Share News

వీఆర్‌కు నిడదవోలు సీఐ

ABN , Publish Date - Apr 09 , 2024 | 01:00 AM

సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లం ఘించడంతో ఒక సీఐ ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో వీఆర్‌లోకి వెళ్లారు.

వీఆర్‌కు నిడదవోలు సీఐ
నిడదవోలు సీఐ వెంకటేశ్వరరావు

ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించిన జనసేన కార్యకర్త

విచారించి వీఆర్‌కు పంపుతూ ఆదివారం ఆదేశాలు

నిడదవోలు, ఏప్రిల్‌ 8 : సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లం ఘించడంతో ఒక సీఐ ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో వీఆర్‌లోకి వెళ్లారు. నిడదవోలులో ఇటీవల ఓ వైసీపీ మహిళానేతకు సమీప బంధువైన ఓ యువకుడు తన మిత్రులతో కలిసి జనసేన పార్టీలో చేరారు. దీంతో వైసీపీ మహిళా నేత జనసేన పార్టీ కార్యకర్తలపై కక్ష కట్టి తనకు ఉన్న పరిచయంతో సీఐ కె.వెంకటేశ్వరరావు ద్వారా జనసేన పార్టీకి చెందిన కార్యకర్త జి.రాజేష్‌ను పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయానికి పిలిచి రెండు గంటల పాటు ఉంచి వైసీపీకి చెందిన వ్యక్తులెవరినైనా సభ్యత్వంగా తీసుకుంటే మర్యాదగా ఉండదని గట్టి వార్నింగ్‌ వంటి కౌన్సెలింగ్‌ ఇచ్చినట్టు రాజేష్‌ తెలిపారు. దీం తో జనసేన కార్యకర్తలు ఎన్నికల కమిషన్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసు ఉన్నతాఽధికారులు విచారించి సీఐ కె.వేంకటేశ్వరరావును వీఆర్‌కు పంపుతూ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. సీఐ ఆదివారం అందుబాటులో లేకపోవడంతో సోమవారం ఈ ఉత్తర్వులను సీఐకు అం దజేశారు.ఇదిలా ఉండగా నిడదవోలుకు కొవ్వూరు రూరల్‌ సీఐను ఇన్‌చార్జిగా నియమించారు. వైసీపీకి చెందిన ఆమె వ్యవహారం కారణంగానే సీఐ వెంకటేశ్వరావు వీఆర్‌కు బదిలీ అయ్యారని ఇప్పటికే ఆమె వల్ల పార్టీకి ఎంతో నష్టం జరిగిందని ఇలాంటి సంఘటనలు ఎన్నికల సమయంలో పార్టీకి మరింత నష్టం వాటిల్లుతుందంటూ సొంత పార్టీ నేతలే వాపోతున్నారు. నిడదవోలు సీఐ కార్యాలయంలో ఇద్దరు సీఐలు వీఆర్‌కు వెళ్లడం వెనుక ఆమె కారణమని సమాచారం.

ఆదేశాలు నిజమే : రామారావు, డీఎస్పీ

నిడదవోలు సీఐ వెంకటేశ్వరరావుపై జనసేన పార్టీ కార్యకర్తలు ఎ న్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ అనంతరం జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐ ను వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు.

సీఐ వేధించారు : రాజేష్‌, జనసేన

నిడదవోలు సీఐ పిలిపించి వైసీపీ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తిని నీ వెందుకు జనసేనలో జాయిన్‌ చేశావంటూ వేధించారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాను. విచారించి వీఆర్‌లోకి పంపారు.

Updated Date - Apr 09 , 2024 | 01:00 AM