పెన్షన్ల్లు ఇంటింటా పంపిణీ చేయాలి
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:51 AM
వృద్దులు, దివ్యాంగుల, వితంతంతు తదితర సామాజిక భధ్రతా పెన్షన్లు నేరుగా లబ్ధిదారుల ఇళ్లవద్దకే వెళ్లి అందించేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు మున్సిపల్ కమిషనర్ కేవీ పద్మావతి, ఎంపీడీవో ఎం.ఉషారాణీలకు వినతి పత్రాలను మంగళవారం అందజేశారు.

టీడీపీ, జనసేన నాయకుల నిరసన
టీడీపీ నేతల ఎంపీడీవోలకు వినతి
పెద్దాపురం, ఏప్రిల్ 2: వృద్దులు, దివ్యాంగుల, వితంతంతు తదితర సామాజిక భధ్రతా పెన్షన్లు నేరుగా లబ్ధిదారుల ఇళ్లవద్దకే వెళ్లి అందించేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు మున్సిపల్ కమిషనర్ కేవీ పద్మావతి, ఎంపీడీవో ఎం.ఉషారాణీలకు వినతి పత్రాలను మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు రంధి సత్యనారాయణ, కొత్తిం వెంకట శ్రీనివాసరావు (కోటి), తూతిక రాజు, బొడ్డు ఉదయశంకర్, బేదంపూడి సత్తిబాబు, తుమ్మల నాని, పాల్గొన్నారు.
తాళ్లరేవు: ప్రభుత్వం పేదలకు అందించే పింఛన్లు సచివాలయ సిబ్బందితో ఇంటింటికీ తిరిగి ఇప్పించాలని రాష్ట్రపార్టీ పిలుపు మేరకు టీడీపీ మండలస్థాయి నేతలు ఎంపీడీవో ప్రభాకరావుకు మంగళవారం వినతిపత్రం అందించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంవద్ద నిరసన తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నేత లు మందాల గంగసూర్యనారాయణ, ధూళిపూడి వెంకటరమణ, మం దాల గంగసూర్యనారాయణ, పొన్నమండ రామలక్ష్మి, జవ్వాది తాతాజీ పాల్గొన్నారు.
ఏలేశ్వరం: పెన్షన్లు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయాలని పట్టణ టీడీపీ శ్రేణులు కమిషన ర్ శివప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా టీడీపీ కౌన్సిలర్లు బొదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి, అలమండ చలమయ్య మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం వలంటీర్లకు ప్రభుత్వం అందించిన సెల్‌ఫోన్, సిమ్‌కార్డు తక్షణమే స్వాధీనం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎండగుండి నాగబాబు, కోనాల వెంకటరమణ, టీడీపీ నాయకులు చల్లా గణేష్, బూర్లు సత్తిబాబు, కోరాడ కృష్టయోహన్, భజంతుల మణి, బుగతా శ్రీను,కిలారి రామచంద్రరావు, సామంతుల గోపి, బాబ్జి, పాల్గొన్నారు.
