Share News

జన కెరటం!

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:56 AM

‘రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచక పాలన అంతం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం సొంత పార్టీ ప్రయోజనాలనే పణంగా పెట్టి, అనుభవం ఉన్న చంద్రబాబుకు మద్దతు ఇచ్చినవాడిని.. ఏ ఒక్క కులాలకో పరిమితం కాను. అన్ని కులాల ప్రయోజనాల కోసం పాటుపడతా. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి గెలిపించాలి’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కోరారు.

జన కెరటం!
నువ్వు కావాలయ్యా.. నువ్వు రావాలయ్యా : కాకినాడ రూరల్‌లో పవన్‌ రోడ్‌ షో

కాకినాడ రూరల్‌, సామర్లకోటల్లో సభలు

వైసీపీ నాయకుల తీరుపై తీవ్ర ఆగ్రహం

కూటమిని గెలిపించాలని విన్నపం

బాధితులకు న్యాయం చేస్తామని హామీ

సర్పవరం జంక్షన్‌/కాకినాడ రూరల్‌/పెద్దాపురం/ సామర్లకోట, ఏప్రిల్‌ 27: ‘రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచక పాలన అంతం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం సొంత పార్టీ ప్రయోజనాలనే పణంగా పెట్టి, అనుభవం ఉన్న చంద్రబాబుకు మద్దతు ఇచ్చినవాడిని.. ఏ ఒక్క కులాలకో పరిమితం కాను. అన్ని కులాల ప్రయోజనాల కోసం పాటుపడతా. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి గెలిపించాలి’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కోరారు. కాకినాడ రూరల్‌ ఇంద్రపాలెం ముసలమ్మతల్లి ఆలయం వద్ద కాకినాడ రూరల్‌ జనసేన కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు(నానాజీ)ఆధ్వర్యంలో శనివారం రాత్రి వారాహి యాత్ర నిర్వహించారు. పవన్‌ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేపట్టేబోయే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిలపై తీవ్ర విమర్శలు చేశారు. డొక్కు స్కూటర్‌తో సమాచారం కావాలంటే మా ఇంటికి వచ్చే కన్నబాబు అక్రమాలు, సెటిల్‌మెంట్లకు పాల్పడి రూ.వెయ్యి కోట్ల అక్రమార్జనకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆస్తి తగాదా పేరు చెప్పి యువ డాక్టర్‌ ఆత్మహత్యకు కారణమైన దుర్మార్గుడు అని ఆరోపించారు.వాకలపూడిలో 20 మందికి చెందిన 4.86 ఎకరాల భూమిని కడప జిల్లాకు చెందిన రెడ్లు కొట్టేయడంలో సహకరించారన్నారు.తమ్మవరం రైతుల నుంచి ఏపీఐఐసీ సేకరించిన 298 ఎకరాల భూమిని వెనక్కి ఇప్పిస్తానని హామీ ఇచ్చి సీఎం జగన్‌, ఎమ్మెల్యే కన్నబాబు రైతులను మోసగించార న్నారు. కన్నబాబు కమిషన్లు తీసుకుంటూ దందాలకు పాల్పడుతున్నారన్నారు. కేవలం కమీషన్‌ కోసం కొం గోడు బ్రిడ్జి నిర్మాణాన్ని అడ్డుకున్న ఘనుడన్నారు. సూర్యారావుపేటలో మత్స్యకారుల ఇళ్లను ఖాళీ చేయిం చి తిరిగి స్థలాలివ్వలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అక్ర మాలు మర్చిపోలేదన్నారు. రాష్ట్ర శ్రేయస్సు, యు వత భవిష్యత్తు కోసం గాజుగ్లాసు గుర్తులపై రెండు ఓట్లేసి ఎమ్మెల్యేగా పంతం నానాజీ, ఎంపీగా తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌లను గెలిపించాలని కోరారు. టీడీపీకి చెందిన సీనియర్‌ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులను పవన్‌ ప్రశంసించారు.సభలో ఎన్నికల కోఆర్డినేటర్‌ నులుకుర్తి వెంకటేశ్వరరావు,కె.బాబీ, బీజేపీ పార్లమెంట్‌ కన్వీనర్‌ రంబాల వెంకటేశ్వరరావు, డాక్టర్‌ చప్పిడి వెంకటేశ్వరరావు, డాక్టర్‌ బొండా సూర్యారావు, కాకరపల్లి చలపతి, రాందేవు సీతయ్యదొర, పెంకే శ్రీనివాస్‌బాబా పాల్గొన్నారు.

