పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:04 AM
సామర్లకోట, జూలై 27: పర్యావరణ పరిరక్షణకు అందరూ మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మ కాయల చినరాజప్ప పేర్కొన్నారు. సామర్లకోట మున్సిపల్ కమిషనర్ జాస్తి రామారావు ఆధ్వర్యంలో స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా శనివారం పట్టణం లో మొ

పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప
సామర్లకోట, జూలై 27: పర్యావరణ పరిరక్షణకు అందరూ మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మ కాయల చినరాజప్ప పేర్కొన్నారు. సామర్లకోట మున్సిపల్ కమిషనర్ జాస్తి రామారావు ఆధ్వర్యంలో స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా శనివారం పట్టణం లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాజప్ప, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, బీజేపీ ఇన్‌చార్జి విత్తనాల వెంకట రమణ హాజరయ్యారు. పెద్దాపురం రోడ్డులో డివైడర్ల వెంట మొక్కలను వారు నాటి నీరు పోశారు. ము న్సిపల్ కార్యాలయ ఆవరణలో గల కాపు కల్యాణ మండపం ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమ ంలో టీడీపీ కౌన్సిలర్లు, టీడీపీ, జనసేన, బీజేపీ నా యకులు, మున్సిపల్ చైర్‌పర్సన్ జీ.అరుణ పాల్గొన్నా రు.రాష్ట్రంలో విద్యారంగానికి టీడీపీ ప్రభుత్వ హయా ంలోనే అధిక ప్రాధాన్యమిచ్చి ఉన్నత ఉద్యోగావకాశా లకు ప్రోత్సహించిందని ఎమ్మెల్యే చినరాజప్ప అన్నా రు. సామర్లకోట ప్రభుత్వ కళాశాల ఆవరణలో మండలస్థాయి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్టూడెంట్ కిట్ల పంపిణీ ఎంఈవో పి.పుల్లయ్య ఆధ్వ ర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాజప్ప, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, బీజేపీ ఇన్‌చార్జి వెంకటరమణ పాల్గొన్నారు. అచ్చుపుస్తకా లు, నోట్స్ పుస్తకాలు, బ్యాగ్‌లు, షూలు, యూనిఫాం తదితర విద్యా సామగ్రిని విద్యార్థులకు అందజేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, పాల్గొన్నారు.
మంత్రి లోకేశ్‌కు అభినందించిన
కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న ఆశలు ఒమ్ముచేయని రీతిలో సుపరిపాలన అందించేందుకు విశేష కృషిచేస్తున్న మంత్రి నారా లోకేశ్‌ను ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అభినందించారు. శనివా రం అమరావతిలో లోకేశ్‌ను రాజప్ప, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నున్న రామకృష్ణ అభినందించారు. జిల్లాలో రైస్‌మిల్ పరిశ్రమకు పూర్వవైభవం తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేసి ఆదుకోవాలని రామకృష్ణ లోకేశ్‌ను కోరారు.