జగ్గంపేట: పింఛన్ల సొమ్ముతోపాటు ప్రభుత్వ నిధులు రూ.13వేల కోట్లు సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టి, ఖజానా ఖాళీ కావడంతో జగన్ ప్రభుత్వం మరో కొత్త డ్రామాకి తెరలేపారని జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షుడు మారిశెట్టి భద్రం మండిపడ్డారు. జగ్గంపేట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జగ్గంపేట ఎంపీడీ వోకు పింఛన్లు ఇంటింటికి పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జగ్గంపేట టౌన్ టీడీపీ అధ్యక్షులు పాండ్రంగి రాంబాబు, జగ్గంపేట టౌన్ తెలుగు యువత అధ్యక్షులు కొండ్రోతు శ్రీను, వెంకటేశ్వరరావు, దార్ల నానాజీ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పడాల ఈశ్వరరావు, పడాల రాంబాబు, పడాల దుర్గాప్రసాద్ పడాల బాలాజీ, కూసిమించి బాలరాజు, పడాల విష్ణుమూర్తి, పాలిశెట్టి సతీష్, మానెల్తీ దుర్గప్రసాద్, కురందాస్ వెంకన్న, యర్రంశెట్టి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
కరప: లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లను పంపిణీ చేయాలని టీడీపీ కాకినాడరూరల్ కో-కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకటప్రభాకర్(బాబి) అధికారులకు విజ్ఞప్తిచేశారు. కరపలో మంగళవారం ఆయన పార్టీ నాయకులతో ఎంపీడీవో కొంకి అప్పారావును కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. టీడీపీ కో-ఆర్డినేటర్ పిల్లి సత్తిబాబుతో కలిసి కాకినాడరూరల్ ఎంపీడీవోకు కూడా వినతిపత్రం సమర్పించినట్టు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. టీడీపీ మండలాధ్యక్షుడు దేవు వెంకటేశ్వరరావు(వెంకన్న), నాయకులు కౌజు నెహ్రూ, కర్రి శ్రీను, ఎజ్జల బాబీ, పాట్నీడి రాంబాబు, కోన వెంకటలక్ష్మి, గీసాల వెంకటేశ్వరరావు, కంచుమర్తి లావణ్య, ఉమా మహేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
కిర్లంపూడి: పింఛన్లను సచివాలయ సిబ్బందితో ఇంటింటికీ పంపిణీ చేయాలని టీడీపీ, జనసేన నాయకులు మండలంలోని శృంగరాయునిపాలెం పంచాయతీవద్ద మంగళవారం ఆందో ళన నిర్వహించారు. సర్పంచ్ పట్టు చంటిబాబు, ఎంపీటీసీ గరగా గోవిందు, ఉపసర్పంచ్ బొజ్జపు శ్రీను, గొడే బాల, అల్లుమల్ల బాబీ, జనసేన అరిణే రాజేష్ ఆఽధ్వర్యంలో పింఛన్‌దారులకు మద్దతుగా నిరసన తెలిపారు. ఎంపీపీ తోటరవి, సర్పంచ్ వీరంరెడ్డి కాశీబాబు, భూపాలపట్నం ప్రసాద్ వీరికి మద్దతుగా నిలిచారు. అనంతరం పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందించారు. అదేవిధంగా కిర్లంపూడిలో టీడీపీ మండలాధ్యక్షుడు చదరం చంటిబాబు ఆధ్వర్యంలో డిమాండ్లతో కూడిన పత్రాన్ని ఈవోపీఆర్డీకి అందించారు. కుర్ల చినబాబు, తూము కుమార్, గుడాల రాంబాబు, ఆళ్ల బాబులు, ఆళ్ల నానాజీ, కాళ్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
సామర్లకోట: పింఛన్ల లబ్ధిదారులకు ఇళ్ల వద్దకే పింఛన్ల సొమ్ము పంపిణీ చేయాలని, అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతూ సామర్లకోట మండల, పట్టణ టీడీపీ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో ఎంపీడీవో శ్యామ్‌సుందర్‌కు, మున్సిపల్ కమిషనర్ జాస్తి రామారావులకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. వలంటీర్లకు బదులుగా ప్రభుత్వ సిబ్బందిని నియమించి పింఛన్లను యథావిధిగా పంపిణీ చేయాలన్నారు. ఈ సందర్బంగా పట్టణ, మండల టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలి
సర్పవరం జంక్షన్: వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇంటి వద్దే సామాజిక పింఛన్లు పంపిణీ చేసేందుకు ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేయాలని టీడీపీ కాకినాడ రూరల్ కో కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ (బాబీ) డిమాండ్ చేశారు.ఈ మేరకు మంగళవారం రమణయ్యపేట ఎంపీడీవో రమేష్‌నాయుడుకు వినతి పత్రం అందించారు.
రారు