Share News

1న ఇంటికే పింఛన్లు

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:51 AM

జగన్‌ అసాధ్యం అన్నారు.. అయితే చంద్రబాబు మాత్రం సుసాధ్యం అని చేసి చూపించారు. గత నెలలో కేవలం రెండు రోజుల్లో ఇంటి వద్దనే పింఛన్లు అందించారు. ఈ నెలా అదే విధానాన్ని పాటిం చనున్నారు.

1న ఇంటికే పింఛన్లు

రెండు రోజులే గడువు

ఖాతాలకు చేరిన సొమ్ము

రాజమహేంద్రవరం, జూలై 27 (ఆంఽధ్రజ్యోతి) : జగన్‌ అసాధ్యం అన్నారు.. అయితే చంద్రబాబు మాత్రం సుసాధ్యం అని చేసి చూపించారు. గత నెలలో కేవలం రెండు రోజుల్లో ఇంటి వద్దనే పింఛన్లు అందించారు. ఈ నెలా అదే విధానాన్ని పాటిం చనున్నారు. జిల్లాలో ఆగస్టు 1న ఎన్టీఆర్‌ భరోసా పిం ఛన్లను లబ్ధిదార్లకు ఇంటివద్దనే పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వృద్ధులు,వితంతులకు నెలకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేల వంతున పిం ఛన్లు పంపిణీ చేయనున్నారు. గత ఏప్రిల్‌ నుంచే పింఛన్ల సొమ్ము పెంపు అమలు చేయడం వల్ల జూలైలో ఒక్కొక్కరికి రూ.7 వేల వంతున పింఛన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్ప డిన జూలైలో సచివాలయ ఉద్యోగులు చాలెంజ్‌గా తీసుకుని ఒక్కరోజులో 90 శాతంపైనే పంపిణీ చేశా రు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కూడా సచి వాలయ ఉద్యోగులు, ఇతర ఉద్యోగుల చేత పంపిణీకి ఏర్పాట్లు చేసింది. జిల్లాలో మొత్తం 2,40,595 మంది పింఛనుదారులు ఉన్నారు.వీరికి రూ.102 కోట్ల 54 లక్షల 77 వేల 500 లబ్ధిని చేకూర్చడానికి ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేశామని డీఆర్‌డీఏ పీడీ ఎన్‌వీవీఎస్‌ మూ ర్తి తెలిపారు. తొలిరోజునే 99 శాతం పింఛన్లు పూర్తి చేయాలని.. ఏదైనా టెక్నికల్‌ సమస్య వస్తే మరుసటి రోజే అందించాలని ఆదేశించారన్నారు.

రెండు రోజులే పంపిణీ చేయండి : కలెక్టర్‌ ప్రశాంతి

జిల్లాలో ఆగస్టు 1నే పింఛన్ల పంపిణీకి ఏర్పాటు చేశామని కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు. పింఛన్ల పంపిణీపై ఆమె శనివారం సమీక్షించారు. ఆగస్టు 1న అందరూ ఉదయం 5 గంటల ముందే పింఛన్ల పం పిణీ ఆరంభించాలన్నారు. మొదటి రోజు 99 శాతం పంపిణీ పూర్తి చేయాలి..సాంకేతిక సమస్య లు తలెత్తితే రెండో రోజు పంపిణీ చేయాలని ఆదే శించారు.తర్వాత ఇక పొడిగింపు లేదన్నారు. సచివా లయాల వారీగా పెన్షన్‌ మొత్తాలు ఇప్పటికే ఎంపీ డీవోలు,కమిషనర్లకు పంపించామన్నారు. వీటిని 30న సెక్రటే రియట్‌ బ్యాంక్‌ ఖాతాలకు జమ చేస్తారని.. బ్యాంక్‌ మేనేజర్లకు నగదు ఆవశ్య కత లేఖను 29వతేదీ నా టికే అందించాలన్నారు. 31వ తేదీన మొత్తం సొమ్మును విత్‌డ్రా చేసుకో వాలని చెప్పారు.2వ తేదీకి చెల్లింపులు పూర్తి చేయాల న్నా రు.చెల్లించని మొత్తాన్ని రెండు రోజుల లోపు సెర్ప్‌కి తిరిగి చెల్లించాలన్నారు. చెల్లించని పింఛన్లన్నింటికీ కారణాలను ఆయా సంక్షేమ సహాయకులు 5వ తేదీలోపు తెలియజేయాలన్నారు. గతంలో ఉపయో గించిన సిబ్బందినే ఉపయోగించుకోవాలని చెప్పా రు.గత నెలలో మా దిరిగానే పింఛను లబ్ధిదారు లకు పింఛన్‌ బట్వాడా రశీదు ఇస్తారన్నారు.

Updated Date - Jul 28 , 2024 | 12:51 AM