టీడీపీ, జనసేన కూటమిదే విజయం
ABN , Publish Date - Mar 04 , 2024 | 12:06 AM
పెద్దాపురం. మార్చి 2: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి విజయం సాధించడం తఽథ్యమని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆయన స్థానిక 19వ వార్డులో ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని చేపట్టి మాట్లాడుతూ ఇప్పటికే వైసీపీలో వణుకు ప్రారంభ మైందన్నారు. టీ
ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప
పెద్దాపురం. మార్చి 2: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి విజయం సాధించడం తఽథ్యమని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆయన స్థానిక 19వ వార్డులో ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని చేపట్టి మాట్లాడుతూ ఇప్పటికే వైసీపీలో వణుకు ప్రారంభ మైందన్నారు. టీడీపీ, జనసేన కూటమిని ప్రజలు ఆదరిసు ్తన్నారన్నారు. ఎవరిది అభివృద్ధి పాలనో, ఎవరిది విధ్వసంకర పాలనో ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అ నేది మచ్చుకైనా కనిపించడం లేదని వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు. టీడీపీ నేతలు రాజా సూరిబాబురాజు, తూతిక రాజు తదితరులు ఉన్నారు.
సామర్లకోట: పెద్దాపురం ఎమ్మెల్యేగా తనను గెలిపిం చాలని నిమ్మకాయల చినరాజప్ప కోరారు. సామర్లకోటలో మఠం సెంటర్ వద్ద గల శ్రీరామాలయ, శ్రీవీరభద్రాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పట్టణ ప్రముఖులు పెనుపోతుల సూర్యనారాయణ, సింగవరపు సాయిబాబు, సింగవరపు సత్యనారాయణ, సిద్దాంతి నోరి కృష్ణారావులను కలిశారు.