Share News

వైసీపీ అభ్యర్థులను ఓడించండి..

ABN , Publish Date - May 12 , 2024 | 01:19 AM

కాకినాడ నగరాన్ని రౌడీల రాజ్యంగా తయారు చేసి ప్రజలకు భద్రత లేకుం డా చేసిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖ ర్‌రెడ్డిని ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్‌లో శనివారం జనసేన,టీడీపీ, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల చివరి బహిరంగ సభలో పవన్‌ మాట్లాడారు.

వైసీపీ అభ్యర్థులను ఓడించండి..

  • పేట్రేగిన ద్వారంపూడి అక్రమాలు

  • అధికారమిస్తే.. అంతు చూస్తా

  • జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

కలెక్టరేట్‌(కాకినాడ),మే 11 : కాకినాడ నగరాన్ని రౌడీల రాజ్యంగా తయారు చేసి ప్రజలకు భద్రత లేకుం డా చేసిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖ ర్‌రెడ్డిని ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్‌లో శనివారం జనసేన,టీడీపీ, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల చివరి బహిరంగ సభలో పవన్‌ మాట్లాడారు. ద్వారంపూడి కాకినాడను గంజాయికి కేపిటల్‌గా మా ర్చేసి యువత జీవితాలతో ఆడుకుంటున్నారన్నారు.పచ్చటి మడ అడవు ల ను ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. అక్రమంగా బియ్యం రవాణా.. ఆయిల్‌ మాఫియా ద్వారా కోట్లు ఆర్జిస్తున్నారని విమర్శించారు. కాకినాడలో పేకాట క్లబ్‌లను నడుపుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని విమ ర్శించారు.ద్వారంపూడి అనుచరులు భూకబ్జాలకు పాల్పడుతూ ప్రజల ను భయబ్రాంతులకు గురిచేస్తున్నారనీ..ఇలాంటి తరుణంలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో మరిన్ని అక్రమాలు చేస్తారని హెచ్చరించారు.ద్వారంపూడి తండ్రి సివిల్‌ సప్లయిస్‌ చైర్మన్‌గా,తమ్ముడు రైస్‌మిల్లర్ల అసోసియేషన్‌ అధ్యక్షు డిగా ఉండి అనేక విధాలుగా ఈ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. ఇలాంటి ద్వారంపూడిని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించకపోతే కాకినాడ నగ రానికి భవిష్యత్తు ఉండదన్నారు. కూటమి అధికా రంలోకి వచ్చిన తర్వాత ద్వారంపూడిని నడిరోడ్డుపై మోకాళ్లపై కూర్చోబెట్టి నడిపిస్తానని హెచ్చ రించారు.కాకినాడలో ఆడబిడ్డలు రోడ్డుపై తిరగాలంటే భయపడుతు న్నా రని..దీనికి కాకినాడలో ద్వారంపూడికి చెందిన బ్లేడు బ్యాచే కారణమని ఆరోపించా రు.యువత ధైర్యంగా ఓటేసి ద్వారం పూడి వంటి రౌడీలను ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చా రు.రోజుకోపార్టీ మారుతున్న వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమ లశెట్టి సునీల్‌ను ఓడించాలన్నారు. కాకినాడ పార్లమెంట్‌ జనసేన కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌, కాకి నాడ రూరల్‌,సీటీ అసె ంబ్లీ కూటమి అభ్య ర్థులు పంతం నానా జీ,వనమాడి కొండ బాబులను గెలి పించాలని అభ్య ర్థించారు.

దుర్గాడలో పవన్‌ రోడ్‌షో

పిఠాపురం/గొల్లప్రోలు రూరల్‌, మే 11: ప్రజలతో కలిసి నడుస్తూ.. సమస్యలు అడిగి తెలుసుకుంటూ..యువతను అక్కున చేర్చుకుంటూ పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ చివరి ఎన్నికల ప్రచారం చేశారు.గొల్లప్రోలు మండలం దుర్గా డలో శనివారం మాజీ ఎమ్మెల్యే వర్మతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. అడుగడుగునా జననీరాజనం పలికారు.చేబ్రోలు వై.జంక్షన్‌ నుంచి బైపాస్‌రోడ్డులోని తన నివాసం వరకూ పాదయాత్రగా నడిచారు.గాజుగ్లాసు గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని కోరారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు బాధితుడనంటూ ప్లకార్డు ప్రదర్శించిన దుర్గాడకు చెం దిన గంగాధర్‌తో కలిసి నడిచారు. మెగా పవర్‌స్టార్‌ రామచరణ్‌, తన తల్లి సురేఖ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌లతో కలిసి పిఠాపురం పాదగయక్షేత్రంలోని విఘ్నేశ్వరస్వామి,దత్తాత్రేయస్వామి, పుర్హుతికాఅమ్మవారు, కుక్కుటేశ్వరస్వామి,రాజరాజేశ్వరీదేవిలను దర్శించుకున్నారు.

Updated Date - May 12 , 2024 | 01:19 AM