Share News

నవయుగ వైతాళికుడు ‘కందుకూరి’

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:14 AM

స్త్రీ విద్య కోసం ఉద్యమించి ప్రచారం చేయడమే కాకుండా బాలికల కోసం పాఠశాలను ప్రారంభించిన నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులు అని రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ నాయకులు, రాజమహేంద్రి మహిళా విద్యాసంస్థల చైర్మన్‌ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు.

నవయుగ వైతాళికుడు ‘కందుకూరి’

వీరేశలింగం పంతులు జయంతిలో టీకే విశ్వేశ్వరరెడ్డి

రాజమహేంద్రవరం అర్బన్‌, ఏప్రిల్‌ 16: స్త్రీ విద్య కోసం ఉద్యమించి ప్రచారం చేయడమే కాకుండా బాలికల కోసం పాఠశాలను ప్రారంభించిన నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులు అని రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ నాయకులు, రాజమహేంద్రి మహిళా విద్యాసంస్థల చైర్మన్‌ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా రాజమహేంద్రవరంలోని కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల వద్ద ఆనంద గార్డెన్స్‌ స్మృతి వనంలోని కందుకూరి దంపతుల సమాధులకు టీకే విశ్వేశ్వరరెడ్డి తదితరులు పూలమాలలు దండలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ సభ్యులు ఎల్‌వీ ప్రసాద్‌, వెంకట్‌, శ్రీను పాల్గొన్నారు. ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో తెలుగుశాఖాధిపతి పీవీబీ సంజీవరావు మాట్లాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ఏబెల్‌ రాజబాబు, సూపరింటెండెంట్‌ మూర్తి, వై.స్వర్ణశ్రీ, డీవీ రమణమూర్తి, జి.వెంకటరమణ, ఎం.లలిత రమ్య, కె.రూపాదేవి పాల్గొన్నారు.

రాజమహేంద్రవరం కల్చరల్‌: స్థానిక కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల వద్ద ఆనంద్‌ గార్డెన్స్‌ కందుకూరి స్మృతి వనంలోని కందుకూరి వీరేలింగం పంతులు సమాధులకు రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ సభ్యులు టీకె విశ్వేశ్వరరెడ్డి, ఎల్‌వీ ప్రసాద్‌ పూలమాలలతో నివాళులర్పించారు.

రాజమహేంద్రవరం పురమందిరంలో వీరేశలింగం విగ్రహానికి జూబ్లీ లైబ్రరీ కార్యదర్శి, ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా సెంట్రల్‌ బ్యాంకు చైర్మన్‌ ఆకుల వీర్రాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శ్రీ పోతుల వీరభద్రరావు ట్రస్ట్‌ చైర్మన్‌, కళాగౌతమి బులుసు వి.ఎస్‌మూర్తి, ఆచార్యులు తెరపట్ల సత్యనారా యణ, ఎస్‌కేవీటీ తెలుగు శాఖాధిపతి పీవీసీ సంజీవరావు, టౌన్‌ హాల్‌ లైబ్రేరియన్‌ వీటీవీ సుబ్బారావు, కురుమళ్ల ఆంజనేయులు, గట్టి ప్రభు, బొబ్బిలి భాస్కరరావు, చీరల సీతారామనాయుడు పాల్గొన్నారు. కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాలలో ప్రిన్సిపాల్‌ పి.రాఘవకుమారి ఆధ్వర్యంలో అధ్యాపక, అధ్యాప కేతర సిబ్బంది, విద్యార్థినులు వీరేశలింగం పంతులు జయంతిని నిర్వహించారు.

Updated Date - Apr 17 , 2024 | 12:14 AM