Share News

అస్తవ్యస్తంగా పింఛన్ల పంపిణీ

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:30 AM

: సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. మండుటెండలో సొమ్ములు తీసుకునేందుకు వచ్చిన లబ్ధిదారులు పడిన అగచాట్లు అన్నీఇన్నీ కావు. రెండోరోజు సొమ్ములు సకాలంలో రాక వృద్ధులు, మహిళలు, వికలాంగులు పడిగాపులు పడ్డారు.

అస్తవ్యస్తంగా పింఛన్ల పంపిణీ

వృద్ధులు, మహిళలకు తప్పని అవస్థలు

పిఠాపురం/గొల్లప్రోలు రూరల్‌, ఏప్రిల్‌ 4: సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. మండుటెండలో సొమ్ములు తీసుకునేందుకు వచ్చిన లబ్ధిదారులు పడిన అగచాట్లు అన్నీఇన్నీ కావు. రెండోరోజు సొమ్ములు సకాలంలో రాక వృద్ధులు, మహిళలు, వికలాంగులు పడిగాపులు పడ్డారు. తొలిరోజు అరకొరగానే పింఛన్ల పంపిణీతో రెండోరోజు గురువారం కొనసాగించారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు సచివాలయం-1లో సొమ్ములు అయిపోవడంతో బ్యాంకునుంచి నగదు సకాలంలో రాక లబ్ధిదారులు పడిగాపులు పడ్డారు. గొల్లప్రోలు సచివాలయం-1 మేడపై ఉంది. సిబ్బంది కనీసం కిందకు వచ్చి సొమ్ములు ఇవ్వకపోవడంతో వృద్ధులు, వికలాంగులు అవస్థలు పడుతూ ఎక్కాల్సి వచ్చింది. పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాలతోపాటు మండలాల్లోని గ్రామాలు, జిల్లావ్యాప్తంగా ఎక్కడా పింఛన్ల పంపిణీ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు.

‘పింఛన్ల పంపిణీలో వైసీపీ అబద్దాలు’

సామర్లకోట: రాజకీయ లబ్ధికోసమే పింఛన్ల పంపిణీని వైసీపీ ప్రభుత్వం జాప్యం చేసిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, పె ద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. గురువారం సామర్లకోటలో విలేకరులతో మా ట్లాడుతూ పింఛన్లను సకాలంలో వారికి అంద జేయకుండా వైసీపీ రాజకీయ డ్రామా ఆడు తోందన్నారు.ఈ సందర్భంగా సామర్లకోట పట్టణ, మండల టీడీపీ, జనసేన, బీజేపీ నాయ కులు పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 12:30 AM