Share News

పారితోషికంలో వ్యత్యాసాలు సవరించాలి

ABN , Publish Date - May 16 , 2024 | 01:40 AM

జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు జిల్లా అధికారులు, ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వహిచడంతో ప్రశాంతంగా జరిగాయని ఏపీఎన్‌జీవో సంఘం రాజమహేంద్రవరం బ్రాంచ్‌ తెలిపింది.

పారితోషికంలో వ్యత్యాసాలు సవరించాలి

  • ఏపీఎన్‌జీవో సంఘం

రాజమహేంద్రవరం సిటీ, మే 15: జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు జిల్లా అధికారులు, ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వహిచడంతో ప్రశాంతంగా జరిగాయని ఏపీఎన్‌జీవో సంఘం రాజమహేంద్రవరం బ్రాంచ్‌ తెలిపింది. ఈసందర్భంగా జిల్లా ఎన్నికల అధికారిణి డాక్టర్‌ కె.మాధవీలత దృష్టికి ఏపీఎన్‌జీవో సంఘం అభినందనలు తెలిపింది. ప్రధానంగా జిల్లాలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి చెల్లించిన పారితోషికం చాలా తక్కువ మొత్తం చెల్లించారని సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేశారని కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. కాకినాడ జిల్లాలో దిగువస్థాయి సిబ్బందికి 1050 రూపాయలు, ఎగువస్థాయిలో రెండువేల యాభై రూపాయలు చెల్లించారని అదే తూర్పుగోదావరిలో మాత్రం అన్యాయంగా క్రింది స్థాయిలో ఏడువందల యాభై, ఎగువస్థాయిలో రూ.1400 చొప్పున చెల్లించారని తక్షణమే సిబ్బంది అందరికీ ఒకే విధంగా పారితోషికం చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా నన్నయ్య యూనివర్శిటీ రిసెప్షన్‌లో కనీస సౌకర్యాలు లేవన్నారు. రిసెప్షన్‌ సెంటర్‌కు ఆలస్యంగా చేరుకున్న సిబ్బందికి భోజనాలు లేవన్నారు. అక్కడ మహిళా ఉద్యోగులకు కనీసం టాయిలెట్స్‌ ఫెసిలిటీ కల్పించాలేదని, ఉద్యోగులు ఇళ్లకు చేరడానికి తగిన ట్రాన్స్‌పోర్టు లేక తీవ్ర ఇబ్బంది పడ్డారని తెలిపారు. కలెక్టరేట్‌లో పరిపాలన అధికారి రామారావుకు ఏపీఎన్‌జీవో సంఘం బ్రాంచ్‌ అధ్యక్షుడు వైవీఎస్‌ నాయుడు, రాష్ట్ర జేఏసీ కార్యదర్శి వేణుమాధవ్‌, బ్రాంచ్‌ ఉపాధ్యక్షుడు మీసాల మాధవరావు, రాష్ట్ర కౌన్సిలర్‌ సత్యమూర్తి తదితరులు కలిసి వినతిపత్రం అందించారు.

Updated Date - May 16 , 2024 | 07:54 AM