Share News

నిప్పులకొలిమి

ABN , Publish Date - May 31 , 2024 | 12:39 AM

పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాలతో పాటు పలు ప్రాంతాల్లో గురువారం ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయికి చేరాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

నిప్పులకొలిమి

సూర్యుడి భగభగలు...ప్రజలు విలవిల

వేడిగాలులతో ఉక్కిరిబిక్కిరి

నిర్మానుష్యమైన రహదారులు

జిల్లాలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు

పిఠాపురం, మే 30: పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాలతో పాటు పలు ప్రాంతాల్లో గురువారం ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయికి చేరాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ప్రారంభమైంది. మధ్యాహ్న సమయంలో వడగాడ్పులు, ఆ తర్వాత ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వృద్ధులు, చిన్నారులు పడిన అవస్థలు వర్ణణాతీతం. ఎండతీవ్రతకు పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాల్లోని ప్రధాన రహదారులతో పాటు వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు రోడ్డు మీదకు వచ్చేందుకు సాహసించలేదు. శరీరం మంటపుట్టినట్లు మారింది. రాత్రి వరకూ ఎండ వేడిమి తగ్గలేదు.

ప్రత్తిపాడు: ప్రత్తిపాడులో వాతావరణం నిప్పులగుండంగా మారింది. రోహిణికార్తె, వడగాడ్పులు ఉఽధృతంగా వీయడంతో ఉష్ణోగ్రతలు దారుణంగా పెరిగి మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేడి గాలు లు తగ్గక ఉక్కపోతలకు గురై అవస్థలు పడ్డారు. మరో 3రోజులపాటు ఎండ తీవ్రత కొనసాగే అవకాశాలు ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

మండుతున్న ఎండలు

జగ్గంపేట: రోహిణి కార్తె ఎండలు కారణంగా మెట్ట ప్రాంతప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9గంటల నుంచి ఎండ వేడిమితో పాటు ఉక్కపోత అధికంగా ఉండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. మధ్యాహ్నం 12అయ్యేసరికి నిత్య శ్రామికులు ఇళ్లకు చేరుకుని సేద తీరుతున్నారు. జాతీయ రహదారిపై రాకపోకలు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4గంటల వరకు రహదారులు నిర్మానుషంగా మారుతున్నాయి. జగ్గంపేట పట్టణంలో సామాన్యులు, మధ్య తరగతి వారు కూలర్లు, ఏసీలకు అంకితమయ్యారు. ఉక్కపోతకు ఇబ్బంది పడుతుంటే ఒక ప్రక్క విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో ఎండ వేడిమికి మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. తరుచూ విద్యుత్‌ కోతలు విధించడంతో ప్రజలు మరింత ఇబ్బందులకు గురవుతున్నారు.

ఉక్కపోతతో ప్రజల అవస్థలు

కిర్లంపూడి: రోహిణికార్తెలో రోళ్లు పగులుతాయనే నానుడి ఉంది. గురువారం మండల వ్యాప్తంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం నుంచి ఎం డతో ఉక్కపోతకు గురై వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు. వృద్ధులు, పిల్లలు ఆపసోపాలు పడ్డారు. మధ్యాహ్నం ప్రధాన రహదారుల్లో జనసంచారం లేక బోసిపోయాయి.

రోహిణీ తాపం

సామర్లకోట: రోహిణీ కార్తె ఎండలకు రోళ్లుకూడా బద్దలవుతాయని పెద్దలు ఇప్పటికీ అంటుంటారు. ఉదయం 8గంటల నుంచే భానుడు భగభగమంటు న్నాడు. వీటికి వేడిగాలులు తోడయ్యాయి. తుపాన్‌ కారణంగా ఐదు రోజులుగా వాతావరణం చల్లబడింది. దీంతో ప్రజలు ఊపీరి పీల్చుకున్నారు. రోహిణీ ప్రభావంతో ఒక్కసారిగా భానుడు వేసవి ప్రతాపాన్ని చూపించడంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సామ ర్లకోట మండలంలోని పలు గ్రామాలతోపాటు, సామర్లకోట పట్టణ ప్రాంతం బుధ వారం భానుడి ప్రతాపంతో తాళలేకపోయారు. ఒక్కసారిగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదు కావడంతో నిప్పుల కొలిమిలా సామర్లకోట అల్లాడింది. గ్రామాల్లో అప్రకటిత విద్యుత్‌ కోతలతో ప్రజలు అల్లాడారు. శీతలపానీయాల దుకా ణాలతో బాటూ, కొబ్బరిబొండాలు, బొప్పాయి, పుచ్చకాయల దుకాణాలు, జ్యూస్‌ సెంటర్లు కిటకిటలాడాయి. మరో మూడు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతల ప్రభావం తప్పదని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2024 | 12:39 AM