Share News

ధాన్యం సేకరణకు ముందుస్తు ప్రణాళికలు

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:39 AM

ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం సేకరణకు ముందుస్త ప్రణాళికలు సిద్ధం చేయాలని తహశీల్దార్‌ పీఎన్‌డీ ప్రసాద్‌ సూచించారు. గురువారం స్థానిక వెలుగు కార్యాలయంలో ధాన్యం సేకరణపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.

ధాన్యం సేకరణకు ముందుస్తు ప్రణాళికలు
ఉండ్రాజవరంలో నిర్వహిస్తున్న సదస్సు దృశ్యం

ఉండ్రాజవరం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం సేకరణకు ముందుస్త ప్రణాళికలు సిద్ధం చేయాలని తహశీల్దార్‌ పీఎన్‌డీ ప్రసాద్‌ సూచించారు. గురువారం స్థానిక వెలుగు కార్యాలయంలో ధాన్యం సేకరణపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ధాన్యం సేకరణలో రైతులకు, రైస్‌ మిల్లర్లకు సిబ్బంది వారధిలా పనిచేయాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వారికి ఎప్పటికప్పుడు సమాచారం సిబ్బంది అందజేయాలన్నారు. వ్యవసాయాధికారి ఎమ్‌.విశ్వాసరావు మాట్లాడుతూ గోనె సంచులు, బరకాలు వంటి వాటితోపాటు వర్షాలు పడితే జట్టుకూలీలను అదనంగా నియమించుకోవాలని చెప్పారు. నవంబరు 1 తేదీ నుంచి ధాన్యం సేకరణ మండలంలో ప్రారంభమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీ వో వీఎస్‌ రామారావు, సీఎస్‌ టీడీ సుధీర్‌రెడ్డి, వీఆర్వోలు, సొసైటీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 12:39 AM