Share News

దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ర్యాలీ

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:53 AM

దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ర్యాలీ

 దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ర్యాలీ

అమలాపురం టౌన్‌, ఫిబ్రవరి 12: న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ దివ్యాంగుల ఐక్య జేఏసీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం మోటారు సైకిళ్లపై ర్యాలీ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన దివ్యాంగులు అమలాపురం హైస్కూలు సెంటరు నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ జరిపారు. కలెక్టరేట్‌ ఎదుట భారీ ధర్నా చేపట్టారు. దివ్యాంగులకు పెన్షన్‌ను రూ.3వేలు నుంచి రూ.6వేలకు పెంచాలని, అంత్యోదయకార్డులు అందించాలని, ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని, పెండింగులో ఉన్న బ్యాగ్‌లాగ్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, కాంట్రాక్టు, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని ప్లకార్డులు చేతబూని పెద్ద ఎత్తుననినాదాలు చేశారు. జేఏసీ జిల్లా శాఖ అధ్యక్షుడు పెనుమాల నాగరాజు మాట్లాడుతూ అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రభుత్వమే ఇళ్లునిర్మించి ఇవ్వాలని డిమాండు చేశారు. విభిన్నప్రతిభావంతుల హక్కుల చట్టం- 2016ను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. కలెక్టర్‌ హిమాన్షు శుక్లాను కలిసి వినతిపత్రం అందజేశారు. ధర్నాలో జిల్లా కార్యదర్శి కొప్పాడి సత్యవెంకటనాగరాజు, కోశాధికారి కొసన సత్యసుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షుడు పచ్చిపాల శ్రీను, సంయుక్త కార్యదర్శి జనిపెల్ల సంపత్‌కుమార్‌, నాయకులు గంటా గోవిందు, జొన్నాడ రాజు, నలమాటి లంకరాజు, పితాని ఏసుబాబు, నరసింహస్వామి, రాయుడు బాబి, బండారు లక్ష్మణ్‌, కోలా భూషణం, చిలకలపూడి నరసింహస్వామి, మీరాసాహెబ్‌, సలాది మూర్తి, మోటూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 12:53 AM