చిరస్మరణీయుడు ఎన్టీఆర్
ABN , Publish Date - Jan 19 , 2024 | 12:48 AM
అటు సినిమా రంగంలోను, ఇటు రాజకీయ రంగంలోను తనదైన శైలిలో విశేష సేవలందించి రాష్ట్ర ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్‌టీఆర్ అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కేఎస్ జవహర్, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మద్దిపాటి వెంకట్రాజు అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 28వ వర్థంతిని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పలుచోట్ల గురువారం నిర్వహించారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు కేఎస్ జవహర్
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడి వర్థంతి
మాజీ ముఖ్యమంత్రికి నివాళి.. పలుచోట్ల సేవా కార్యక్రమాలు
గోపాలపురం, జనవరి 18: అటు సినిమా రంగంలోను, ఇటు రాజకీయ రంగంలోను తనదైన శైలిలో విశేష సేవలందించి రాష్ట్ర ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్‌టీఆర్ అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కేఎస్ జవహర్, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మద్దిపాటి వెంకట్రాజు అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 28వ వర్థంతిని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పలుచోట్ల గురువారం నిర్వహించారు. గోపాలపురం పాతబస్టాండ్‌లో ఉన్న ఎన్‌టీఆర్ విగ్రహానికి టీడీపీ మండలాధ్యక్షుడు రొంగలి సత్యనారాయణ ఆధ్వర్యంలో జవహర్, నల్లమిల్లి, మద్దిపాటి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు వారి ఖ్యాతిని దేశవ్యాప్తంగా విస్తరింపజేసిన మహోన్నతుడు ఎన్‌టీఆర్ అని అన్నారు. కార్యక్రమంలో జ్యేష్ట శ్రీధర్, రాము, కూనపం ప్రసాద్‌బాబు, మద్దిపాటి రమేష్, జ్యేష్ట శ్రీను, పడమట శ్రీను, బాలిన రాము, కొడవటి గంగరాజు, ఉండవల్లి దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. అలాగే ఎన్‌టీఆర్ వర్థంతి సందర్భంగా రఘునాయక, ఎల్‌ఎస్‌సీఎస్ మాజీ డైరెక్టర్ యడ్రప్రగడ మంగారావు.. సాగిపాడు లెప్రసీ కాలనీలో రొట్టెలు, పండ్లు, ఇతర పానియాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల ఉపాధ్యక్షుడు బండారు గనిరాజు, ముప్పిడి అనీల్‌కుమార్, పిల్లి కృష్ణ, వెల్లంకి జయశివసూర్యం, షేక్ మస్తాన్, చాపల శేఖర్ పాల్గొన్నారు.