పేపరుమిల్లు కార్మికుల.. ఆవేతన!
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:24 AM
రాజమహేంద్రవరంలో ఏపీ పేపరుమిల్లు కార్మికుల వేతన ఒప్పందం చిలికి చిలికిగాలి వాన మాదిరిగా మారింది. ప్రస్తుతం పేపరుమిల్లు కోట్లాది రూపాయల లాభాల్లో ఉన్నా యాజమాన్యం మాత్రం కార్మికుల వేతన ఒప్పందం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుం ది.
రూ.10,500 పెంచాలని డిమాండ్
రూ.3,500లకే కంపెనీ ఆమోదం
ఒప్పుకోని కార్మికులు
ఎటూ తేల్చని యాజమాన్యం
కూటమి నాయకుల చర్చలు
ఇప్పటికే రెండు సార్లు సమావేశం
అయినా మారని తీరు
కార్మికుల సమ్మె యోచన
సీఎం చంద్రబాబు దృష్టికి సమస్య
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 26( ఆంధ్రజ్యోతి) : రాజమహేంద్రవరంలో ఏపీ పేపరుమిల్లు కార్మికుల వేతన ఒప్పందం చిలికి చిలికిగాలి వాన మాదిరిగా మారింది. ప్రస్తుతం పేపరుమిల్లు కోట్లాది రూపాయల లాభాల్లో ఉన్నా యాజమాన్యం మాత్రం కార్మికుల వేతన ఒప్పందం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుం ది. 2019లో జరిగిన వేతన ఒప్పందంలో మిల్లు యాజమాన్యం పర్మినెంట్ కార్మికుడికి రూ.9 వేలు పెంచే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ అగ్రిమెంట్ 2020 జూన్ 1తో ముగిసింది. అప్పటి నుంచి 31వ తేదీ డిసెంబరు 2023 వరకు వేతన ఒప్పందం జరగాల్సి ఉండగా దానిని యాజమాన్యం నిర్లక్ష్యం చేసింది. వేతన ఒప్పందం గడువు దాటి ఏడాది పూర్తయినా కార్మికులు డిమాండ్‌ను నిర్లక్ష్యం చేస్తూ యాజమాన్యం మొండివైఖరి అవలంభిస్తోంది.
2,728 మంది కార్మికులు
రాజమహేంద్రవరంలోని ఆంధ్రప్రదేశ్ పేపరుమిల్లులో 728 మంది పర్మినెంట్ కార్మికులు, సుమారు 2 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. 1972 నుంచి 2019 వరకు 14 వేతన ఒప్పందాలు జరిగాయి. కార్మికుల కష్టంతో ఫ్యాక్టరీ 1300 కోట్ల రూపాయల లాభాల్లో ఉన్నా యాజమాన్యం కార్మికుల డిమాండ్‌ను పట్టించు కోవడంలేదు.కార్మికుల డిమాండ్ ఆమోదిస్తే వేతనాల ద్వారా రూ.36 కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. దీంతో మిల్లు లాభాల బాటలో ఉంటే కార్మికులు కష్టాల బాటలో ఉన్నారు.
యజమానుల దోబూచులాట
ఆంధ్రప్రదేశ్ పేపరుమిల్లు నూతన వేతన ఒప్పందంపై 14 కార్మిక సంఘాలు ఉద్యమిస్తున్నాయి. మిల్లు యాజమాన్య వైఖరికి నిరసనగా సమ్మెకు దిగాయి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు, యాజమాన్య ప్రతినిధుల మధ్య చర్చల నేప థ్యంలో సమ్మెను విరమించి విధులకు హాజరవు తున్నారు.ఇదిలా ఉండగా మంత్రి దుర్గేష్ నాలు గు నెలల కిందట కార్మికులు, అధికారులు, మిల్లు యాజమాన్య ప్రతినిధులు, కార్మికశాఖ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు.14 కార్మిక సంఘాల ప్రతినిధులు మిల్లు కార్మికులకు రూ.10,500 వరకూ పెంచాలని డిమాండ్ చేశా యి.ఈ సమావేశానికి హాజరైన మిల్లు ఈడీ ముఖేష్ జైన్ కార్మికులకు రూ.3250 పెంచుతామని చెప్పారు. అప్పుడు దీనిపై చర్చ జరగ్గా తదుపరి సమావేశానికి ఒక కొలిక్కి రావాలని నిర్ణయించారు.ఈ నెల 24న కలెక్టరేట్‌లో మంత్రి దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి,బత్తుల బలరామకృష్ణ ,అసిస్టెంట్ లేబర్ కమిషనర్ల సమక్షంలో మిల్లు కార్మిక సంఘాలు, యాజమాన్య ప్రతినిధులతో రెండో సారి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఈడీ ముఖేష్ జైన్ పాల్గొనలేదు.ఆయన తరపున హాజరైన ప్రతిని ధులు రూ.3500 పెంచుతామని ప్రకటించారు. దీనిని కార్మిక సంఘాలు వ్యతిరేకించాయి. మిల్లు యాజమాన్యం 2019లో చేసి అగ్రిమెంట్‌ను నూతనంగా చేసే వేతన ఒప్పందానికి కలుపుకుని కార్మికుడికి రూ.12,500 వరకు పెంచినట్టుగా ఉంటుందనే లెక్కలను కట్టారు.కార్మిక సం ఘాలు, మంత్రి, ప్రజాప్రతినిధులు వాటిని వ్యతిరేకించాయి. కార్మిక సంఘాలు రూ.10,500 పెం చాలని డిమాండ్ చేశాయి.మిల్లు యాజమాన్యం మాత్రం వేతన ఒప్పందంలో కార్మికులు..పాలకులతో దోబూచులాడుతుంది.ఈ సమస్య ఇప్పుడు సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. అతి త్వరలో సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది.
యాజమాన్యం మొండివైఖరి వీడాలి
కార్మికుల కష్టంతో లాభాల బాటలో ఉన్న పేపరుమిల్లు యాజమాన్యం అదే కార్మికులు వేతన ఒప్పందంలో మొడి వైఖరితో ఉండడం చాలా దుర్మార్గం.కార్మికులు ఏడాదిగా వేతన ఒప్పందం కోసం వేచి చూస్తున్నారు. సమ్మెలోకి వెళ్లినా పట్టించుకోకపోడం దారుణం. కార్మికుల డిమాండ్ మేరకు వేతన ఒప్పం దం లేకపోతే ఉద్యమం తప్పదు.
- అరుణ్, సీఐటీయూ, రాజమహేంద్రవరం
రూ.10,200లకు ఓకే..
ఆంధ్రప్రదేశ్ పేపరుమిల్లు యాజమాన్యం కా ర్మికుల వేతన ఒప్పందంపై కాలయాపన చేయడాన్ని ఖండిస్తున్నాం.గత సమావేశంలో ఈడీ ముఖేష్ జైన్ రూ.3250 పెంచుతామన్నారు. ఈ నెల 24న సమావేశంలో కేవలం రూ.250 మాత్రమే పెంచి రూ.3500 ఇస్తామనడం సరికాదు. కార్మికులు దానికి ఒప్పుకోరు. కార్మికులు రూ.10,200 ఇస్తే అంగీకరిస్తారు. - ఎ.జగన్నాథరావు, మిల్లు కార్మిక నేత