Share News

పామాయిల్‌ రైతులకు ఊరట

ABN , Publish Date - Nov 08 , 2024 | 01:30 AM

వైసీపీ ప్రభుత్వంలో నష్టాలు ఎదుర్కొన్న పామాయిల్‌ రైతులకు ఊరట లభించింది. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలోనే టన్నుకు రూ.12,500 నుంచి ఏకంగా రూ.19,000కి ధర పెరగడంతో రైతుల్లో ఆనందం కనిపిస్తోంది.

పామాయిల్‌  రైతులకు ఊరట

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలో రూ.5 వేల వరకు పెరిగిన ధర

మరికొంత పెరిగే చాన్స్‌

గండేపల్లి,నవంబరు7(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో నష్టాలు ఎదుర్కొన్న పామాయిల్‌ రైతులకు ఊరట లభించింది. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలోనే టన్నుకు రూ.12,500 నుంచి ఏకంగా రూ.19,000కి ధర పెరగడంతో రైతుల్లో ఆనందం కనిపిస్తోంది. గత వైసీపీ పాలనలో ఒకసారి అత్యధిక ధర పలకడంతో భారీ మొత్తంలో కౌలుకు తీసుకున్నారు. తర్వాత పతనమైన ధరతో నష్టాల ఊబిలో కూరుకుపోయారు. ఇప్పుడు మళ్లీ మంచిరోజులు వచ్చాయి. వైసీపీ ఐదు సంవత్సరాల కాలంలో ధర హెచ్చు తగ్గుల వల్ల నిలకడలేని ధరలతో రైతులను అయోమయస్థితిలోకి తోసింది. ఒక్కసారి మా త్రం టన్ను రూ.23 వేల అత్యధిక ధర పెరగడంతో అప్పట్లో కౌలు రైతులు ఇదే ధర నిలబడుతుందని ఎకరానికి రూ.లక్ష ముందుగానే అడ్వాన్సులు ఇచ్చి కౌలుకు తీసుకున్నారు. తర్వాత ఆ ధర దఫదఫాలుగా దిగజారి రూ. 12 వేలకు రావడంతో అప్పట్లో కౌలు రైతులు తేరుకోలేని రీతిలో ఊబిలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంచలంచెలుగా ధర పెరగడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ధర మరింత పెరిగే అవకాశముండడంతో రైతులకు గిట్టుబాటు అందు తుందనే ధీమాను వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో ఎక్కడాలేని విధంగా గండేపల్లి మండలంలో సుమారు 12,500 ఎకరాల్లో ఈ ఆయిల్‌ఫామ్‌ను రైతులు సాగు చేస్తున్నారు. సాగుకు ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎరువులు, డ్రిప్‌లైన్‌ మొక్కలు, రాయితీలన్నీ వేగవంతంగా రైతులకు అందేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందని పలువు రు రైతులు అంటున్నారు. ఇక కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కా లంలో రూ.12,500 నుంచి రూ.19,000కి పెరిగిం ది. త్వరలో పామాయిల్‌ ధర మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు అంచనా వేస్తున్నారు.

పెరిగిన ధరతో ఊరట

కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పెరిగిన ధర తో ఊరట కలిగింది. ధర ఇంకా పెరుగుతుందంటున్నారు. రైతుకు గిట్టుబాటు ధరే లభిస్తోంది. వైసీపీ పాలనలో ఒకసారి అధిక ధర చూసి ఎంతో ఆశతో అధిక రేటుకు పొలం కౌలుకు తీసుకుని అప్పులపాలయ్యా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందనే ధీమా వచ్చింది.

- పిల్లా సత్తిబాబు, రైతు, మల్లేపల్లి

రూ.18 వేలు ఉంటేనే..

ప్రస్తుతం ఉన్న పెట్టుబడులకు టన్ను రూ.18 వేలు పలకకపోతే రైతుకు గిట్టదు. అయితే రూ. 19,000 ధర పలకడం సంతోషం. గత పాలనలో రూ.12 వేల ధర పలికింది. అప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ధరలో నిలక డలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే రైతులను ఆదుకున్నారు.

- గురజాల వెంకన్నదొర, మురారి

‘ఆయిల్‌పామ్‌ సాగును విస్తరించాలి’

పెద్దాపురం, నంబరు 7(ఆంధ్రజ్యోతి): ఆయిల్‌ పామ్‌ సాగును విస్తరించాలని జిల్లా ఉద్యాన శాఖాధికారి ఎన్‌.మల్లిఖార్జునరావు అన్నారు. స్థా నిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఆయిల్‌పా మ్‌ విస్తీరణాభివృద్ధి పథకంలో భాగంగా పెద్దా పురం, జగ్గంపేట ఉద్యానశాఖ సిబ్బందితో నిర్వ హించిన సమావేశంలో ఆయన పాల్గొని గురు వారం మాట్లాడారు. గ్రామాల వారీగా ఆయిల్‌ పామ్‌ సాగుచేసే వారి వివరాలను ఈనెల 10 తేదీ నాటికి అందజేయాలన్నారు. ప్రస్తుతం ఆయి ల్‌ పామ్‌ టన్ను గెలల రేటు రూ.19 వేలకు పెరి గిందన్నారు. రైతులు ఈ విషయాన్ని గుర్తించి ఆయిల్‌పామ్‌ సాగుపై దృష్టిసారించాలన్నారు. వాతావరణ పంటల బీమా ఆధారిత పథకంలో భాగంగా జిల్లాలో జీడిమామిడిని ఎంపిక చేయ డం జరిగిందన్నారు. జీడిమామిడి తోటలు ఉన్న రైతులు రూ.1500 చెల్లించి పంటల బీమాను పొందవచ్చన్నారు. హెచ్‌వోలు ఎన్‌.సుజాత, లావణ్య, వీహెచ్‌ఏలు, వీఏఏలు పాల్గొన్నారు.

Updated Date - Nov 08 , 2024 | 01:30 AM