Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

ఎంపీగారూ.. ఏం చేశారని?

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:16 AM

ఓ ప్రజాప్రతినిధి అవగాహనాలేమి, ఆర్భాటాల ఆరాటానికి చారిత్రాత్మక రాజమహేంద్రవరం నవ్వులపా లవుతోంది.. అధికారుల డూడూ బసవన్నల తీరు, పని తనంపై జనం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఎంపీగారూ.. ఏం చేశారని?
ఇదా అభివృద్ధి : డ్రైనేజీలు మూసివేయడంతో ఆర్ట్స్‌ కళాశాల గేటు ఎదుట నుంచి రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీరు

అభివృద్ధి అంటే ఇదేనా!?

ఏడు నియోజకవర్గాల మాటేంటి

అభివృద్ధి పేరుతో నగరం అతలాకుతలం

డ్రైన్లను పూర్తిగా మూసేసిన వైనం

రోడ్లపైకి వస్తున్న మురుగునీరు

పనుల్లో నాణ్యత కరువు

తిప్పలు పడుతున్న జనం

మిగతా నియోజకవర్గాలకు మొండిచేయి

మళ్లీ దేనికి సిద్ధమని ప్రజల ప్రశ్న

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

ఓ ప్రజాప్రతినిధి అవగాహనాలేమి, ఆర్భాటాల ఆరాటానికి చారిత్రాత్మక రాజమహేంద్రవరం నవ్వులపా లవుతోంది.. అధికారుల డూడూ బసవన్నల తీరు, పని తనంపై జనం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ నిధుల మాటే లేకుండా కార్పొరేషన్‌ నిధులతో పనికాని చ్చేస్తున్నారు. నాణ్యతకు తిలోదకాలు ఇచ్చేసి ‘షో’కులకు నిధులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. కమీషన్ల కక్కుర్తికి అభివృద్ధి అనే పేరు తగిలించి ఎన్నికల వేళ చేస్తున్న అతలాకుతలానికి ఇక్కట్లు పడుతున్నారు.

7 నియోజకవర్గాలకు ఏం చేశారు..

జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడా ఎంపీ భరత్‌రామ్‌ ప్రజలకు అవసరమైన పనులను పట్టించు కోలేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో నియోజకవర్గాల్లోని రోడ్లు, డ్రైన్లు, వీధిలైట్లు వంటి మౌలిక సదుపాయాలు అస్తవ్య స్తంగా మారాయి. శివార్ల పరిస్థితి మరీ దయనీ యంగా ఉంది. జిల్లా కేంద్రమైన రాజమహేంద్ర వరం లోని కార్పొరేషన్‌ పరిధికి ఆనుకొని ఉన్న పంచాయతీ ల్లోని ఆవాసాలకు ఇప్పటికీ గోదావరి నీళ్లందడం లేదు. డ్రైన్లు లేవు. చెత్త పన్ను వసూలు చేస్తున్నా చెత్తను తీసుకెళ్లడానికి వాహనాలు రావు. ఆనంద్‌నగర్‌ వంటి ప్రాంతాల్లో దోమలు,ఈగలు,పందులతో రోజూ పోరాటమే. కొవ్వూరు,నిడదవోలు, అనపర్తి, రాజానగరం, రాజమ హేంద్రవరం రూరల్‌, గోపాలపురంలో ప్రజల సమస్యల ను తీర్చే పనులు ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నిస్తు న్నాయి. ఈ ఐదేళ్లలో ఏడు నియోజకవర్గాలకు ఒరిగిందే మిటని జనాలు ప్రశ్నిస్తున్నారు. మళ్లీ తమరు దేనికి ‘సిద్ధం’ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. గత ఎన్నికల హామీలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని సూచిస్తున్నా రు. ఎందుకంటే రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియో జకవర్గానికి ఎంపీ ఐదేళ్లుగా చేసిందేమీలేదు.

సమస్యలు గాలికొదిలేసి...

