నన్నయలో నేడు తెలుగు జాతీయ సదస్సు
ABN , Publish Date - Sep 28 , 2024 | 12:34 AM
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, స్ఫూర్తి కుటుంబం సంయుక్త ఆఽధ్వర్యంలో నేడు తెలుగు జాతీయ సదస్సు జరుగుతుందని సదస్సు కన్వీనర్, ఆదికవి నన్నయ విఽశ్వవిద్యాలయం తెలుగుశాఖ సహాయ ఆచార్యుడు తరపట్ల సత్యనారాయణ తెలిపారు.
దివాన్‌చెరువు, సెప్టెంబరు 27: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, స్ఫూర్తి కుటుంబం సంయుక్త ఆఽధ్వర్యంలో నేడు తెలుగు జాతీయ సదస్సు జరుగుతుందని సదస్సు కన్వీనర్, ఆదికవి నన్నయ విఽశ్వవిద్యాలయం తెలుగుశాఖ సహాయ ఆచార్యుడు తరపట్ల సత్యనారాయణ తెలిపారు. ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా వీసీ ఆచార్య వై.శ్రీనివాసరావు, విశిష్ట అతిఽథిగా నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ రెక్టార్ ఆచార్య పి.వరప్రసాదమూర్తి, అతిఽథులుగా మద్రాస్ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య విస్తాలి శంకర్, యోగి వేమన విశ్వవిద్యాలయం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎన్.ఈశ్వరరెడ్డి సూఫర్తి కుటుంబం అథర్ వి.సదాశివరావు, సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల సహాయ ఆచార్యులు తాతా దీప్తి ప్రసన్న హాజరై ప్రసంగిస్తారన్నారు. అదేరోజు సాయంత్రం జరిగే ముగింపు సభకు రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి సదస్సు ప్రతినిధులు హాజరవుతున్నారని సత్యనారాయణ అన్నారు.