Share News

పెద్దాపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌పై దాడికి యత్నం

ABN , Publish Date - Aug 01 , 2024 | 01:31 AM

పెద్దాపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొడ్డు తులసీ మంగతాయా రుపై బుధవారం ఓ యువకుడు దాడికి యత్నించాడు. స్థానిక వరహాలయ్యపేటలో నివ సిస్తున్న చైర్‌పర్సన్‌ కుటుంబానికి అదే ప్రాంతంలో నివసిస్తున్న యువకుడు తానారి సోమరాజు కుటుంబానికి కుటుంబ విషయాలకు సంబంధించి వివాదాలు జరుగుతున్నా యి. కౌన్సిల్‌ సమావేశం ముగించుకుని ఇంటికి వెళ్లిన చైర్‌పర్సన్‌ ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న సోమరాజు మద్యం సేవించి చైర్‌పర్సన్‌ ఇంటి వెళ్లి తలుపులు బద్దలు కొట్టేందుకు ప్రయత్నం చేశాడు. ఆమెను దుర్భాషలాడుతూ హంగామా సృష్టించాడు.

పెద్దాపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌పై దాడికి యత్నం

పెద్దాపురం, జూలై31: పెద్దాపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొడ్డు తులసీ మంగతాయా రుపై బుధవారం ఓ యువకుడు దాడికి యత్నించాడు. స్థానిక వరహాలయ్యపేటలో నివ సిస్తున్న చైర్‌పర్సన్‌ కుటుంబానికి అదే ప్రాంతంలో నివసిస్తున్న యువకుడు తానారి సోమరాజు కుటుంబానికి కుటుంబ విషయాలకు సంబంధించి వివాదాలు జరుగుతున్నా యి. కౌన్సిల్‌ సమావేశం ముగించుకుని ఇంటికి వెళ్లిన చైర్‌పర్సన్‌ ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న సోమరాజు మద్యం సేవించి చైర్‌పర్సన్‌ ఇంటి వెళ్లి తలుపులు బద్దలు కొట్టేందుకు ప్రయత్నం చేశాడు. ఆమెను దుర్భాషలాడుతూ హంగామా సృష్టించాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో సమీపంలో ఉన్నవారు వచ్చి యువకుడిని నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో ఆ యువకుడు దాడికి ప్రయత్నం చేయడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై వెలుగుల సురేష్‌ అక్కడికిచేరుకుని ఆ యువకు డిని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే వైసీపీ పెద్దాపురం నియోజక వర్గ కోఆర్డీనేటర్‌ దవులూరి దొరబాబు, వైస్‌ చైర్మన్‌ నెక్కంటి సాయిప్రసాద్‌, కౌన్సిలర్లు అక్కడకు చేరుకుని ఆమెకు అండగా నిలిచారు. చైర్‌పర్సన్‌పై దాడిని ఖండించారు.

Updated Date - Aug 01 , 2024 | 10:09 AM