Share News

పింఛన్లు.. తగ్గించెన్‌

ABN , Publish Date - Jun 07 , 2024 | 12:53 AM

వృద్ధుల పింఛన్లు గాలిలో కలిసిపోయాయి.. చిన్న చిన్న కారణాలతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 వేల మందికి పింఛన్లు నిలుపుదల చేశారు. దీంతో పింఛను లబ్ధిదారులు ఏం జరి గిందో తెలియక నేటికీ అధికారుల చుట్టూ తిరు గుతూనే ఉన్నారు. జనవరి నుంచి చూస్తే జూన్‌ 1కి వచ్చే సరికి జిల్లాలో సుమారు 4వేల పింఛన్లు లెక్కల్లోలేకుండా పోయాయి. జగన్‌ ఏ పని చేసినా ఆ లెక్కలో పక్కాగా మోసం, కుట్ర దాగి ఉంటుందనే వాస్తవానికి పింఛన్ల లబ్ధిదారుల సంఖ్యే నిదర్శనం.

 పింఛన్లు.. తగ్గించెన్‌

  • ఆరు నెలలుగా తగ్గింపు

  • జాబితా నుంచి తొలగింపు

  • 22 మండలాల్లో బాధితులు

  • అత్యధికంగా రాజమండ్రిలో 452

  • పింఛను అందక లబోదిబో

  • అధికారుల చుట్టూ ప్రదక్షిణలు

  • వచ్చే ప్రభుత్వం చూడాలని వేడుకోలు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

వృద్ధుల పింఛన్లు గాలిలో కలిసిపోయాయి.. చిన్న చిన్న కారణాలతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 వేల మందికి పింఛన్లు నిలుపుదల చేశారు. దీంతో పింఛను లబ్ధిదారులు ఏం జరి గిందో తెలియక నేటికీ అధికారుల చుట్టూ తిరు గుతూనే ఉన్నారు. జనవరి నుంచి చూస్తే జూన్‌ 1కి వచ్చే సరికి జిల్లాలో సుమారు 4వేల పింఛన్లు లెక్కల్లోలేకుండా పోయాయి. జగన్‌ ఏ పని చేసినా ఆ లెక్కలో పక్కాగా మోసం, కుట్ర దాగి ఉంటుందనే వాస్తవానికి పింఛన్ల లబ్ధిదారుల సంఖ్యే నిదర్శనం. పింఛను స్వల్ప మొత్తంలో పెంపుదల చేసి ఆ మేరకు లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తూ వచ్చారు. పింఛను పెంపుదల చేసిన జనవరి నుంచీ చూస్తే జూన్‌ 1కి వచ్చే సరికి జిల్లాలో 4 వేల పింఛన్లు ‘ఫ్యాను గాలి’లో కలిసి పోయాయి. అంత పెద్ద మొత్తంలో పింఛను దారుల సంఖ్యలో ఎందుకు కోత పడిందనే ప్ర శ్నకు సమాధానం లేదు. ప్రతి మండలం లోనూ పింఛన్లు రద్దు చేశారు. అత్యధికంగా రాజమహేం ద్రవరం అర్బన్‌లో 452, రూరల్‌లో 249 మంది పింఛను ఎగిరిపోయింది. మొత్తం 22మండలాల్లో 3391 మంది లబ్ధిదారులను పింఛన్ల జాబితా నుంచి తీసేశారు. హెచ్‌ఐవీ పింఛన్లు జనవరి 1కి 2392 ఉండగా వాటిలో ఎన్ని కోసేశారో అధికా రులు వెల్లడించలేదు. మొత్తానికి జనవరి 1కి లబ్ధిదారుల సంఖ్య 2,48,084 ఉండగా జూన్‌ 1కి వచ్చేసరికి 2,42,300కి తగ్గింది. ఈ లెక్కన 5783 పింఛన్లు వ్యత్యాసం ఉంది. వీటిలో 2392 హెచ్‌ ఐవీ పింఛన్లు ఉన్నాయి. అయితే వీటిలో ఎన్ని తగ్గిం చారనే సమాచారం లేదు. కొత్త పింఛనుదా రులు పెరిగినా లబ్ధిదారుల సంఖ్య మాత్రం పెరగడం లేదు.ఏవో చిన్న చిన్న కారణాలతో పింఛను నిలుపుదల చేయడంతో లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో మొత్తం సుమారు 4 వేల పింఛన్లను రద్దు చేసినట్టు తెలుస్తోంది. ఇది చాలదన్నట్టు ఉన్న లబ్ధిదారులకైనా సక్రమంగా పింఛన్ల పం పిణీ చేస్తున్నారా అంటే అదీ లేదు. పండుటా కులను ఈ నెలా ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నారు. పింఛన్లు ఈ నెల కూడా బ్యాంకుల ద్వారానే ఇవ్వడంతో వృద్ధులు బ్యాంకుల ఎదుట క్యూ కడుతున్నారు.. బ్యాంకు సిబ్బంది చీకొడు తున్నా పాపం పింఛనుదారులు మాత్రం ఏం చేయాలో తెలియక అక్కడే గంటల తరబడి నిల బడి ఉంటున్నారు.. మరో వైపు బ్యాంకు సిబ్బంది బ్యాంక్‌ సర్వీస్‌ సెంటర్లకు వెళ్లి పింఛన్లు తీసుకో వాలని చెప్పడంతో అక్కడా పెద్ద ఎత్తున క్యూలు ఉంటున్నాయి. ఒక్కో లబ్ధిదారు నుంచి సుమారు రూ.100లు తీసుకుని రూ.2900 చేతిలో పెడుతు న్నారు. దీనిపై వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఎంతకాలం ఈ కష్టం అంటూ బాధపడు తున్నారు.ఎన్నికల షెడ్యూల్‌ మార్చి 16న విడుద లైంది. ఆ నెల పింఛను ఏప్రి ల్‌లో సచివాలయ సిబ్బంది ద్వారా సునాయా సంగా కేవలం రెండు రోజుల్లోనే ఇంటింటికీ పంపిణీ చేశారు. అదే తప్ప యినట్టు జగన్‌ మనసు మళ్లీ మారిపోయింది. సచివాలయ సిబ్బందితో పింఛన్లు ఇంటింటికీ పం పిణీ చేస్తే ఓట్లు పడవన్న ఉద్దేశంతో బ్యాంకుల్లో వేయించారు.. పోలింగ్‌ ముగిసినా ఈ నెల పిం ఛన్లు బ్యాంకుల్లోనే వేయడంతో వృద్ధులు లబోది బోమంటున్నారు. వచ్చే ప్రభుత్వమైన తమ పింఛన్ల పునరుద్ధరణపై దృష్టి సారించి, ఇంటి వద్దే పంపిణీ చేయాలని వేడుకుంటున్నారు.

Updated Date - Jun 07 , 2024 | 12:53 AM