Share News

ధాన్యం అమ్మకాల్లో ఇబ్బందులెదురైతే డయల్‌ 1967

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:50 AM

ధాన్యం విక్రయించడంలో ఇబ్బం దులు తలెత్తితే టోల్‌ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదుచేయాలని, ఆర్‌బీకేల్లో ధాన్యం విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత అన్నా రు.

ధాన్యం అమ్మకాల్లో ఇబ్బందులెదురైతే డయల్‌ 1967
కొవ్వూరు మండలం కాపవరం ఆర్‌బీకేలో తేమశాతం కొలిచే యంత్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ మాధవీలత

కొవ్వూరు, ఏప్రిల్‌ 2 : ధాన్యం విక్రయించడంలో ఇబ్బం దులు తలెత్తితే టోల్‌ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదుచేయాలని, ఆర్‌బీకేల్లో ధాన్యం విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత అన్నా రు. కొవ్వూరు మండలం కాపవరం ఆర్‌బీకేలో 2023-24 రబీ సీజన్‌కు సంబంధించి జిల్లాలో మొట్టమొదటిగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్‌ కె. మాధవీలత, జేసీ ఎన్‌.తేజ్‌భరత్‌ ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి 229 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దన్నారు. 2023 - 24 రబీకి సంబం ధించి ధాన్యం మద్దతు ధర 75 కేజీలకు రూ.1637లు, క్వింటాకు ధర రూ.2183లు పొందవచ్చునన్నారు. గోనె సం చులు జిల్లాలోని అన్ని ఆర్‌బీకేల్లో అందుబాటులో ఉంచా మన్నారు. ధాన్యం విక్రయించడంలో ఎటువంటి ఇబ్బం దు లెదురైనా కొవ్వూరు, రాజమహేంద్రవరం ఆర్డీవో కార్యాలయాలు,జాయింట్‌ కలెక్టర్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూ మ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఇబ్బందులు ఎదురైతే టోల్‌ ఫ్రీ నెంబరు 1967, జిల్లా కంట్రోల్‌ రూమ్‌ నెంబరు 8309487151కు ఫిర్యాదు చేయాలన్నారు. రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తామన్నారు. జేసీ ఎన్‌. తేజ్‌భరత్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రథమంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో ప్రారంభించామన్నారు. రబీకి సంబంధించి మంగళవారం 6 మండలాల్లో, ఏప్రిల్‌ 5వ తేదీన 6 మండలాల్లో, మిగిలిన మండలాల్లో 9వ తేదీన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమలో కొవ్వూరు సబ్‌ కలెక్టర్‌ ఆశుతోష్‌ శ్రీవాస్తవ, సివిల్‌ సప్లయిస్‌ డీఎం టి.రాధిక, డీఎస్‌వో పి.విజయభాస్కర్‌, జిల్లా సహకార అధికారి ఆర్‌. శ్రీరాముల నాయుడు, డివిజనల్‌ సహకార అధికారి వి.కృష్ణకాంత్‌, డివిజనల్‌ వ్యవసాయాధికారి పి.చంద్రశేఖర్‌, తహశీల్దార్‌ కె.మస్తాన్‌, ఏవో ఎ.గంగధర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 12:50 AM