Share News

నేటితో నామినేషన్ల్లు ముగింపు

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:05 AM

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టంలో ఆరో రోజైన బుధవారం ఉమ్మడి తూర్పుగోదావరి (నిడదవోలు, గోపాలపురం, కొవ్వూరులతో కలిపి) జిల్లాలో మొత్తం 145 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో లోక్‌సభకు 24, అసెంబ్లీకి 121 ఉన్నాయి.

నేటితో నామినేషన్ల్లు ముగింపు
ఎన్నికల పరిశీలకుడికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న కలెక్టర్‌

తూర్పుగోదావరి జిల్లాలో లోక్‌సభకు 11, అసెంబ్లీకి 40

భారీగా క్యూకట్టిన స్వతంత్ర అభ్యర్థులు..

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టంలో ఆరో రోజైన బుధవారం ఉమ్మడి తూర్పుగోదావరి (నిడదవోలు, గోపాలపురం, కొవ్వూరులతో కలిపి) జిల్లాలో మొత్తం 145 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో లోక్‌సభకు 24, అసెంబ్లీకి 121 ఉన్నాయి.

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం లోక్‌సభకు 11, ఏడు అసెంబ్లీలకు 40 నామినేషన్లు దాఖలైనట్టు జిల్లా ఎన్నికల అఽధికారి కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. రాజమహేంద్రవరం లోక్‌ సభ స్థానానికి నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ తర పున సుంకవల్లి మురళీధరన్‌, వైసీపీ అభ్యర్థి గూ డూరి శ్రీనివాసరావు తరపున గూడూరి రాధిక, బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి తరపున బొమ్ముల దత్తు, ఇండియన్‌ కాంగ్రెస్‌ పార్టీ తర పున గిడుగు రుద్రరాజు, బీజేపీ అభ్యర్థి పురందే శ్వరి తరపున రేలంగి రాణిశ్రీదేవి, జైభా రత్‌ నేష నల్‌ పార్టీ తరపున సింగులూరి మోహన్‌ రావు, స్వతంత్ర అభ్యర్థులుగా సాలోపంతుల రాఘవేంద్ర రావు, బొమ్మనబోయిన వెంకట శ్రీరామ మూర్తి నామినేషన్లు దాఖలు చేశారు. అనపర్లి అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్ధిగా సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఆయన సతీమణి ఆదిలక్ష్మి, బీఎస్పీ తరపున కొల్లం శ్రీను, ఇండియన్‌ కాంగ్రెస్‌ తరపున ఎల్లా శ్రీనివాసరావు నామినేషన్లు దాఖలు చేశారు. రాజా నగరం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి నవరంగ్‌ పార్టీ తరపున బత్తుల బలరామకృష్ణ (పల్నాడు జిల్లా), రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ అభ్యర్థిగా కొత్తపల్లి భాస్కరరామం, జాతీయ జనపార్టీ తరపున బ త్తుల బలరామకృష్ణ (కాకినాడ జిల్లా), స్వతంత్ర అభ్యర్థిగా బత్తుల వెంకటలక్ష్మి నామినేషన్లు దాఖ లు చేశారు. రాజమహేంద్రవరం సిటీ స్థానానికి జనవాహిని పార్టీ తరపున వేమన గణేష్‌, బీఎస్పీ అభ్యర్థిగా పరమట సురేఖ, లిబరేషన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా వంగూరి విజయసత్య, స్వతంత్ర అభ్య ర్థిగా బేతాళ వేంకటేశ్వరరావు నామినేషన్లు దాఖలు చేశారు. రాజమండ్రి రూరల్‌ అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా చెల్లుబోయిన శ్రీనివాస వేణుగో పాలకృష్ణ, చెల్లుబోయిన నరేన్‌, పిరమిడ్‌ పార్టీ ఇండియా తరపున వాసంతి చంద్రరావు, జై భీమ్‌ రావు పార్టీ తరపున గునిపే కిరణ్‌కుమార్‌, భారత చైతన్య యువజన పార్టీ తరపున దుగ్గిరాల శ్రీదేవి, చల్లంగి నాగేశ్వరరావు నామినేషన్లు దాఖలుచే శారు. కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండియన్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా అరిగెల అరు ణకుమారి తరపున గెడ్డం సాయుయిబాబు, లిబరే షన్‌ కాంగ్రెస్‌ తరపున బొంతా శ్యామ్‌రవిప్రకాష్‌, వైసీపీ తరపున తలారి వెంకట్రావు, టీడీపీ అభ్య ర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు తరపున మద్దుల వీర వెంకట సత్యనారాయణ, స్వతంత్ర అభ్యర్థిగా తాతపూడి సుజయ్‌ ప్రవీణ్‌కుమార్‌ నామినేషన్లు సమర్పించారు. నిడదవోలు అసెంబ్లీ నుంచి వైసీపీ తరపున జి.శ్రీనివాసనాయుడు, ఇండియన్‌ కాం గ్రెస్‌ తరపున పెద్దిరెడ్డి సుబ్బారావు, జైభారత్‌ నేషనల్‌ పార్టీ తరపున పులమాల వీరభద్రం, జనసేన తరపున కృష్ణతేజ, స్వతంత్ర అభ్యర్థులుగా అరిగెల సత్య వరప్రసాద్‌, కృష్ణతేజ నామినేషన్లు దాఖలు చేశారు. గోపాలపురం నుంచి వైసీపీ అభ్య ర్థిగా తానేటి వనిత తరపున ఒక సెట్‌ నామినేషన్‌ వేశారు. జైభారత్‌ పార్టీ అభ్యర్థిగా ములగాల శ్రీనివాసరావు, జాతీయ జనసేన పార్టీ తరపున పెనుమాక వెంకటరత్నం, స్వతంత్ర అభ్యర్థులుగా రాపాక హరికృష్ణ, ముక్కవల్లి వెంకటరమణ, గెడ్డం ఆనందబాబు, దారాబత్తుల వీరేంద్ర విజయ్‌కు మార్‌ నామినేషన్లు దాఖలు చేశారు. పలువురు అభ్యర్థులు ర్యాలీగా తరలివచ్చారు. కాగా గురువారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనున్నది.

