Share News

ప్రశాంతంగా డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ రాత పరీక్ష

ABN , Publish Date - May 26 , 2024 | 01:22 AM

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన డిప్యూటీ ఎడ్యుకేనషల్‌ ఆఫీసర్‌ రాత పరీక్ష శనివారం ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఏపీపీఎస్సీ పరీక్షల నోడల్‌ అధికారి, డీఆర్వో తిప్పేనాయక్‌ తెలి పారు.

ప్రశాంతంగా డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ రాత పరీక్ష

కలెక్టరేట్‌ (కాకినాడ), మే 25: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన డిప్యూటీ ఎడ్యుకేనషల్‌ ఆఫీసర్‌ రాత పరీక్ష శనివారం ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఏపీపీఎస్సీ పరీక్షల నోడల్‌ అధికారి, డీఆర్వో తిప్పేనాయక్‌ తెలి పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు జరిగిన డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ రాత పరీక్షకు జిల్లా లో 1120 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 787 మంది హాజరయ్యార న్నారు. 333 మంది పరీక్షకు హాజరు కాలేదన్నారు. పరీక్షకు 72.32 శాతం మంది హాజరు ఉందన్నారు. పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయని చెప్పా రు. ఈ పరీక్షలను సూరంపాలెంలోని ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాల, ఆదిత్య ఇంజ నీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, ప్రగతి ఇంజనీరింగ్‌ కళాశాల, కాకినాడ అచ్చుతాపురం రైల్వేట్రాక్‌ వద్ద ఉన్న ఐయాన్‌ డిజిటల్‌ జోన్‌ పరీక్షలు నిర్వహించామని చెప్పారు.

Updated Date - May 26 , 2024 | 01:22 AM