రేపు సామర్లకోటలో పవన్ సభ
ABN , Publish Date - Apr 26 , 2024 | 12:04 AM
సామర్లకోట, ఏప్రిల్ 25: జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీకూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 27 సాయంత్రం 5 గంటలకు సామర్లకోట రింగ్ సెంటర్ వద్ద బహిరంగసభలో పాల్గొననున్నారు. ఈ మేరకు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో పెద్దాపురం నియోజక
సామర్లకోట, ఏప్రిల్ 25: జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీకూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 27 సాయంత్రం 5 గంటలకు సామర్లకోట రింగ్ సెంటర్ వద్ద బహిరంగసభలో పాల్గొననున్నారు. ఈ మేరకు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో పెద్దాపురం నియోజకవర్గ జనసేన, బీజేపీ నాయకులు సామర్లకోట బహిరంగసభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే చినరాజప్పకు పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ లో భాగంగా సామర్లకోటకు పవన్ కల్యాణ్ రానున్నారు.