తక్కువ ధరకే వంటనూనెలు అందించాలి
ABN , Publish Date - Oct 20 , 2024 | 01:32 AM
ఆయిల్ విక్రయించే వ్యాపారులంతా ప్రభుత్వం నిర్దేశించిన ఽతక్కువ దరలకే వినియోగదారులకు వంటనూనెలు అందజేయాలని జిల్లా జా యింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు ఆదేశించారు.
క్యూఆర్ కోడ్ ద్వారానే కార్డుదారులకు విక్రయించాలి : జేసీ చిన్నరాముడు ఆదేశం
రాజమహేంద్రవరం అర్బన్, అక్టోబరు19 (ఆంధ్రజ్యోతి): ఆయిల్ విక్రయించే వ్యాపారులంతా ప్రభుత్వం నిర్దేశించిన ఽతక్కువ దరలకే వినియోగదారులకు వంటనూనెలు అందజేయాలని జిల్లా జా యింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఆయిల్‌హోల్‌సేల్ వ్యాపారులు, రిటైల్ డీలర్లు, బిగ్‌చైన్ డీలర్లు, రైతు బజార్ల ఎస్టేట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రతి ఆయిల్ కౌంటర్ వద్ద పామాయిల్ ప్యాకెట్ రూ.110లకు, సన్‌ఫ్లవర్ ప్యాకెట్ రూ.124లకు విక్రయించాలని, ఆ మేరకు ధరల పట్టిక ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఆయిల్ విక్రయించే వారంతా జిల్లా పౌరసరఫరాల అధికారి లాగిన్‌లో సంబంధిత ఆయిల్ కౌంటర్ పేరున తప్పనిసరిగా క్యూఆర్ కోడ్ పొందాలని, ఆ క్యూఆర్ కోడ్ ద్వారానే కార్డుదారులకు విక్రయించాలని అన్నారు. అన్ని హోల్‌సేల్ మార్కెట్లు, రీటైల్ మార్కెట్ దుకాణాల్లో ప్రతి రైస్‌కార్డుదారుకు కార్డుపై నెలకు మూడు పామాయిల్ ప్యాకెట్లు లేదా ఒక ప్యాకెట్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ ప్రభుత్వ ధరలకే అమ్మాలని తెలిపారు. రైతు బజార్లలో నిర్వహించే ఆయిల్ కౌంటర్ల నిర్వాహకులకు ఎస్‌వీజీ మార్కెట్‌లోని ఆయిల్ హోల్‌సేల్ ట్రేడర్స్ ఆయిల్ సరఫరా చేయాలని సూచించారు. ధరల నియంత్రణలో భాగంగా లీగల్ మెట్రాలజీశాఖ, సివిల్ సప్లయిస్‌శాఖ, జీఎస్‌టీ, మార్కెటింగ్‌శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఆదేశించారు. రోజువారీ అమ్మకాల రిజిస్టర్లు, రికార్డులు, బిల్లులను తనిఖీ అధికారులు కోరిన వెంటనే చూపాలని చెప్పారు.