Share News

తొలిరోజే నామినేషన్లకు క్యూ

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:43 AM

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ గురువారం విడు దలైంది. గురువారం దశమి కావడంతో పెద్ద ఎత్తున నామి నేషన్లు దాఖలయ్యాయి.తూర్పుగోదావరి జిల్లాలో తొలిరోజు ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. లోక్‌సభకు ఎవరూ వేయలేదు. రాజమహేంద్రవరం సిటీ నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆదిరెడ్డి ఒక సెట్‌ నామినేషన్లు దాఖలు చేయగా ఆయన సతీమణి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ స్వతంత్ర అభ్యర్థిగా మరో నామినేషన్‌ దాఖలు చేశారు.

తొలిరోజే నామినేషన్లకు క్యూ

  • కాకినాడలో 5 నామినేషన్లు దాఖలు

  • తూర్పుగోదావరి జిల్లాలో 6

  • అంబేడ్కర్‌ కోనసీమలో 7

రాజమహేంద్రవరం/అమలాపురం, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి)/కలెక్టరేట్‌(కాకినాడ): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ గురువారం విడు దలైంది. గురువారం దశమి కావడంతో పెద్ద ఎత్తున నామి నేషన్లు దాఖలయ్యాయి.తూర్పుగోదావరి జిల్లాలో తొలిరోజు ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. లోక్‌సభకు ఎవరూ వేయలేదు. రాజమహేంద్రవరం సిటీ నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆదిరెడ్డి ఒక సెట్‌ నామినేషన్లు దాఖలు చేయగా ఆయన సతీమణి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ స్వతంత్ర అభ్యర్థిగా మరో నామినేషన్‌ దాఖలు చేశారు. గోపాల పురం టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకట్రాజు రెండుసెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కొవ్వూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా తలారి వెంకట్రావు ఒక సెట్‌, తలారి పరంజ్యోతి మరో సెట్‌ దాఖలు చేశారు. నిడదవోలునుంచి వైసీపీ అభ్యర్థిగా గెడ్డం శ్రీనివాసనాయుడు ఒక సెట్‌ నామినేషన్లు దాఖలు చేశారు. ఇక జిల్లాలోని అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం రూరల్‌ నుంచి బోణీ కాలేదు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. అమలాపురం ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. మిగిలిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏడుగురు అభ్యర్థులు పది సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలో తొలిరోజే ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. గుత్తుల జైశ్రీసూరేంద్రనాథ్‌బాబూజీ స్వతంత్ర అభ్యర్థిగా రెండు సెట్లు, పిల్లి సూర్యప్రకాష్‌ వైసీపీ తరుపున రెండు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ వైసీపీ తరుపున ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. అమలాపురం అసెంబ్లీ స్థానానికి చీకురుమెల్లి కిరణ్‌కుమార్‌ జనసేన పేరు రాసి ఒక సెట్‌, స్వతంత్య్ర అభ్యర్థిగా మరో సెట్‌ నామినేషన్లు దాఖలు చేశారు. మండపేట నియోజకవర్గం నుంచి కోన సూర్యప్రకాశరావు, మార్ని సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థులుగా రెండు సెట్లు, నందికోళ్ల రాజు నవతరం పార్టీ తరుపున ఒక సెట్‌ నామినేషన్లు దాఖలు చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు. ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం, కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గాలనుంచి ఇంకా అభ్యర్థులెవరూ నామినేషన్లు వేయలేదు.కాకినాడలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేశారు.కాకినాడ లోక్‌సభకు సంబం ధించి జిల్లా కలెక్టర్‌ నివాస్‌ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఆర్వో కార్యాలయంలో నామినేషన్‌ స్వీకరించారు. తొలిరోజు కాకినాడ లోక్‌సభకు ఒక్క నామినేషన్‌ దాఖలైంది. ఇండి పెండెంట్‌ అభ్యర్థిగా మెర్ల భవాని శంకర్‌ ప్రసాద్‌ రెండు సెట్ల నామినేషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీ నియోజక వర్గాలు ఏడు ఉండగా రెండు నియోజకవర్గాల్లో నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి.దీనిలో కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇండిపెండెంట్లుగా టేకుమూడి శ్రీనివాస రావు, వినుకొండ వెంకటేశ్వరరావు, మట్టా వెంకటేశ్వరరావు నామినేషన్లు వేశారు. ఒక్కొక్క సెట్‌ చొప్పున ఆర్వోకు నామి నేషన్‌ అందజేశారు.కాకినాడ రూరల్‌ అసెంబ్లీ నియోజక వర్గంనుంచి డాక్టర్‌ పితాని అన్నవరం ఇండిపెండెంట్‌గా ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో నామినేషన్‌ నిల్‌గా దర్శనమిచ్చింది.

Updated Date - Apr 19 , 2024 | 12:43 AM