Share News

పంపా రిజర్వాయర్‌ గేట్ల పనితీరుపై ఆందోళన

ABN , Publish Date - Jun 08 , 2024 | 12:57 AM

మెట్టప్రాంత రైతుల వరప్రధాయిని అయిన పంపా రిజర్వాయిర్‌ గేట్ల పనితీరుపై ఆందోళన వ్యక్తం అవుతుంది. గత ప్రభుత్వ హయాంలో మరమ్మతులకు నిధులు విడుదల చేయకపోవడంతో తాత్కాలిక పనులు చేపట్టి గట్టెక్కించారు.

పంపా రిజర్వాయర్‌ గేట్ల పనితీరుపై ఆందోళన

పరిశీలించిన ఇరిగేషన్‌ ఇంజనీరింగ్‌ అధికారులు

అన్నవరం, జూన్‌ 7: మెట్టప్రాంత రైతుల వరప్రధాయిని అయిన పంపా రిజర్వాయిర్‌ గేట్ల పనితీరుపై ఆందోళన వ్యక్తం అవుతుంది. గత ప్రభుత్వ హయాంలో మరమ్మతులకు నిధులు విడుదల చేయకపోవడంతో తాత్కాలిక పనులు చేపట్టి గట్టెక్కించారు. వర్షాకాలం ప్రారంభం కానుండడంతో గేట్ల పరిస్థితిపై శుక్రవారం ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ సతీష్‌కుమార్‌, సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ శ్రీనివాసరావు, ఈఈ శేషగిరి తదితరులు పరిశీలించారు. ప్రధానంగా నాల్గవ నంబరు వరదగేటు గతంలో ఇబ్బంది పెట్టడంతో గేట్ల ఆపరేటింగ్‌ చేయించి పరిశీలించారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో నీరు లేకపోవడంతో సులువుగా పైకి కిందకు దిగినా రిజర్వాయర్‌ నిండితే గేట్లు పైకి లెగడం, కిందకు దిగడం వంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయని సిబ్బంది సూచించారు. రెండ్రోజుల్లో మరోసారి పరిశీలించి అత్యవసరంగా ఉన్న పనులకు నిధులు మంజూరు చేయించి అనంతరం శాశ్వత పనులు చేపడతామని ఈఎన్‌సీ సతీష్‌కుమార్‌ తెలిపారు. ఇటీవల మరమ్మతులు చేపట్టిన పంటకాలువ గేట్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఇరిగేషన్‌ అధికారిణి శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

కుమార్‌ అగర్వాల్‌ని పీడీ

Updated Date - Jun 08 , 2024 | 12:58 AM