ఐదేళ్ల పాలన.. ఆరు పరిశ్రమల మూత

శత సంవత్సరాల చరిత్ర గల సామర్లకోట డెక్కన్‌ షుగర్‌ ఫ్యాక్టరీ, సగ్గుబియ్యం పరిశ్రమ, నాలుగు సహ కార చక్కెర కర్మాగారాలు ఐదేళ్ల వైసీపీ పాలనలోనే మూతపడ్డాయని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పట్టణ రింగ్‌ సెంటర్‌లో శనివారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాజానగరం నుంచి కాకినాడ వరకూ ఉన్న ఏడీబీ రోడ్డులో స్వయంగా ప్రయాణించి ప్రజల కష్టాలు తెలుసుకున్నానన్నారు.రానున్న కూటమి ప్రభు త్వంలో రోడ్లను అభివృద్ధి చేసే బాధ్యతను జనసేన తరపున తాను స్వీకరిస్తానన్నారు. స్థానికంగా 100 పడకల ఆస్పత్రిని నిర్మించి మెరుగైన వైద్యం అందిస్తా నన్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి, పెద్దాపురం వైసీపీ ఇన్‌చార్జి దవులూరి దొరబాబు కలిసి 600 ఎకరాల రామేశం మెట్టను పూర్తిగా నేలమట్టం చేశారని ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన ప్రతి వైసీపీ నాయకుడిని రామేశంమెట్టలో మోకాలిపై నడిపిస్తామంటూ హెచ్చ రించారు.పెద్దాపురం నియోజకవర్గంలో 55 ఎకరాల్లో 20,040 మందికి స్థలాలిస్తే వాటిలో 1,019 మంది మాత్రమే ఇళ్లు నిర్మించుకున్నారన్నారు. సామర్లకోట, పెద్దాపురం పట్టణాలకు గోదావరి జలాలను అందిస్తా మని జగన్‌ ఇచ్చిన హామీ ఏమైందన్నారు. ఎస్సీలు తమ పథకాలను ఎందుకు నిలిపివేశారో నిలదీయా లన్నారు. ఎమ్మెల్సీ దళిత డ్రైవర్‌ను హతమార్చి డోర్‌ డెలీవరీ చేస్తే దళితులు ఎందుకు వైసీపీకి ఓటు వేయాలి అని సునీల్‌ను ప్రశ్నించారు. ఓటమి పొందే పార్టీలోకి మారడం సునీల్‌ నైజమన్నారు.

యువతకు ఉపాధి కల్పిస్తాం..

కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌

కాకినాడ జిల్లాలో ఉన్న వనరులను సద్వినియోగం చేసు కుని యువతకు ఉపాధి కల్పిస్తా. కాకినాడ పోర్టును అభివృద్ధి చేస్తా. ఏడీబీ రహదారిని గుంతలమయంగా మార్చేసిన ఘనత వైసీపీదే. ఫుడ్‌ పార్కును గాలికొది లేశారు. ఏఒక్క పరిశ్రమా రాలేదు. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తెచ్చి పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తా.

ఇళ్ల పట్టాల పేరుతో పేదలకు మోసం

కాకినాడ రూరల్‌ అభ్యర్థి పంతం నానాజీ

కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో వైసీపీ ప్రభుత్వంలో నకిలీ ఇళ్లపట్టాలిచ్చారు. స్వామినగర్‌లోఇళ్లపట్టాల పేరుతో పేదలను మోసగించారు. జయలక్ష్మి సహకార సొసైటీ స్కామ్‌లో వైసీపీ నాయకుల పాత్ర ఉంది. రూరల్‌లోని గ్రామాల్లో వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెడతాం. కాకినాడ బీచ్‌ను సుందరంగా చేస్తాం.

రాష్ట్రం కోసం ఆలోచించే కూటమి

పెద్దాపురం టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప

జగన్‌ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైంది. ఇది గుర్తించి కూటమిగా ఏర్పడాలని భావించిన వ్యక్తి పవన్‌. అంద రినీ ఒప్పించి కూటమి ఏర్పాటు చేశారు. 2019లో నేను విజయం సాధించినా నన్ను పనిచేయనివ్వకుండా వైసీ పీ నాయకులు అడ్డుకున్నారు.వైసీపీ ప్రభుత్వ హయాం లో నియోజకవర్గానికి ఒక్క రూపాయి ఇవ్వకుండా మోసాలు చేసి సంపద దోచుకున్నారు.

Updated Date - Apr 28 , 2024 | 12:56 AM