నేషనల్ మెరిట్‌స్కాలర్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం
ABN , Publish Date - Aug 21 , 2024 | 12:21 AM
నేషనల్ మీన్స్ కం మెరిట్‌స్కాలర్‌షిప్ పరీ క్షలకు దరఖాస్తులు ఆన్‌లైన్, ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వ పరీక్షల నిర్వాహకులు నక్కా సురేష్‌కుమార్ చెప్పారు.
ముమ్మిడివరం, ఆగస్టు 20: నేషనల్ మీన్స్ కం మెరిట్‌స్కాలర్‌షిప్ పరీ క్షలకు దరఖాస్తులు ఆన్‌లైన్, ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వ పరీక్షల నిర్వాహకులు నక్కా సురేష్‌కుమార్ చెప్పారు. 2024 డిసెంబరు 8న జరిగే పరీక్షకు పేర్లు నమోదు చేసుకునేందుకు సెప్టెం బరు 6వతేదీ ఆఖరు అన్నారు. విద్యార్థి ఆధార్‌కార్డులో ఉన్న విధంగా పుట్టిన తేదీ, తండ్రిపేరు నమోదు చేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జిల్లాప రిషత్, మండల పరిషత్, మున్సిపల్ ఎయిడెడ్, వసతి సౌకర్యంలేని ఆదర్శ పాఠశాలల్లో 8వతరగతి చదువుతూ ఏడాదికి కుటుంబానికి రూ3.5లక్షలు ఆదాయం మించకుండా ఉన్న విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులన్నారు. పరీక్షలు రాసేటప్పటికి అన్నిధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఓసీ, బీసీ విద్యార్థులు పరీక్ష రుసుం రూ.100, ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు రూ.50 చెల్లించాలన్నారు ఆన్‌లైన్‌లో ఇచ్చిన దరఖాస్తులో ఎస్‌బీఐ లింక్ ద్వారా ఫీజు చెల్లించాలన్నారు. సమాచారం కోసం ప్రభుత్వ పరీక్షల సంచాలకులు వెబ్ సెట్, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు.