Share News

పేపరుమిల్లు కార్మికుల నిరసన

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:31 AM

ఏడాదికి రూ.200 కోట్లు నికర లాభాల్లో ఉన్న ఏపీ పేపరుమిల్లు యాజమాన్యం అందులో పనిచేసే 2500 మంది కార్మికుల వేతన ఒప్పందాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు అన్నారు.

పేపరుమిల్లు కార్మికుల నిరసన
పేపరుమిల్లు ఎదుట కార్మికులు, వామపక్ష సంఘాల నాయకుల ధర్నా

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 5: ఏడాదికి రూ.200 కోట్లు నికర లాభాల్లో ఉన్న ఏపీ పేపరుమిల్లు యాజమాన్యం అందులో పనిచేసే 2500 మంది కార్మికుల వేతన ఒప్పందాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు అన్నారు. రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. పేపరుమిల్లులో 11 యూనియన్లు ఉన్నాయన్నారు. 2017 నుంచి కార్మికులకు వేతన ఒప్పందం చేయకుండా యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందన్నారు. కార్మికులు యాజమాన్యానికి ఫిబ్రవరి 24న సమ్మె నోటీసులు ఇచ్చి నా పట్టించుకోకపోవడంతో ఈ నెల 2 నుంచిసమ్మెలోకి దిగారని చెప్పా రు. మిల్లు లోపలే కార్మికులు సమ్మెలో కూర్చున్నారని చెప్పారు. దీనిపై కనీసం అధికార ప్రతిపక్షపార్టీలు స్పందించకపోవడం దారుణమన్నారు. రాజకీయ పార్టీలకు 2500 మంది మిల్లు కార్మికుల ఓట్లు అవసరంలేదా అని ప్రశ్నించారు. కార్మికులకు న్యాయం చేయకపోతే 10 వేల మంది కార్మికులతో రాజమహేంద్రవరంలో నిరసన ర్యాలీ, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు తాటిపాక ముఽధు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు టి.అరుణ్‌, ఐఎన్‌టీయూసీ నాయకులు ముళ్ళ మాధవ్‌, ఐఎఫ్‌టీయూ నాయకులు కే.జోజి , సీఐటీయూ నాయకులు ఎస్‌ఎస్‌.మూర్తి ,బి.రాజులోవ పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 12:31 AM