Share News

ఉత్తమ క్రీడాకారులను తయారు చేస్తాం

ABN , Publish Date - Dec 22 , 2024 | 12:58 AM

దివాన్‌చెరువు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్‌లో విశ్వవిద్యాలయంలో మరిన్ని క్రీడావసతులు సమకూర్చి ఉత్తమ క్రీడాకారులను తయారు చేసేందుకు కృషి చేస్తామని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వై.శ్రీనివాసరావు అన్నారు. నన్నయ వర్శిటీలో అంతర్‌ కళాశాలల బెస్ట్‌

ఉత్తమ క్రీడాకారులను తయారు చేస్తాం
బెస్ట్‌ఫిజిక్‌ క్రీడాకారులతో నన్నయ విశ్వవిద్యాలయ అధికారులు

‘నన్నయ’ వీసీ ఆచార్య శ్రీనివాసరావు

అంతర్‌ కళాశాలల బెస్ట్‌ఫిజిక్‌, రెజ్లింగ్‌ పోటీలు,

నన్నయ విశ్వవిద్యాలయం జట్టు ఎంపికల ప్రారంభం

దివాన్‌చెరువు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్‌లో విశ్వవిద్యాలయంలో మరిన్ని క్రీడావసతులు సమకూర్చి ఉత్తమ క్రీడాకారులను తయారు చేసేందుకు కృషి చేస్తామని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వై.శ్రీనివాసరావు అన్నారు. నన్నయ వర్శిటీలో అంతర్‌ కళాశాలల బెస్ట్‌ ఫిజిక్‌, పురుష విశ్వవిద్యాలయం జట్టు ఎంపికలు, రెజ్లింగ్‌ పురుషుల, స్త్రీల జట్టు ఎంపికలను శనివారం వీసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఈ పోటీలకు అనుబంధ కళాశాలల నుంచి రెజ్లింగ్‌కు 45 మంది, బెస్ట్‌ ఫిజిక్‌కు 32 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఆదికవి నన్నయ విశ్వవిదాయలయం బెస్ట్‌ ఫిజిక్‌ పోటీలు 60,65,70,75,80,85 కిలోల కేటగిరిల్లో నిర్వహించగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి మూడు స్థానాల విజేతలకు పతకాలను అందించి అభినందించారు.

ఎంపికైన వారి వివరాలు...

60 కిలోల కేటగిరిలో వై.భరత్‌ (ఆదిత్య కళాశాల, సూరంపాలెం), షేక్‌ వల్లీ (పీఆర్‌ కళాశాల, కాకినాడ), ఆర్‌కే విశ్వనాథమ్‌ (ఐడియల్‌ కళాశాల, కాకినాడ) తొలి మూడుస్థానాల్లో నిలిచారు. 65 కిలోల కేటగిరిలో ఎం.సాయి లోకేశ్‌(సీఆర్‌ రెడ్డి కళాశాల, ఏలూరు), ఎస్‌. దినేష్‌కుమార్‌ (పీఆర్‌ ప్రభుత్వ కళాశాల, కాకినాడ) ఎన్‌.నాగసందీప్‌ (శ్రీకాకతీయ కళాశాల, భీమడోలు), 70 కిలోల కేటగిరిలో ఎస్‌కే మన్సూర్‌(విష్ణు కళాశాల, భీమవరం), ఎ.జగదీష్‌ (ఏబీఎన్‌ఎన్‌ కళాశాల, పాలకొల్లు), పి.భానుచంద్ర (ఆదిత్య కళాశాల, కాకినాడ) 75 కిలోల కేటగిరిలో ఎల్‌.వి.సూర్యప్రకాశ్‌ (పీఆర్‌ కళాశాల, కాకినాడ), ఎం.జగదీష్‌ మణికంఠ(డాక్టర్‌ బీవీ రాజు, భీమవరం), జె.దైవప్రసాద్‌(పీఆర్‌ కళాశాల, కాకినాడ), 80 కిలోల కేటగిరిలో టి.ప్రశాంత్‌ (ఐడియల్‌ కళాశాల, కాకినాడ), యు.దిలీప్‌కుమార్‌ (ఏబీఎన్‌ కళాశాల, కొవ్వూరు)ఎన్‌.సుకుమార్‌ (పీఆర్‌ కళాశాల, కాకినాడ) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. 85 కిలోల కేటగిరిలో వై.మోహనసాయిఅభిషేక్‌ (పీఆర్‌ కళాశాల, కాకినాడ) కె.జయకర్‌ (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తణుకు) ప్రథమ, ద్వితీయ స్థానాలను గెలుచుకున్నారు. టీమ్‌ చాంపియన్‌ షిప్‌ కాకినాడలోని పీఆర్‌ ప్రభుత్వ కళాశాలకు దక్కింది. మిస్టర్‌ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం 2024-25 ట్రోఫీని టి.ప్రశాంత్‌ (ఐడియల్‌ కళాశాల, కాకినాడ) కైవసం చేసుకున్నారు. బెస్ట్‌ ఫిజిక్‌ పురుషుల టీమ్‌ ఎంపికలో భాగంగా ఉత్తమ ప్రతిభకనబరిచిన టి.ప్రశాంత్‌ (ఐడియల్‌ కళాశాల, కాకినాడ), ఎల్‌.వి.సూర్యప్రకావ్‌ (పి.ఆర్‌ ప్రభుత్వకళాశాల,కాకినాడ) ఎస్‌.కె.మన్సూర్‌ (విష్ణుకళాశాల, భీమవరం) వై.భరత్‌ (ఆదిత్యకళాశాల, సూరంపాలెం)లను విశ్వవిద్యాలయ జట్టుగా ఎంపిక చేశారు. పంజాబ్‌లోని గురుదాస్‌ విశ్వవిద్యాలయంలో జరిగే అఖిల భారత పోటీలకు వీరిని పంపనున్నారు.

రెజ్లింగ్‌ మహిళా పోటీల్లో 50 నుంచి 76 కిలోల కేటగిరి వరకూ జరిగాయి. వీటిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పది మంది క్రీడాకారులను జట్టుగా ఎంపిక చేశారు. అలాగే రెజ్లింగ్‌ పురుషుల పోటీల్లో ప్రీస్టైల్‌ విధానంలో 57 నుంచి 97 కిలోల కేటగిరి వరకూ క్రీడాకారులు పాల్గొన్నారు. రెజ్లింగ్‌ గ్రీకో రోమన్‌ విధానంలో 55 నుంచి 67 కిలోల కేటగిరి వరకూ క్రీడాకారులు హాజరై కుస్తీలో ప్రతిభ ప్రదర్శించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని పంజాబ్‌లోని గురుదాస్‌ విశ్వవిద్యాలయంలో జరిగే అఖిల భారత పోటీలకు నన్న య యూనివర్శిటీ జట్టుగా పంపనున్నారు. కార్యక్రమంలో కార్యనిర్వాహకచైర్మన్లు కె.సుబ్బారావు, డి.జ్యోతిర్మయి, కార్యదర్శి ఎంవీవీఎస్‌ మూర్తి, పరిశీలకుడు రమణ ఎంపిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 12:58 AM