నగరాభివృద్ధికి వందల కోట్లు తెచ్చాం.. సుందరంగా చేశాం అంటూ ప్రతిరోజూ గాలిమా టలతో ఊదరగొడు తుంటారు. ఆ ప్రగల్భాలను నగరంలో రోడ్డుపై పొంగిపొ ర్లుతున్న డ్రైన్లు, బిళ్లల అతికింపులో మరిచిన ఇంగితం, శివార్లలో పందులు, మురుగు కంపు వెక్కిరిస్తున్నాయి. జిల్లా కేంద్రాన్ని రూ.400 కోట్లతో(ఈ మాట అధికారులతో చెప్పించాలని మాత్రం అడగొద్దు సుమా! వాళ్ల నోటి వెంట రూ.70 కోట్లకు మించి రాకపోవచ్చు) అభివృద్ధి చేశామని సదరు ప్రజాప్రతినిధి పదేపదే అదేపనిగా చెబుతున్నారు. నగరాన్ని, పట్టణాలను పట్టిపీడిస్తున్న శాశ్వత సమస్యలకు..శివార్ల అభివృద్ధిని మాత్రం పక్కన పెట్టేశారు. మూణ్ణాళ్ల ముచ్చటలో భాగంగా బాగున్న ఫుట్‌పాత్‌ రెయిలింగ్‌లను పీకేసి బిళ్లలు అతికించడం, లైట్లు ఉన్న చోట మళ్లీ లైట్లు వేయడం, కప్పుసాసర్లు నిర్మించడం, తూరలకు రంగులు వేసి రోడ్ల పక్కన పెట్టడం,బాలికల వసతి గృహాల నడుమ హోటళ్లు పెట్టిం చడం, విద్యాలయ వాతావరణాన్ని కలుషితం చేయడం వంటి మెగా ప్రాజెక్టులు చేపట్టారు. దీంతో యావ పాలకులది..తిప్పలు జనాలవి అన్నట్లుగా పరిస్థితి దాపు రించింది.పైగా ఎన్నికల వేళ అభివృద్ధి పేరుతో సృష్టిస్తున్న విధ్వంసాన్ని చూస్తున్న జనం..ఇప్పటి వరకూ నిద్దరోయా రా అంటూ ఓ నిట్టూర్పు విడుస్తున్నారు. మళ్లీ ఓటేస్తే ఏం చేస్తారో! అని భయాందోళనకు గురవుతున్నారు.

నిధులేం తెచ్చారని..

జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఈ ఐదేళ్లలో ఎం పీగారు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఏం అభి వృద్ధి పనులు చేశారనే ప్రశ్న వేస్తే సమాధానం చెప్పడం ఆయనకూ కాస్త కష్టమే.ఎంపీగా కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చిన నిధుల ఊసు ఎప్పుడూ చెప్పరు. ఎంతసేపూ రాజమహేంద్రవరం మోరంపూడి ఫ్లైఓవర్‌ గురించి చెబుతూ.. ఫ్లెక్సీలను సైతం నింపేస్తున్నారు. వాస్తవానికి ఎంపీగా మురళీ మోహన్‌ ఉన్నప్పుడు ఇక్కడ ఫ్లైఓవర్‌ అవసరమని గుర్తించారు. దాంతో పాటు మరో నాలుగు ఫ్లైఓవర్లను కేంద్రం నుంచి మంజూరు చేయించారు. ఆయన హయాంలోనే శంకుస్థాపన కూడా చేశారు. తర్వాత ఎన్నికలు రావడం.. సాంకేతిక కారణా లతో ప్రాజెక్టు మొదలు కాలేదు.ఎంపీగా భరత్‌ రామ్‌ ఎన్నికైన నాలుగేళ్లకు ఆ ప్రాజెక్టు గుర్తుకొచ్చింది. భరత్‌ రామ్‌ హయాంలో మొదలు కావడంతో ‘అన్నం వార్చిన వాడే వండినట్లు’ అన్న చందంగా ఫ్లైఓవర్‌ని ఆయన ఖాతాలో వేసేసుకున్నారు. అది మినహా నగరానికి లేదా జిల్లాలోని మిగతా మునిసిపాలిటీలు,పంచాయతీలకు ఎంపీ స్థాయి లో చేసిన మేలు ఏమిటో ఫ్యాను గాలికే తెలియాలి. కనీసం ట్రాఫిక్‌ సమస్యలను తీర్చలేకపో యారు. ఎక్క డైనా అభివృద్ధి అంటే దానికి అనుగుణంగా రోడ్లు వెడల్పు చేస్తారు. కానీ వింతగా రాజమహేంద్ర వరంలో రోడ్లను కుచించేస్తున్నారు. దీంతో ఆయా కూడ ళ్లలో బస్సులు మలుపుతిరగడానికీ తిప్పలు పడాల్సి వస్తో ంది. రాజమహేంద్రవరం సిటీలోని ఈట్‌ స్ట్రీట్‌, హ్యాపీస్ట్రీట్‌ అంటూ నిధులు గోల్‌మాల్‌ చేశారనే ఆరోపణలున్నాయి.

ఇదీ..అభివృద్ధేనా..!

