Share News

ఫ్యాన్‌ కింద లెగండి!?

ABN , Publish Date - Jun 09 , 2024 | 12:50 AM

అధికారం మారింది.. నిన్నటి వరకూ వైసీపీ రాజ్యం.. నేడు కూటమి రాజ్యం.. ఎవరు అధికా రంలో ఉంటే ఆయా పార్టీ నేతలకు నామినేటెడ్‌ పదవులు కట్టబెడతారు.. అధికారం మారిందా నామినేటెడ్‌ పదవులూ గోవిందా.. ప్రస్తుతం కూట మి అధికారంలోకి రావడంతో నామినేటెడ్‌ పదవు లను రద్దు చేస్తూ జీవో విడుదలైంది.

ఫ్యాన్‌ కింద లెగండి!?

సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ఉత్తర్వులు

రాజీనామాల బాట పడుతున్న వైసీపీ నాయకులు

దేవాలయ కమిటీలు..సొసైటీలు..కార్పొరేషన్లు అన్నీ రద్దు

రాజీనామాలు సమర్పించిన చందన, రాజీవ్‌కృష్ణ?

అదే బాటలో రౌతు, షర్మిళారెడ్డి..మరికొందరు

(రాజమహేంద్రవరం- ఆంఽధ్రజ్యోతి)

అధికారం మారింది.. నిన్నటి వరకూ వైసీపీ రాజ్యం.. నేడు కూటమి రాజ్యం.. ఎవరు అధికా రంలో ఉంటే ఆయా పార్టీ నేతలకు నామినేటెడ్‌ పదవులు కట్టబెడతారు.. అధికారం మారిందా నామినేటెడ్‌ పదవులూ గోవిందా.. ప్రస్తుతం కూట మి అధికారంలోకి రావడంతో నామినేటెడ్‌ పదవు లను రద్దు చేస్తూ జీవో విడుదలైంది.ఈ నేప థ్యం లో వైసీపీ నేతలు నామినేటెడ్‌ పదవులకు రాజీ నామాలు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం వేచిచూస్తున్నారు. అవకాశం ఉంటే గోడ దూకేయ వచ్చనే దిశగా ప్రయత్నాలు ఆరంభించారు. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది.

నామినేటెడ్‌ పదవులన్నీ రద్దు..

జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో నామినేటెడ్‌ పదవుల్లో ఉన్న నేతలకు పొమ్మనకుండా ‘పొగ’బెట్టే పనిలో కూటమి నేతలు ఉన్నారు. గత కొన్నేళ్లుగా మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, ఆయా నియోజకవర్గాల పరిధిలోని దేవస్థానాలు, సత్రాల చైర్మన్లు, వివిధ కమిటీల్లో కీలక పదవుల్లో ఉన్న నేతలకు సహాయ నిరాకరణ కొనసాగించాల్సిందిగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మౌఖిక ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా నామినేటెడ్‌ పదవుల్లో ఉన్నవారికి అధికారులు సహకారమందించే పరిస్థితులు లేవు. ఈ నెల 12వ తేదీన చంద్రబాబునాయుడు కూటమి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధికారికంగా పాలకపక్షాలన్నింటినీ రద్దుచేసే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని కార్పొరేషన్లు, ఇతర సంస్థలకు సంబంధించి నామినేటెడ్‌ చైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యుల రాజీనామాలను తీసుకోవాలని వెంటనే వాటిని ఆమోదించాలని అన్ని శాఖల కార్యదర్శులకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కొందరు ఆవేశ పూరితంగా ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, దేవస్థానాల పాలకమండళ్ల హయాంలో జరిగిన అక్రమాలపై కూడా విచారణలు జరపాలని ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు పెంచుతున్నారు.

రాజీనామాల బాటలో నేతలు..

వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో నియమించిన చైర్మన్‌ పదవులకు, సభ్యులకు త్వరలోనే ప్రభుత్వం మంగళం పాడనుంది. జిల్లాలో ప్రధాన పదవులు రెండు ఉన్నాయి. జిల్లాలో వందల సంఖ్యలో నామినేటెడ్‌ పదవు లున్నాయి.పలు కార్పొరేషన్‌ చైర్మన్‌, డైరెక్టర్ల పద వులు.. రాష్ట్ర బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, ఏపీ హౌసింగ్‌ చైర్మన్‌, రుడా చైర్మన్‌ తదితర పదవులు ఉన్నాయి. రాష్ట్ర బ్యూటిఫికేషన్‌ కార్పొ రేషన్‌ చైర్మన్‌గా ఉన్న ప్రముఖ వస్త్ర వ్యాపారి చందన నాగేశ్వర్‌ శనివారం రాజీనామా చేశారు. ఆయన ఎప్పటి నుంచో రాజీనామా చేయాలని చూస్తున్న సంగతి తెలిసిందే. మొదట రూరల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తామని చెప్పి ఆయన చేత రూ.కోట్లు ఖర్చు పెట్టించారు. చివ రకు ఆయనను పక్కన పెట్టి మంత్రి వేణుకు టికెట్‌ ఇవ్వడంతో ఆయన చాలా రోజుల నుంచి మౌనంగా ఉంటున్నారు.మొదట ఆయనకు స్మార్ట్‌సిటీ చైర్మన్‌ పదవి కూడా ఇచ్చారు. కానీ అసలు ఇక్కడ స్మార్ట్‌ సిటీ లేకుండా ఆయనకు పదవి ఇవ్వడం పట్ల పెదవి విరిచారు. తర్వాత దానిని వదిలేశారు. గ్రీన్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ చైర్మన్‌ పదవి ఇచ్చినా ఒరిగిందేమీ లేదు. దీంతో ఎన్నికల ముందు నుంచి ఈ పదవి పట్ల ఆయన అయిష్టంగానే ఉన్నారు.ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఆయన ఈ పదవికి రాజీనామా చేశారు. మరో ముఖ్యమైన పదవి రాజమండ్రి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (రుడా) చైర్మన్‌ పదవి. ప్రస్తుతం రుడా చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్‌నేత, ప్రముఖ వ్యాపారి రౌతు సూర్యప్రకాశరావు వ్యవహరిస్తున్న సంగతి తెలి సిందే. ఆయన కూడా రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకున్నారు. సోమవారం స్వయంగా రుడా అధి కారులను కలిసి రాజీనామా సమర్పించనున్నారు. ప్రభుత్వ సలహాదారుగా కొవ్వూరుకు చెందిన ప్రముఖడు రాజీవ్‌కృష్ణ వ్యవహరించారు. ఆయన కూడా ముందుగానే రాజీనామా సమర్పించినట్టు సమాచారం. రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా షర్మిళారెడ్డి ఉన్నారు. ఆమె రాజీనామా చేయ వలసి ఉంది. జిల్లాలో దేవస్థాన కమిటీలు చాలా ఉన్నాయి. వారు రాజీనామా బాటలో ఉన్నారు. ప్రధానంగా నిడదవోలు కోట సత్తెమ్మ ఆలయం ఉంది. ఈ ఆలయానికి వంశపారంపర్య ఽధర్మకర్త చైర్మన్‌గా కొనసాగుతారు.అయితే 8 మంది ధర్మ కర్తల మండలి సభ్యులను మాత్రం ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారినే నియమిస్తారు. ప్రస్తు తం ప్రభుత్వం మారడంతో ఆ ధర్మకర్తల మండలి సభ్యుల పదవీకాలం ముగిసినట్టే. ఇక జిల్లాలో దేవాలయాల్లో ఉన్న చైర్మన్‌లు, ధర్మకర్తల మం డలి సభ్యుల పదవులన్నీ రద్దయినట్టే. మార్కెట్‌ కమిటీల పదవీకాలం ముగిసింది. జీవకారుణ్య సంఘం చైర్మన్‌ పదవికి బర్రె కొండబాబు రాజీ నామా చేశారు. ఇంకా కొందరు చేయవలసి ఉంది. వివిధ బీసీ సంఘాల కార్పొరేషన్‌ చైర్మన్లు ఉన్నారు. వారు కూడా రాజీ నామా చేయవలసి ఉంది. వీరంతా రాజీనామా చేసిన తర్వాత ఈ పదవుల్లో కూటమి నేతలను భర్తీ చేస్తారు. జిల్లాలో రుడా చైర్మన్‌ పదవి చాలా కీలకమైనది. దీనిపై ఇప్పటికీ చాలా మంది దృష్టి పెట్టారు.

సీతానగరంలో పలువురు రాజీనామా

సీతానగరం, జూన్‌ 8 : రాష్ట్ర దాసరి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పదవికి సీతానగరం గ్రామానికి చెందిన పెదపాటి రమేష్‌బాబు (డాక్టరుబాబు) రాజీనామా చేశారు. సీతానగరం వ్యవసాయ సహకార సంఘంలోని త్రిసభ్య కమిటీలోని చైర్మన్‌ మట్ట వీరభోగ వసంతరావు, సభ్యులు మట్ట సుబ్బారావు, సిరికి వెంకట రమణ, రాపాక వ్యవసాయ పరపతి సం ఘంలో చైర్మన్‌ పిచ్చుకల రవికుమార్‌, ముత్యాల సత్తిబాబు, మాగంటి హరిబాబు, చినకొండేపూడి సహకార సంఘం కమిటీ చైర్మన్‌ పోలినాటి రామచంద్రరావు, సభ్యులు సూర్యనారాయణ రాజు, వెంకటేశ్వరరావు, రామచంద్రపురం వ్యవసాయ పరపతి సంఘం కమిటీ చైర్మన్‌ కొండిపాటి కోటేశ్వరరావు, సభ్యులు చింతలపూడి ముత్యాలరావు, దోని లక్ష్మికాంతం తమ పదవులకు రాజీనామా చేశారు.మొత్తం మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇప్పటివరకు ఆయా పదవులపై మక్కువ పెంచుకున్న టీడీపీ, జనసేన నేతలు ఫలానా మార్కెట్‌కమిటీ నాదని, ఫలానా దేవస్థానం చైర్మన్‌ నాకేనని ప్రచారాలు చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా జిల్లాలోని రెండో కేటగిరీకి చెందిన దేవస్థానాలకు గత ప్రభుత్వం ట్రస్టు బోర్డులను నియమించింది. ఎన్నికల ఫలితాల అనంతరం వారంతా ఆయా పదవులకు రాజీనామాలు చేస్తారని అంతా భావించారు. అయితే ఇంత వరకు ఎవరూ రాజీనామాలు ప్రకటించలేదు.త్వరలో వీరి పదవులు కూడా తొలగించి కొత్తవారికి అప్పగించే అవకాశం ఉంది.వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు వైసీపీ ప్రభుత్వం ఎన్నికల నిర్వహించకుండా తాత్సారంచేస్తూ త్రిమెన్‌ కమిటీలతోనే పాలన కొనసాగించింది. ప్రస్తుతం వారిని కూడా తొలగించే అవకాశం ఉంది. ఈ మేరకు ఇప్పటికే త్రిమెన్‌ కమిటీలపై ఒత్తిడి పెరిగింది.

Updated Date - Jun 09 , 2024 | 12:50 AM