ఎన్నికల పరిశీలకులను కలిసిన కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌

ధవళేశ్వరం, ఏప్రిల్‌ 24 : జిల్లాకు వచ్చిన సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకులు కె.బాలసుబ్రహ్మణ్యం, కమల్‌కాంత్‌ సరోచ్‌లను బుధవారం సాయంత్రం ధవళేశ్వరం ఇరిగేషన్‌ అతిథి గృహంలో కలెక్టర్‌ మాధవీలత, జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజభరత్‌ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.తమిళనాడుకు చెందిన కె.బాలసుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి, రాజానగరం, రాజమండ్రి అర్బన్‌, రాజమ హేంద్రవరం రూరల్‌ నియోజకవర్గ సాధారణ పరిశీలకులుగా, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన కమల్‌కాంత్‌ సరోచ్‌ కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గసాధారణ పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. కలెక్టర్‌ జిల్లాలో ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల పరిశీలన,ఈవీఎంల తరలింపు, పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ వంటి కార్యక్రమాలను వివరించారు.

పోలీస్‌ అబ్జర్వర్‌కి ఎస్పీ స్వాగతం

రాజమహేంద్రవ రం, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల పోలీస్‌ అబ్జర్వర్‌ బలరామ్‌ మీనాకు ఎస్పీ జగదీశ్‌ పుష్ప గుచ్ఛం అందజేసి స్వాగతం పలి కారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలోని పోలీసు విధుల పరిశీలనకు గుజరాత్‌కు చెందిన మీనా నియమితుల య్యారు.ఈ మేరకు బుధవారం రాజమహేంద్రవరం చేరుకున్నారు.

Updated Date - Apr 25 , 2024 | 01:05 AM