గుర్తింపు పొందిన ఓపెన్ డిగ్రీలు ఓటుహక్కుకు అర్హమైనవే
ABN , Publish Date - Oct 28 , 2024 | 12:29 AM
జీవోలకు అనుగుణంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓట్లు నమోదు చేసే విధంగా జిల్లాలోని తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలని ఆదివారం కలెక్టర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఓపెన్ డిగ్రీ చేసిన వారి ఓటు దరఖాస్తులు కొందరు తహసీల్దార్లు తిరస్కరిస్తున్న నేపథ్యంలో ఆంధ్రజ్యోతిలో ‘మాకు ఓటు హక్కు లేదా’ శీర్షికన ప్రచురితమైన వార్తా కథనానికి కలెక్టర్ కార్యాలయం స్పష్టత ఇచ్చింది.
ముమ్మిడివరం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): జీవోలకు అనుగుణంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓట్లు నమోదు చేసే విధంగా జిల్లాలోని తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలని ఆదివారం కలెక్టర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఓపెన్ డిగ్రీ చేసిన వారి ఓటు దరఖాస్తులు కొందరు తహసీల్దార్లు తిరస్కరిస్తున్న నేపథ్యంలో ఆంధ్రజ్యోతిలో ‘మాకు ఓటు హక్కు లేదా’ శీర్షికన ప్రచురితమైన వార్తా కథనానికి కలెక్టర్ కార్యాలయం స్పష్టత ఇచ్చింది. గుర్తింపు పొందిన అన్ని యూనివర్సిటీలు జారీ చేసిన రెగ్యులర్ డిగ్రీలతో పాటు ఓపెన్ డిగ్రీలు కూడా ఓటు హక్కు నమోదుకు అర్హమైనవని పేర్కొంది. ఈ ఏడాది నవంబరు 1 నాటికి మూడేళ్లు ముందుగా పట్టభద్రులు అయి ఉండి, జీవో ఎంఎస్ నంబరు 536 జీఏడీ (ఎలక్షన్ ఎఫ్) 2006 సెప్టెంబరు 28 ప్రకారం గుర్తింపు పొందిన అన్ని విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ యూనివర్సిటీలు, జీవోఎంఎస్ నంబరు 22జీఏడీ (ఎలక్షన్ ఈ) 2011 జనవరి 17 ప్రకారం ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (న్యూఢిల్లీ) నుంచి డిగ్రీ పొందినవారు అర్హులని పేర్కొన్నారు. జీవోలకు అనుగుణంగా తహసీల్దార్లు, ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల జాబితాలో పట్టభద్రులకు ఓటు హక్కు కల్పించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.