Share News

నూతన.. సంద..డే!

ABN , Publish Date - Jan 01 , 2024 | 11:59 PM

ఉత్సాహం ఉరకలెత్తింది.. కొత్త ఏడాది ఆనందం తెచ్చింది.. ఉదయం నుంచీ సందడే.. సందడి..

నూతన.. సంద..డే!
హ్యాపీ న్యూ ఇయర్‌ : నూతన సంవత్సర వేడుకల్లో కలెక్టర్‌ మాధవీలత, ఎస్పీ జగదీశ్‌, జేసీ తేజ్‌భరత్‌, డీఆర్‌వో నరసింహులు, కమిషనర్‌ దినేష్‌కుమార్‌, ఆర్‌డీవో చైత్రవర్షిణి, ట్రైనీ జేసీలు తదితరులు

గుడ్‌ బై 2023.. వెల్‌కమ్‌ 2024

ఆనందంగా స్వాగతించిన జనం

నాయకుల ఇళ్ల వద్ద భారీ క్యూ

కలెక్టరేట్‌లో ప్రత్యేక వేడుక

కిటకిటలాడిన ఆలయాలు, చర్చిలు

ఈ ఏడాదే రాజకీయ కాక

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

ఉత్సాహం ఉరకలెత్తింది.. కొత్త ఏడాది ఆనందం తెచ్చింది.. ఉదయం నుంచీ సందడే.. సందడి.. నాయకుల ఇళ్ల వద్ద అభిమానులు క్యూకట్టారు.. కళాశాలలు.. పాఠశాలల్లో విద్యార్థులు లైన్‌ కట్టారు.. ఇళ్ల వద్ద మహిళలు ఆనందం పంచుకున్నారు.. ఎవరి నోటా విన్నా ఒకటే మాట.. హ్యాపీ న్యూ ఇయర్‌ అంటూ అందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటూనే ఉన్నారు.. కేక్‌లు కట్‌ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సోమ వారం త్లెలవారుజాము నుంచే సందడి చేశారు. కొత్త ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.. ఈ సందడిలో అందరి నోటా వినిపించిన మాట ఒక్కటే.. ఈ ఏడాది మారాలి.. మారాలంటే.. మార్పు మనతోనే ఆరంభం కావాలి.. ఎవరిని ఎన్నుకోవాలో.. ఎలా బతకాలో.. ఎలా గెలవాలో నిర్ణయించుకోవాల్సిందే మీరే.. అందునా ఈ ఏడాది మరీ ప్రత్యేకం.. ఎందుకంటే ఎన్నికల సంవత్సరం.. మన భవిష్యత్‌ మన చేతుల్లోనే ఉంది..

కొత్త ఆశలు.. ఆశయాలు.. ఆకాంక్షలతో ఈ ఏడాది క్యాలెండర్‌ మొదలై పోయింది. మహిళల రంగవల్లికల సవ్వడి.. యువత కేరింతలు.. విద్యుత్‌ దీపాలంకరణలు.. కేక్‌ కటింగ్‌లు.. స్వీట్ల ప్యాకెట్లు.. మందుబాబుల సం దడి నడుమ 2024 వచ్చేసింది. 2023కి ఆవేదనగా వీడ్కోలు చెబుతూ.. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సంబురాలు అంబరాన్నం టాయి. డిసెంబరు 31న సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలు దాటిన మరుక్షణం బాణాసంచా వెలుగులు వెల్లివిరిశాయి. ‘హ్యాపీ న్యూ ఇయర్‌’ అంటూ కేకలు కెవ్వుమనిపించాయి. ఆ శుభాకాంక్షలతో నూతన సంవత్సరం పరవశించిపోయింది. జనాలు వీధుల్లోకి వచ్చి 2024ని స్వాగతించారు. దేవాలయాలు కళకళలాడాయి. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దేవా లయాల్లో తెల్లవారుజామునుంచే భక్తుల సందడి మొదలైంది. ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. 1న కూడా చర్చిలు, దేవాలయాల్లో వేడుకలు చేసుకున్నారు. కలెక్టర్‌ నివాసాన్ని, ప్రవేశ ద్వారాన్ని పూల మాలలతో అందంగా అలంకరించారు. కలెక్టర్‌ మాధవీలత, ఎస్పీ జగదీశ్‌తో పాటు జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లు, కార్యా లయాల వద్ద పళ్లు, స్వీట్లు, పూలగుచ్ఛాలతో ప్రభుత్వ సిబ్బంది, ప్రజలు క్యూకట్టారు. జిల్లా బాస్‌లు ఇద్దరూ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కడియంలోని నర్సరీ యజమానులు రంగుంరంగుల పూలు, మొక్కల ఆకర్షణీయ కూర్పుతో కొత్త ఏడాదికి స్వాగతం చెప్పారు. ఎస్పీ జగదీశ్‌ స్వీయ పర్యవేక్షణలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా శాంతిభద్రతలకు కావలి కాశారు. ఏదేమైనా.. వడివడిగా వచ్చేసిన 2024లో మొదటిరోజు ఆనందంగా వచ్చి.. సందడిగా పలకరించి వెళ్లింది.

