Share News

విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

ABN , Publish Date - Jun 17 , 2024 | 12:18 AM

పెద్దాపురం, జూన్‌ 16: విద్యాభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండలంలోని దివిలిలో నూతనంగా ఏర్పాటుచేసిన ఓ ప్రైవేటు పాఠశాలను జనసేన కాకినాడ జిల్లా ఇన్‌చార్జ్‌ తుమ్మల రామస్వామి (బాబు)తో కలిసి ఆయన ఆదివారం ప్రారంభో త్స

విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
పాఠశాలను ప్రారంభిస్తున్న చినరాజప్ప

పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప

పెద్దాపురం, జూన్‌ 16: విద్యాభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండలంలోని దివిలిలో నూతనంగా ఏర్పాటుచేసిన ఓ ప్రైవేటు పాఠశాలను జనసేన కాకినాడ జిల్లా ఇన్‌చార్జ్‌ తుమ్మల రామస్వామి (బాబు)తో కలిసి ఆయన ఆదివారం ప్రారంభో త్సవం చేశారు. అనంతరం ఆయన మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఒక్కరికీ నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారికి ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించడం జరుగుతుందన్నారు. ప్రైవేటు పాఠశాలలు కేవలం ధనార్జనే ధ్యేయం గా కాకుండా ప్రభుత్వ విధి విధానాలను అనుస రించి పేదలకు సైతం విద్యను ఉచితంగా అంది ంచేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం గ్రామదేవత పల్లాలమ్మ అమ్మవారిని దర్శించు కున్నారు. కార్యక్రమంలో దివిలి కిట్స్‌ ఇంజనీరిం గ్‌ కళాశాల చైర్మన్‌ బేతినీడి శ్రీనివాసరావు, టీడీపీ మండలాధ్యక్షుడు కొత్తిం వెంకట శ్రీనివా సరావు (కోటి), తిరుపతి, దివిలి గ్రామ సర్పంచ్‌లు మొయిళ్ల కృష్ణమూర్తి, పెంకే శ్రీను, నరాలశెట్టి బాబ్జీరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 12:18 AM