Share News

సమష్టి సహకారంతోనే ప్రశాంతంగా పోలింగ్‌

ABN , Publish Date - May 16 , 2024 | 12:16 AM

పెద్దాపురం, మే 15: ప్రజలు, పోలింగ్‌ సిబ్బంది, రాజకీయపార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధుల సమష్ఠి సహకారంతోనే పెద్దాపురం నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరిగినట్లు పెద్దాపురం ఆర్డీవో, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి జె.సీతారామా రావు తెలిపారు. బుధవారం ఆయన స్థానిక విలేఖరులతో మా

సమష్టి సహకారంతోనే ప్రశాంతంగా పోలింగ్‌

అత్యధికం 95.19, అత్యల్పం 54.38

రిటర్నింగ్‌ అధికారి సీతారామారావు

పెద్దాపురం, మే 15: ప్రజలు, పోలింగ్‌ సిబ్బంది, రాజకీయపార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధుల సమష్ఠి సహకారంతోనే పెద్దాపురం నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరిగినట్లు పెద్దాపురం ఆర్డీవో, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి జె.సీతారామా రావు తెలిపారు. బుధవారం ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడారు. పోలింగ్‌ ముగింపు తరువాత ఈవీఎంలను కాకినాడ జేఎన్టీయూలో స్ట్రాంగ్‌ రూముల్లో భారీ బందోబస్తు నడుమ భధ్రపరచడం జరిగిందన్నారు. పెద్దాపురం నియోజ కవర్గంలో ఉన్న 201 పోలింగ్‌ కేంద్రాల్లో ఈనెల 13న జరిగిన పోలింగ్‌లో 2,15,095 మంది ఓటర్లకుగాను 1,76,993 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగిం చుకున్నారన్నారు. స్వీప్‌ లక్ష్యంతో నియోజకవర్గంలో 82.29 శాతం పోలింగ్‌ నమోదైం దన్నారు. పెద్దాపురం మండలం ఉలిమేశ్వరంలో 95.19 శాతం పోలింగ్‌ నమోదుకాగా పెద్దాపురం అర్బన్‌ పరిధిలో 81వ బూత్‌లో 54.38 శాతం పోలింగ్‌ నమోదయ్యిం దన్నారు. పోలింగ్‌కు సహకరించిన ప్రతీ ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

Updated Date - May 16 , 2024 | 12:16 AM