Share News

నన్నయ పరిధిలో 144 సెక్షన్‌

ABN , Publish Date - May 16 , 2024 | 01:41 AM

భారత ఎన్ని కల సంఘం జారీచేసిన నోటిఫికేషన్‌ మేరకు పోలింగ్‌ ప్రక్రియ తర్వాత ఈవీఎంలు, వీవీప్యాట్‌లను వెలుగు బందలోని ఆదికవి నన్నయ విశ్వవి ద్యాలయంలోని స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరిచామని, 24 గంటలూ భద్ర తా బలగాలు కాపలా కాస్తున్నాయని జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత బుధవా రం ఒక ప్రకటనలో తెలిపారు.

నన్నయ పరిధిలో 144 సెక్షన్‌

దివాన్‌చెరువు,మే15: భారత ఎన్ని కల సంఘం జారీచేసిన నోటిఫికేషన్‌ మేరకు పోలింగ్‌ ప్రక్రియ తర్వాత ఈవీఎంలు, వీవీప్యాట్‌లను వెలుగు బందలోని ఆదికవి నన్నయ విశ్వవి ద్యాలయంలోని స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరిచామని, 24 గంటలూ భద్ర తా బలగాలు కాపలా కాస్తున్నాయని జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత బుధవా రం ఒక ప్రకటనలో తెలిపారు. లెక్కింపు పూర్తయ్యేవరకూ 144 సెక్షన్‌ అమల్లోకి తెచ్చామని, ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు తప్ప ఒక కి.మీలోపు ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు చట్టవిరుద్ధంగా సమావేశమవ్వడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. నన్నయ విశ్వవిద్యాలయంలో వచ్చేనెల 4న ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేవరకూ స్ట్రాంగ్‌రూమ్‌ల పరిధిలో ఒక కిలో మీటరు మేర ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని తెలిపారు. ఈ ఉత్తర్వుల ఉల్లంఘన జరిగితే భారతీయ శిక్షాస్మృతి 1860లోని సెక్షన్‌ 188 ప్రకారం కఠినంగా చర్యలుంటాయని స్పష్టం చేశా రు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వచ్చాయని కలెక్టర్‌ తెలియజేశారు.

Updated Date - May 16 , 2024 | 07:25 AM