Share News

నేటి నుంచి శృంగారవల్లభస్వామి కల్యాణోత్సవాలు

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:21 AM

పెద్దాపురం, ఏప్రిల్‌ 18: మండల పరిధిలోని తిరుపతి శృంగారవల్లభస్వామి దివ్య కల్యాణ మహోత్సవాలు ఈనెల 19 నుంచి 24 వరకూ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం ఈవో వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. కల్యాణోత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏ

నేటి నుంచి శృంగారవల్లభస్వామి కల్యాణోత్సవాలు

పెద్దాపురం, ఏప్రిల్‌ 18: మండల పరిధిలోని తిరుపతి శృంగారవల్లభస్వామి దివ్య కల్యాణ మహోత్సవాలు ఈనెల 19 నుంచి 24 వరకూ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం ఈవో వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. కల్యాణోత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 19న అంకురార్పణ, పుణ్యాహవచనం, విష్వక్సేరాధన, ధ్వజారోహణ, అగ్నిప్రతిష్ఠ, మండ పారాధన కార్యక్రమాలు...20న గ్రామోత్సవం, 21న సదస్యం, 22న సుదర్శన హోమం, సాయంత్రం చోరసంవాదం, 23న వసంతోత్సవం, బుక్కాపండుగ, సామూహిక కుంకు మ పూజలు, 24న స్వామివారికి శ్రీపుష్పోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.

Updated Date - Apr 19 , 2024 | 12:21 AM