Share News

కత్తి కట్టి.. ఆరేళ్లు!

ABN , Publish Date - Oct 25 , 2024 | 01:06 AM

ఆ రోజు 2018, అక్టోబరు 25వతేదీ. విశాఖపట్నం విమానాశ్రయంలో నాటి ప్రతిపక్షనేత వైఎస్‌ జగ న్మోహనరెడ్డిపై కోడికత్తి దాడి జరిగింది.

కత్తి కట్టి.. ఆరేళ్లు!

ముమ్మిడివరం, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): ఆ రోజు 2018, అక్టోబరు 25వతేదీ. విశాఖపట్నం విమానాశ్రయంలో నాటి ప్రతిపక్షనేత వైఎస్‌ జగ న్మోహనరెడ్డిపై కోడికత్తి దాడి జరిగింది. జగన్‌ వీరాభిమాని అయిన ముమ్మిడివరం మండలం ఠానేలంక పెదపేటకు చెందిన జనిపల్లి శ్రీనివాస రావు విశాఖపట్నం విమానాశ్రయంలో చెఫ్‌గా పనిచేసేవాడు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న జగ న్‌ హైదరాబాద్‌ కోర్టుకు వెళ్లేందుకు విశాఖ విమా నాశ్రయంలో వీఐపీ లాంజ్‌లో కూర్చున్న సమ యంలో శ్రీనివాసరావు మీ అభిమానిని అం టూ ఆయన దగ్గరకు వెళ్లి మాటలు కలిపి కోడి కత్తితో దాడి చేయగా జగన్‌ వ్యక్తిగత భద్రత సిబ్బంది, సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు అప్రమత్తమై శ్రీనివాస రావును అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి సమయంలో జగన్‌కు ఎడమ భుజంపై చిన్న గా యమైంది. దీనిపై జగన్‌ అప్పుడు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చెయ్యలేదు. అక్కడ ప్రథమ చికిత్స చేయించుకుని హైదరా బాదులో మెరు గైన వైద్యం చేయించుకుంటానని వెళ్లిపోయారు. ఆ తర్వాత శ్రీనివాసరావు నా గొంతు కొయ్యబో యాడని జగన్‌ ఆరోపించగా జగన్‌పై హత్యాయ త్నం చేసిందని శ్రీనివాసరావు అని చేయించింది క్యాంటీన్‌ ఓనర్‌ హర్షవర్థన్‌ అని, హర్షవర్థన్‌ టీడీపీ నాయకుడేనంటూ వైసీపీ నేతలు ఆరోపణ లు చేయడం, ధర్నాలు చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై ఎయిర్‌పోర్టు పోలీ సులు కేసు నమోదుచేశారు. విశాఖపట్నం సిట్‌ (ప్రత్యేక దర్యాప్తు సంస్థ) దర్యాప్తు చేపట్టింది. ఆ తర్వాత ఎన్‌ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) కూడా మరో కేసు నమోదు చేసింది. కేసు విచారణ తర్వాత 2019, మే 25న శ్రీనివాసరావుకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. 2019, ఆగస్టు 13న ఎన్‌ఐఏ అధికారులు విచారణ కోసం శ్రీనివాసరా వు బెయిల్‌ రద్దు చేశారు. న్యాయం చేయాలని శ్రీనివాసరావు కుటుంబసభ్యులు అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్‌ ఎన్‌వీ రమణ కు ఒక లేఖ రాశారు. వాస్తవ పరిస్థితులు తెలప డానికి వీరు జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించా రు. 2022, సెప్టెంబరు 26న శ్రీనివాసరావు కు టుంబసభ్యులకు జగన్‌ను కలవడానికి అనుమతి ఇచ్చి తరువాత నిరాకరించారు. ఈ క్రమంలో 2023 నవంబరు 28న ఎన్‌ఐఏ కోడి కత్తి దాడిలో కుట్రకోణం లేదని హైకోర్టుకు నివేదించింది. శ్రీని వాసరావు తప్ప ఇతర వ్యక్తుల పాత్రకానీ, రాజకీ య పార్టీల ప్రమేయంకానీ లేదని ఎన్‌ఐఏ తేల్చి చెప్పింది. 2023, ఆగస్టు 1న ఈ కేసు విజయ వాడనుంచి విశాఖ ఎన్‌ఐఏ కోర్టుకు బదిలీ అ య్యింది. జను పల్లి శ్రీనివాసరావు తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు శ్రీనివాసరావు బెయిల్‌కు జగన్‌ కోర్టుకు హాజరై తన సాక్ష్యం చెప్పాలని డి మాండ్‌ చేస్తూ విజయవాడలో వారు నిరహారదీక్ష చేపట్టగా శ్రీనివాసరావు రాజమహేంద్రవరం సెం ట్రల్‌ జైల్లో నిరహారదీక్ష చేపట్టారు. వారి దీక్షను పోలీసులు భగ్నం చేసి బలవంతంగా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై దళిత సంఘాలు ఆందోళన చేపట్టారు. శ్రీనివాసరావు విషయంలో జైలు అధికారులు తీరు అనుమానాస్పదంగా ఉం దని విశాఖ దళిత సంఘం ఐక్యవేదిక ఆందోళన వ్యక్తం చేసింది. దళిత సంఘాలు, మైనార్టీ హక్కు ల సంక్షేమ సంఘం, సమత సైనికదళ్‌, న్యాయ వాది సలీం పోరాట ఫలితంగా 2024 ఫిబ్రవరి 9న శ్రీనివాసరావుకు కోర్టు కండిషన్‌ బెయిల్‌ మం జూరు చేసింది. ప్రతి ఆదివారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సంతకం పెట్టి వెళ్లాలనే నిబంధన విధించా రు. ఐదేళ్ల 14రోజులు శ్రీనివాసరావు కోర్టు శిక్ష విధించకుండానే జైలు జీవితం అనుభవించాడు. కేసు మాత్రం నేటికీ తేలలేదు.

జైల్లో ఉన్నత చదువులు

ఇక శ్రీనివాసరావు జైల్లో ఉండగా బీఏ డిగ్రీ, ఎంఏ సోషాయాలజీ పూర్తిచేశాడు. తనకు జరి గిన అన్యాయంపై సమాజంలో మంచి కోసం పోరాటం చేసేందుకు తాను సోషియాలజీ చది వినట్టు శ్రీనివాసరావు పేర్కొంటున్నాడు. వారం రోజుల్లో శ్రీనివాసరావు అతడి కుటుంబసభ్యులు ముఖ్యమంత్రిని కలిసి పరిస్థితిని వివరించేందుకు సమాయత్తం అవుతున్నట్టు సమాచారం. ఐదేళ్లు గా ఆర్థికంగా, సామాజికంగా తాము పడుతున్న ఇబ్బందిని వివరించనున్నారు. ప్రతి ఆదివారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సంతకం చేయడం ఎంతో ఇబ్బందిగా ఉందని, తనకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని సామాజిక న్యాయంపై శ్రీని వాసరావు ఒక పుస్తకం రాస్తున్నట్టు తెలిసింది.

Updated Date - Oct 25 , 2024 | 06:32 AM