నాయకుల ఇళ్ల వద్ద క్యూ

ఇది పొలిటికల్‌ ఇయర్‌. సాధారణ జనానికి ఇది న్యూయర్‌ కావచ్చు.కానీ రాజకీయనేతలకు అత్యంత ముఖ్యమైన న్యూఇయర్‌. ఇక 100 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపఽథ్యంలో టీడీపీ, జనసేన,వైసీపీ తదితర నేతలందరి ఇళ్ల వద్ద సందడి నెలకొంది. పార్టీకార్యకర్తలు, అభిమానులు, వివిధ శాఖల ఉద్యోగులు, అధికారులు భారీగా తరలివచ్చారు. వచ్చిన వారినందరినీ ప్రేమతో పలకరించి నేతలు ఫొటోలు దిగారు. రాజమహేంద్రవరంలో రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఇళ్ల వద్ద జనం క్యూ కట్టారు. రూరల్‌ నుంచి వేలాదిమంది కార్యకర్తలు, నేతలు తరలివచ్చిన గోరంట్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి అభిమానులు వచ్చారు. మహిళలు పెద్ద ఎత్తున హాజరై గోరంట్ల నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఇంటి వద్ద కూడా ఉదయం నుంచే అభిమానులు, పార్టీ కార్యకర్తల సందడి నెలకొంది. చంద్రబాబును మళ్లీ సీఎం చేయడానికి, ప్రజలంతా కొత్త నిర్ణయం తీసుకోవాలని యువనేత ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పిలుపు ఇచ్చారు. సిటీ నుంచి మాజీ కార్పొరేటర్లు అభిమానులు అఽధిక సంఖ్యలో తరలివచ్చారు.గుడా మాజీ చైర్మన్‌ గన్నికృష్ణ ఇంటి వద్ద అభిమానులతో సందడి నెలకొంది. జననేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ తన సతీమణి అనారోగ్యంతో హైద రాబాద్‌లో ఆసుపత్రిలో ఉండడంతో ఆయన వేడుకలు రద్దు చేసుకున్నారు. జనసేన సిటీ కోఆర్డినేటర్‌ అనుశ్రీ సత్యనారాయణకు జనసేన శ్రేణులు శుభాకాంక్షలు తెలిపాయి. వైసీపీలో తటస్థంగా ఉంటున్న ఏపీఐఐసి మాజీ చైర్మన్‌ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం ఇంటి వద్దకు కూడా జనం బారులు తీరారు. అభిమానులు, వివిధ పార్టీ కార్యకర్తలు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాజానగరం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొడ్డు వెంకటరమణ, జనసేన ఇన్‌చార్జి బత్తుల బలరామకృష్ణ ఇళ్ల వద్దకు కూడా సందడినెలకొంది. అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి పెద్దసంఖ్యలో శుభాకాంక్షలు తెలి పారు. కొవ్వూరులో మాజీ మంత్రి కెఎస్‌ జవహర్‌, ద్విసభ్య కమిటీ సభ్యుడు చౌదరి, రామకృష్ణలకు,జనసేన నేత టివి రామారావుకు శుభాకాంక్షలు తెలిపారు. గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో మద్దిపాటి వెంకట్రాజు, దేవరపల్లిలో మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వేంక టేశ్వరావు, నిడదవోలు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బూరుగు పూడి శేషారావవు, సీనియర్‌నేత కుందుల సత్యనారాయణకు జనం , పార్టీకార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. రాజమహేంద్ర వరంలో ఎంపీ మార్గాని భరత్‌రామ్‌, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలకు వైసీపీ కార్యకర్తలు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. కొవ్వూరులో మంత్రి తానేటివనిత, గోపాలపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేతలారి వెంకట్రావు, అనపర్తిలో ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, నిడదవోలులో ఎమ్మెల్యే జి.శ్రీనివాసనాయుడు ఇళ్ల వద్ద వేడుకలు నిర్వ హించారు. ఈ వేడుకలకు కొందరు ముందుగా తమ వర్గాలకు సమా చారం పంపించారు. కొంత మంది స్వచ్చందంగా వచ్చారు.

ఆలయాలు కిటకిట

నిడదవోలు, జనవరి 1 : కొత్త ఏడాది ఆరంభం సందర్భంగా సోమవారం జిల్లావ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడా యి. రాజమహేంద్రవరం, నిడదవోలు, బిక్కవోలులోని ప్రధాన ఆల యాలకు భక్తులు పోటెత్తారు.ఈ సందర్భంగా ఆలయాలను రక రకాల పువ్వులతో ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. ఆంగ్ల నూతన సంవత్సరం పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున దర్శించు కున్నారు. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం కోటసత్తెమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా పలువురు భక్తులు పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి ఆలయాలకు తరలివచ్చి దర్శించుకున్నారు.

Updated Date - Jan 01 , 2024 | 11:59 PM