Share News

‘ఓటమి భయంతో ద్వారంపూడి దొంగ ఓట్లు’

ABN , Publish Date - Feb 17 , 2024 | 01:14 AM

వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకతతో ఓటమి భయం పట్టుకుని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి భారీగా దొంగ ఓట్లు చేర్పించాడని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు.

‘ఓటమి భయంతో ద్వారంపూడి దొంగ ఓట్లు’

కాకినాడ సిటీ, ఫిబ్రవరి 16 : వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకతతో ఓటమి భయం పట్టుకుని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి భారీగా దొంగ ఓట్లు చేర్పించాడని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. ఇందుకు సంబంధించి శుక్రవారం జిల్లా కలెక్టర్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌లకు ఆధారాలతో కూడిన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కొండ బాబు మాట్లాడుతూ సిటీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు చేర్చి ఎమ్మెల్యేకు అను కూలంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. దొంగ ఓట్లు చేర్పులు, టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగింపుపై గత ఆరు నెలలుగా జిల్లా అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. నగరంలో జీరో డోర్‌ నంబర్‌తో ఓట్లు నమోదు చేయడమేకాకుండా, ఒకే కుటుంబంలోని ఓట్లను వేర్వేరు పోలింగ్‌ కేంద్రాలకు జంబ్లింగ్‌ చేశారన్నారు. దీనివల్ల అసలైన ఓటర్‌ తన ఓటు వేయడానికి ఏ పోలింగ్‌ కేంద్రానికి వెళ్లాలో తెలి యని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలోఓ అధికారి దగ్గరుండి బీఎల్‌వో లాగిన్‌ ద్వారా ఇటువంటి చర్యలకు పాల్పడడం జరిగిందని ఆరోపించారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, గదుల సాయిబాబు, తుమ్మల రమేష్‌, వొమ్మి బాలాజీ, గుమ్మళ్ల చిన్న పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 01:14 AM