అర్చకుల సమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:03 AM
అర్చకుల సంక్షేమంతో పాటు సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఏపీ బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షుడు సత్యవాడ దుర్గాప్రసాద్ తెలిపారు. ఆదివారం తాళ్లపూడి శివాలయంలో వైకానసం, స్మార్తం, శైవం, పాంచరాత్రం, తంత్రసార, గ్రామ దేవత, ఆగమాల 8 మండలాల అర్చకుల సమస్యలపై నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

ఏపీ బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షుడు దుర్గాప్రసాద్
తాళ్లపూడి, జూలై 7: అర్చకుల సంక్షేమంతో పాటు సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఏపీ బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షుడు సత్యవాడ దుర్గాప్రసాద్ తెలిపారు. ఆదివారం తాళ్లపూడి శివాలయంలో వైకానసం, స్మార్తం, శైవం, పాంచరాత్రం, తంత్రసార, గ్రామ దేవత, ఆగమాల 8 మండలాల అర్చకుల సమస్యలపై నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యలు, వేతనాలు పెంపు తదితర అంశాలపై చర్చించారు. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ అర్చకుల సంక్షేమానికి రాష్ట్ర నాయకులతో కలిసి ముఖ్యమంత్రికి వినతిపత్రం అందిస్తానన్నారు. అనంతరం బ్రాహ్మణ సంఘ మండల నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింలది. అధ్యక్షుడిగా కూచిభొట్ల ప్రసాద్, కార్యదర్శిగా చేబోలు రమేష్, కోశాధికారిగా కల్లూరి వీరరాఘవ శర్మ, ఉపాధ్యక్షుడిగా గుంటూరు బీవీ సత్యనారాయణ, సహాయ కార్యదర్శులుగా గోవర్ధనం మదనగోపాలాచార్యులు, ఎల్.సత్యనారాయణలను ఎన్నుకున్నట్టు గౌరవాధ్యక్షుడు మేడూరి గంగాధరశర్మ తెలిపారు. పెద్దింటి రంగబాబు, జంధ్యాల గంగాధరశర్మ తదితరులు పాల్గొన్నారు.