Share News

మరిడమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Aug 04 , 2024 | 11:55 PM

పెద్దాపురం, ఆగస్టు 4: మరిడమ్మ జాతరకు చివరి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు పోటె త్తారు. తెల్లవారుజామునుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.

మరిడమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు
ప్రత్యేక అలంకరణలో మరిడమ్మ

పెద్దాపురం, ఆగస్టు 4: మరిడమ్మ జాతరకు చివరి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు పోటె త్తారు. తెల్లవారుజామునుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. అమ్మవారిని దర్శి ంచుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ చేబ్రోలు రామ్మోహనరావు ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బారికేడ్లు, క్యూలైన్లలో భక్తుల సౌకర్యం కోసం పలు ఏర్పాట్లు చేశారు. అలాగే పలు స్వచ్ఛంధ సంస్థల ఆధ్వర్యంలో భక్తులకు మంచినీరు, చంటి పిల్లలకు పాలు, పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేశారు. పెద్దాపు రం డీఎస్పీ లతాకుమారీ పర్యవేక్షణలో సీఐ రవికుమార్‌, ఎస్‌ఐ వెలుగుల సురేష్‌ ఆధ్వర్యం లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జర గకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. సుమారు 15వేలమంది భక్తులు అమ్మవారిని దర్శించుకు న్నట్టు ఆలయ వర్గాలు తెలియచేశారు.

Updated Date - Aug 04 , 2024 | 11:55 PM