వై.జంక్షన్‌ నుంచి లాలాచెరువు వరకూ ఫుట్‌ పాత్‌లకు రెయిలింగ్‌ ఉండేది.దానిని తీసేసి ఫుట్‌ పాత్‌లపై బిళ్లలు అతికించే పని చేపట్టారు. అంతం కాదిది ఆరంభం అనే తీరుగా ఈ పనులు కొనసా గుతున్నాయి.అయితే ఈ పనుల్లో ఇంజనీరింగ్‌ అద్భు తాలను చూసి జనం విస్తుపోతున్నారు. డ్రైనుపైన ఆ చివర నుంచి ఈ చివర వరకూ పూర్తిగా మూసే శారు.పూడిక ఎప్పటికప్పుడు తొలగించ డానికి ఎక్కడా నాలుగు స్లాబు బిళ్లలు వేయలేదు. ఆర్ట్స్‌ కళాశాల వద్ద వ్యర్థాలు పేరుకుపోయి గత గురు వారం మురుగునీరు రోడ్డుపైకి వచ్చింది. పారిశుధ్య అధికారులు చేరుకున్నా.. ఎక్కడ తొలగించాలో (పగల గొట్టాలో) తోచక ఇంజనీరింగ్‌ అధికారులు వచ్చే వరకూ వేచి చూడాల్సి వచ్చింది. తర్వాత పారి శుధ్య కార్మికులు పీకల్లోతు మురుగు నీళ్లలో గంటల పాటు పూడిక క్లియర్‌ చేసే పనిచేయాల్సి వచ్చింది. ఇంజనీరింగ్‌,పారిశుధ్య అధికారులకు సమన్వయం కొరవడడం..అహాలకు పోవడంతో డ్రైన్లలో ఇలాంటి పరిస్థితి వస్తుందనే ఆరోపణలున్నాయి.

నిండు కుండకు కన్నం..

రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. కేంద్ర నుంచీ తీసుకొచ్చే సీన్‌ లేదు. జిల్లాలో రాజమ హేంద్రవరం ఒకటే మునిసిపల్‌ కార్పొరేషన్‌. మిగతావన్నీ మునిసి పాలిటీలు,పంచాయతీలు.వీటిలో పెద్దగా జనరల్‌ ఫండ్స్‌ (ప్రజలు చెల్లించే పన్నులు) ఉండవు. మిగులు నిధులూ అంతంత మాత్రమే.కానీ రాజమహేంద్రవరం కార్పొరేష న్‌లో జనరల్‌ ఫండ్స్‌ ఎప్పుడూ నిండు కుండలా ఉం టాయి. వీటిపై ఎంపీగారి కన్ను పడడంతో నిండు కుం డకు పెద్ద కన్నమే పడింది. మూణ్ణాళ్ల ముచ్చట పనులకు జనరల్‌ ఫండ్స్‌ ఎడాపెడా ఖర్చు చేసేస్తున్నారు. కోట్లాది రూ పాయలు జేబుల్లో పోసుకుంటున్నారు. కంబాల చెరువు పార్కు అభివృద్ధి అంటూ రూ.13 కోట్లు వెచ్చించారు. తీరాచూస్తే దోమలతో కుట్టించుకుంటూ దుర్వాస నను పీల్చడానికి టికెట్‌ పెట్టారు. పార్కుల అభివృద్ధి స్థానిక సంస్థల విధి. కానీ రాజమండ్రి విధి కమీషన్ల దారి పట్టడంతో కాసేపు సేదతీర దామనుకున్న ప్రజల నుంచి లక్షల రూపాయలు లాగేస్తున్నారు. చారి త్రక అనవాళ్లయిన సుబ్రహ్మణ్య మైదానాన్ని రూపురేఖలు లేకుండా చేసేశారు.రాజమహేంద్రవరంలోని వై.జంక్షన్‌ నుంచి లాలాచెరువు వరకూ గ్రాండ్‌ ట్రంక్‌ రోడ్‌ పేరుతో బిళ్లలు అతికించే బృహత్తర ప్రాజెక్టును చేపట్టారు. అప్ప టి వరకూ ఉన్న రెయిలింగ్‌ను పీకేసి బూడిదపై బిళ్లల అతికింపునకు సుమారు రూ.7 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం మూడేళ్ల నుంచీ సుదీర్ఘంగా కొన సాగుతూనే ఉంది. ఈ పనుల్లోనూ నాణ్యత లేదు. సెంటర్‌ డివైడర్‌లో పెద్ద పెద్ద లైట్లు ఉండగా ఫుట్‌పాత్‌ లపై మళ్లీ లైట్లు వేసి ఆర్భాటాన్ని చాటుకుం టున్నారు. రుడా ఏర్పాటు చేసిన మొక్కల కుండీల ఉద్దేశమేమిటే వాటికే బోధపడడం లేదు. వీటి అడ్డుతో చిరువ్యాపారులు రోడ్డుపైకి వచ్చారు. దీంతో రోడ్డుపై సంచరించే ప్రదేశం కుచించుకుపోయింది. దేవీచౌక్‌, పుష్కరాలరేవు కూడళ్లలో రాతి యుగాన్ని మళ్లీ కళ్లముందుకు తెచ్చారు. బాగున్న సర్ఫేస్‌ని తవ్వేసి రాళ్లు అతికించారు. అవి ఇప్పుడు గుంతలమయంగా మారాయి.వర్షం వస్తే నీళ్లు నిలిచిపో తున్నాయి. ఇలాంటి అనవసర పనులకు ఖర్చు చేసిన కోట్లాది రూపాయలతో రాజమహేంద్రవరంలోని డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికేదంటూ నగరవా సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసమర్ధతకు, నిబద్ధ తకు అదే తేడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 04 , 2024 | 12:16 AM