Share News

జాతీయ సైన్స్‌ దినోత్సవం

ABN , Publish Date - Feb 29 , 2024 | 12:31 AM

జాతీయ సైన్స్‌ దినోత్సవం

జాతీయ సైన్స్‌ దినోత్సవం

అమలాపురం రూరల్‌, ఫిబ్రవరి 28: జన విజ్ఞాన వేదిక 37వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమలాపురం యూటీఎఫ్‌ హోం వద్ద బుధవారం జాతీయ సైన్స్‌ దినోత్సవం నిర్వహించారు. జేవీవీ పతాకాన్ని జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్‌ ఇఆర్‌ సుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. జిల్లా కోశాధికారి త్రినాథ్‌, సీనియర్‌ నాయకులు డి.శ్రీరామమూర్తి, బీఎన్‌ వెంకటేశ్వరరావు, డి.నాగేంద్రరాజు, వి.అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. భట్లపాలెం బీవీసీ క్యాంపస్‌లోని పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జేవీజీ రామారావు ఆధ్వర్యంలో సైన్స్‌ దినోత్సవం నిర్వహించారు. అధ్యాపకుల సహకారంతో విద్యార్థులు 12 వినూత్న ప్రాజెక్టులు రూపొందించగా హౌస్‌ ఆటోమేషన్‌ యాప్‌ డెవలెప్‌మెంట్‌ ప్రాజెక్టు మొదటి బహుమతి దక్కించుకుంది. ఈప్రాజెక్టును సీహెచ్‌ శ్రీహరి, జైపాల్‌, తారక్‌ రూపొందించారు. రహదారి ప్రమాదాలు ఎక్కువవుతున్న ఈరోజుల్లో వాటిని అరికట్టేందుకు ఆల్కాహాల్‌ డిటెక్టర్‌ను విద్యార్థి వి.జశ్వంత్‌ తయారు చేశాడు. వినూత్న ప్రాజెక్టు రూపొందించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.

Updated Date - Feb 29 , 2024 | 12:31 AM