టీడీపీ, జనసేన కూటమితోనే అభివృద్ధి
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:08 AM
పెద్దాపురం, మార్చి 5: టీడీపీ, జనసేన కూటమి తోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యపడుతుందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఎన్నికల ప్రచార ంలో భాగంగా ఆయన పట్టణంలో స్థానిక దర్గా సెంటర్ నుంచి డైలీమార్కెట్, మెయిన్ రోడ్డు, వెంక టేశ్వరస్వామి ఆలయం, దర్గాసెంటర్ మీదుగా మంగ ళవా

ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప
పెద్దాపురం, మార్చి 5: టీడీపీ, జనసేన కూటమి తోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యపడుతుందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఎన్నికల ప్రచార ంలో భాగంగా ఆయన పట్టణంలో స్థానిక దర్గా సెంటర్ నుంచి డైలీమార్కెట్, మెయిన్ రోడ్డు, వెంక టేశ్వరస్వామి ఆలయం, దర్గాసెంటర్ మీదుగా మంగ ళవారం ప్రచారాన్ని చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధికి దూమైపోయిందని, రాష్ట్రం పూర్తిగా తిరోగమనంలోకి వెళ్లిపోయిందన్నారు. ఇప్పటికే వైసీపీని ప్రజలు ఛీదరించుకుంటున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ పని పెట్టుకుందన్నారు. అనంతరం టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను ఆయన ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు రాజాసూరిబాబురాజు, నిమ్మకాయల రంగనాగ్, మన్యం దేవబాబు, పేకేటి దొరబాబు, అరీఫ్ ఆలీ, తూతిక రాజు, కొరిపూరి రాజు, అధిక సంఖ్యలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.
టీడీపీలోకి చేరికలు
పట్టణానికి చెందిన పలువురు వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. మైనారిటీ సంఘ నేత మహ్మద్ లాయక్ ఆలీ తన అనుచరులతో కలిసి మంగళవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే చిన రాజప్ప పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వా నించారు. వైసీపీలో తగిన గుర్తింపు లభించకపోవడం కారణంగానే తాము టీడీపీలోకి చేరినట్టు తెలిపారు.