్తి లో తాను 20వేల మెజారిటీతోను, ఎంపీగా పురందేశ్వరి 1.50లక్షల మెజారిటీతో విజయం సాధించడం ఖాయ మని అన్నారు. పడాల రాము సతీమణి సునీత పురందేశ్వరికి ఆడపడుచు లాంఛ నంగా చీర పసుపు కుంకుమలు పెట్టారు. ఈ రోడ్‌షోలో రాజానగరం టీడీపీ ఇన్‌చార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి, పడాల వెంకటరామారెడ్డి, నల్లమిల్లి సుబ్బారెడ్డి, జనసేన నాయకుడు రావాడ నాగు స్థానిక నేతలు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2024 | 08:01 AM